MS Raju’s upcoming directorial titled ‘7 Days 6 Nights’

On the occasion of renowned director MS Raju’s birthday, his upcoming directorial has been officially announced by the makers. The film is titled ‘7 Days 6 Nights’ and it will be presented by Sumanth Arts Productions under the banner of Wild Honey Production in association with Wintage Pictures and ABG Creations. Sumanth Ashwin and Rajnikant S will be producing the film.

MS Raju is penning the story and he will be directing the film. Samarth Gollapudi will be composing the music and Nani Chamidisetty will be handling the cinematography.

Speaking on the occasion, Sumanth Ashwin said “I am happy that Sumanth Arts Productions is back in full glory by presenting this movie. My father MS Raju garu, as a director, is set to score another big hit with 7 Days 6 Nights. He proved his mettle with Dirty Hari and I hope this new film will give him an even bigger success. We are planning to commence shoot from 7th June. The film will be shot in Hyderabad, Goa, Mangalore and Andaman and Nicobar. The casting of the movie is not revealed for now.”

MS Raju said “The film will catch all sector of the audience. I am blending comedy and romance with some memorable emotional moments. It will boast of top-tier technical values. My last directorial film Dirty Hari boosted my confidence of making new genre movies. On the occasion of my birthday I am always thankful to Guduru Sivaramakrishna Garu of SPJ Creations who bankrolled Dirty Hari. He is always with me and this film too.”

Technical crew:
Music: Samarth Gollapudi
Cinematography: Nani Chamidisetty, PRO: Pulagam Chinnarayana, Publicity: Eshwar Ande
Second unit directors: Ashwin Kashyap, UV Sushma
Line Producer: J Srinivasa Raju
Executive Producer: UV Sushma
Co-producer: Manthena Ramu
Producers: Sumanth Ashwin M, Rajnikant S
Written and Directed by: MS Raju

మెగా హిట్ చిత్రాల రారాజు ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’

ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ విజయాల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎంఎస్ రాజు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగానూ గత ఏడాది ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.

ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్నారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. దీనికి నిర్మాతలుగా సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్ వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఎన్నో మెగా హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ ‘7 డేస్ 6 నైట్స్’ సమర్పిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుడుతున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నాం. కొంత హైదరాబాద్… మరికొంత గోవా, మంగుళూరు, అండమాన్ నికోబర్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. ‘డర్టీ హరి’తో తన సత్తా చూపించిన నాన్నగారు, మరో విభిన్నమైన జానర్ లో ఈ సినిమా చేయనున్నారు” అని అన్నారు.

ఎంఎస్ రాజు మాట్లాడుతూ “యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. సంగీతం, ఇతర సాంకేతిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తాం. గత ఏడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి, చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసలు మరువలేనివి. చాలామంది పెద్దవాళ్ళు నేను గొప్పగా తీశానని మెచ్చుకున్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ‘డర్టీ హరి’కి నాకు అండగా నిలబడి, నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నిర్మాత గూడూరు శివరామకృష్ణగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ చిత్రానికి కూడా ఆయన వెన్నంటే ఉంటారు. ‘డర్టీ హరి’ని మించి ఈ సినిమా ఉంటుంది” అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, పబ్లిసిటీ: ఈశ్వర్ అందే, సెకండ్ యూనిట్ డైరెక్టర్స్: అశ్విన్ కశ్యప్, యువి సుష్మ, లైన్ ప్రొడ్యూసర్: జె. శ్రీనివాసరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్: మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here