Minister Srinivas Goud Released the birthday song on the occasion of KTR’s birthday

రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో రూపొందించిన బర్త్ డే సాంగ్ CD లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి ని సాధించి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి గా KTR గారు రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలను సృష్టింస్తున్నారన్నారు. KTR జన్మదినం సందర్భంగా వారి స్ఫూర్తితో సేవ కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి కోరారు.
KTR గారి బర్త్ డే సందర్భంగా బర్త్ డే సాంగ్ రూపకర్త, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ KTR గారి బర్త్ డే ను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆడియో, వీడియో సాంగ్ లను నేటి యువతరం కు చైతన్య స్ఫూర్తి నింపాలనే లక్ష్యం తో రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ బర్త్ డే స్పెషల్ గా రవి ముల్కపల్లి సంగీతం లో నారప్ప ఫేమ్ సింగర్ వరం చేత పాటను పాడిoచచామన్నారు. మంత్రి KTR గారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో తన మార్క్ ను చాటుతున్నారన్నారు. హైదరాబాద్ నగరం ను గ్లోబల్ సిటీ గా అభివృద్ధి చేయటం తో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి కి కృషి చేస్తున్నారన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ రాజేశం గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, మాజీ MLA సత్యనారాయణ గౌడ్, గుడాల రాజేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here