Messege oriented ‘SAACHI’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “సాచి ”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 03.03.2023
సమర్పణ : సత్యానంద్
బ్యానర్: విధాత ప్రొడక్షన్స్
కథ,మాటలు, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, దర్శకత్వం : వివేక్ పోతగోని
నిర్మాతలు: ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతగోని
నటీనటులు: సంజన రెడ్డి, గీతిక రధన్, స్వప్న, అశోక రెడ్డి మూలవిరాట్, టివి రామన్, ఏవిఎస్ ప్రదీప్, తదితరులు
సంగీతం : కెవి భరద్వాజ్
పీఆర్ఒ: శ్రీధర్

రొటీన్ చిత్రాలకు భిన్నంగా బిందు అనే ఒక నాయి బ్రమ్మిన్ అమ్మాయి నిజ జీవిత గాధను ఆధారంగా చేసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చక్కగా తెరకెక్కించిన చిత్రం “సాచి”.సత్యానంద్ గారి సమర్పణ లో విధాత ప్రొడక్షన్స్ పతా కంపై వివేక్ పోతగోని దర్శకత్వంలో ఉపేన్ నడిపల్లి మరియు వివేక్ పోతగోని లు సంయుక్తంగా నిర్మించిన .ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సాచి” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
ఆడ మగ అనే తేడా లేకుండా మన కళ్ళ మీద మనం నిలబడాలి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుంది. కుల వృత్తికి మించిన పని లేదు అనే సిద్ధాంతం ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. సంజనా రెడ్డి (సాచి) ఒక బార్బర్ షాప్ నడుపుతూ ఉంటుంది, ఆ అమ్మాయి తండ్రి చక్రపాణి (అశోక్ రెడ్డి) అనారోగ్యంతో ఉన్నప్పుడు సాచి అన్ని తానై తండ్రికి సేవలు చేస్తుంది. అనుకోని సందర్భంలో తండ్రిని కొల్పతోంది సాచి. ఒక పిరికి అమ్మాయి మల్లిక భానవాత్ అనే యువకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంటుంది. ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి ? చివరికి సాచి ఏం చేసింది వంటి విషయాలు తెలియాలంటే సాచి సినిమా చూడాల్సిందే.


నటీ నటుల పనితీరు
బిందు అనే ఒక నాయి బ్రమ్మిన్ అమ్మాయి నిజ జీవిత గాధ “సాచి” మహిళా సాధికారత కు సంభందించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సంజన రెడ్డి, గీతిక రధన్ హీరోయిన్స్ గా నటించగా, చెల్లి స్వప్న, అశోక రెడ్డి మూలవిరాట్, టివి రామన్, ఏవిఎస్ ప్రదీప్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అందరూ వారి పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ప్రస్తుత సమాజంలో జరిగే అన్ని అంశాలను తెలుపుతూ ప్రతి మహిళ దైర్యంగా ముందుకు వెళ్ళాలి అధైర్య పడి వెనకడుగు వేయకూడదు అని ఈసాచి సినిమాలో దర్శకుడు చాలా చక్కగా చూపించడం జరిగింది.ముఖ్యంగా కులవృత్తి మించిన వృత్తి లేదు అనే పాయింట్ ను అందరికి అర్థం అయ్యే విధంగా తెలియజేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, మరియు దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న వివేక్ పోతగోని తన ప్రతిభను కనబరిచారు. కెవి భరద్వాజ్ సంగీత దర్శకునిగా మంచి సాంగ్స్ తో పాటు గుడ్ రీ రికార్డింగ్ చేశారు. ప్రసన్న కుమార్ పాటలు, పెద్దింటి అశోక్ కుమార్, వివేక్ పోతగోని మాటలు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. సత్యానంద్ గారి సమర్పణ లో విధాత ప్రొడక్షన్స్ పై ఫిల్మ్ స్టార్స్ మేకర్ పై ఉపేన్ నడిపల్లి మరియు వివేక్ పోతగోని లు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.అత్యతం ఆసక్తికరంగా నడిచే ఈ సినిమా అందరిని ఆలోచింప జేస్తుంది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ “సాచి” సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here