Murder & Mystery Crime Thriller “ప్లాన్B” Movie Review

సినిమారంగం రివ్యూ రేటింగ్ : 3/5*
విడుదల తేదీ : 17.09.2021
సినిమా  : “ప్లాన్ ‘B’ “
జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళీశర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్ శర్మ, శాని, సబీనా, నవీనారెడ్డి, మీనా వాసు, రాజేంద్ర, చిత్రం శ్రీను, దయానంద రెడ్డి, డెబోరా, బన్ను, వర్ధన్ పెరుర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : ఎవిఆర్ మూవీ వండర్స్
నిర్మాత : ఏవీఆర్
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కెవి రాజమహి
కెమెరా మాన్ : వెంకట్ గంగాధరి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  : శక్తికాంత్ కార్తీక్ (ఫిదా ఫేమ్)
ఎడిటర్ : ఆవుల వెంకటేష్
యాక్షన్ : శంకర్ ఉయ్యాల
ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్
డిటియస్ : రాధాకృష్ణ
డిఐ కలరిస్ట్ :  ప్రేమ్ (ప్రసాద్ ల్యాబ్స్)
సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె
పి.ఆర్.ఓ : సాయి సతీష్

ఈ మధ్య చిన్న సినిమాలు కొత్త కథలతో డీఫ్రెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్స్ పరంగా పెద్ద సిని మాల రేంజ్ లో వసూళ్లు సాధిస్తున్నాయి.ప్రేక్షకులకు చిన్న సినిమా,పెద్ద సినిమా అనే తేడా లేకుండా కథ బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే టాలీవుడ్ లో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలు ఎక్కువగా విడుదలై అనేక విజయాలు సాధిస్తు న్నాయి. తాజాగా సరికొత్త కథ కథనం తో థ్రిల్లింగ్ అంశాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం  “ప్లాన్ B” . శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర, బ్లాక్ స్టార్ శాని మరియు నవీనారెడ్డి నటీ నటులుగా కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 17 న  ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
రిటైర్డ్‌ పోలీసు అధికారి రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) హత్యకు గురవుతాడు తాను చనిపోయే ముందు తన కూతురు అవంతిక (డింపుల్)కు రూ. 10 కోట్లు ఇచ్చి అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించ బడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి) ప్రైవేట్‌ టీచర్‌ అవంతిక భర్త రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. విశ్వనాథ్ ఫోన్ నుంచి తన తండ్రి ఫోన్‌కు హత్యకు గురైన ఫోటోలు వెళ్తాయి. దాంతో విశ్వనాథ్ హత్య గురించి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లాయర్ హత్య కేసు దర్యాప్తును ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాశ్) చేపడతారు. లాయర్ విశ్వనాథ్ హత్య వెనుక అసలు కారణం ఏమిటి? ఈ మర్డర్ మిస్టరీలో కీలకంగా మారిన గౌతమ్ (సూర్య వశిష్ట) ప్లాన్ ఏమిటి? లాయర్ విశ్వనాథ్‌ను, రిషి (అభినవ్ సర్దార్), రాజేంద్ర,లను ఎవరు? ఎందుకు హత్య చేస్తారు? అవంతికకు తండ్రి రాజేంద్ర ఇచ్చిన 10 కోట్ల రూపాయలు ఎలా మాయమయ్యాయి? మాయమైన ఆ డబ్బు పోలీసులకు లభించినపుడు ఇవి నకిలీ కరెన్సీగా ఎలా మారాయి? ఎవరు మార్చారు?  లాయర్ విశ్వనాథ్ హత్య కేసు విచారణలో ఏసీపీ(మురళీ శర్మ)కు ఎలాంటి నిజాలు తెలిశాయి, వాటిని తను ఎలా ఛేదించాడు.అసలు ప్లాన్ B అంటే ఏమిటి ? అది ఎవరు చేశారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే సినిమా థియేటర్స్ కి వెళ్లి చూడవలసిందే.

నటీనటుల పనితీరు
నటుడు శ్రీనివాస్‌ రెడ్డి ఎప్పటి మాదిరే తనదైన నటనా శైలితో ఆకట్టుకున్నాడు. సినిమాకు ఎంతో కీలకమైన పాత్రలో లాయర్‌ విశ్వనాథ్‌ గా జీవించేశాడు. గౌతమ్‌ పాత్రలో సూర్య వశిష్ట (త్రివిక్రమ్ శ్రీనివాస్ అసిస్టెంట్ స్వర్గీయ సత్యం కుమారుడు) పాత్ర ఆకట్టుకొనేలా ఉంటుంది. ఈ కథకు వెన్నముకగా నిలవడమే కాకుండా కొత్త వాడు అనే ఫీలింగ్‌ను కలిగించ కుండా తనదైన నటనతో మెప్పించాడు. ఫైట్‌ సీన్స్‌లో కూడా అవలీలగా నటించాడు. విలన్ గా నటించిన కునాల్‌ శర్మ  తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఏసీపీ గా నటించిన  మురళి శర్మ పోలీసు అధికారి పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్‌ ఆకట్టు కుంటుంది. అభినవ్ సర్దార్, నవీనా రెడ్డి, సబీనా తదితరులంతా వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు రాజమహి కృష్ణవంశీ, రాఘవేంద్ర రావు తదితరుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి విశేష అనుభవంతో కథను చక్కగా థ్రిల్లింగ్‌గా, చివర్లలో ఎమోషనల్‌గా మలచడంలో చక్కటి పరిణతిని చూపించాడు.థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పాయింట్స్‌తో పలు రకాల ట్విస్టులతో దర్శకుడు రాజమహి రూపొందించిన కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి కథ ఒపెనింగ్ సీన్‌లోనే మర్డర్ కావడంతో ఆ పాత్రపై ఆసక్తి పెరుగుతుంది. కానీ క్లైమాక్స్‌లో శ్రీనివాస్ రెడ్డి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే అప్పటి వరకు అనేక సందేహాలు ఉన్న కథకు శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ తో అద్భుత మైన జస్టిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు.ఈ సినిమాలో అనేక ట్విస్టులు ఉండటంతో కథలో ఏం జరుగుతుందనే ఉత్సుకత పెరుగుతుంది.అయితే ట్విస్టులను డీల్ చేసిన విధానం దర్శకుడు రాజమహి ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. మర్డర్ మిస్టరీకి కావాల్సిన లైటింగ్‌తో ప్రత్యేక మూడ్‌ను క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. కథలో ఉండే ట్విస్టులను ఆవుల వెంకటేష్ చక్కగా పేర్చాడు. ఆవుల వెంకటేష్ ప్రతిభతోనే కథ ఆసక్తి కరంగా సాగింది. ప్రధానంగా శక్తికాంత్ కార్తీక్ బీజీఎం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సౌండ్, ఆర్ట్స్ విభాగాల పనితీరు బాగుంది. థ్రిల్లింగ్, క్రైమ్, మర్డర్ మిస్టరీతో కూడిన చిత్రంగా “ప్లాన్‌ B” రూపొందింది. ప్రీ క్లైమాక్స్‌లో కృత్రిమ గర్భధారణ అంశం సినిమాను మరో లెవెల్ తీసుకెళ్తుంది. కృత్రిమ గర్భధారణ ట్విస్టుతో సినిమా ఫీల్‌గుడ్‌గా మారుతుంది.తన తొలి చిత్రంతోనే దర్శకుడు రాజమహి ఆకట్టుకొన్నారు. వైవిధ్యం, క్లిష్టమైన కథను ఎంచుకొని మెప్పించడం ఆయన టాలెంట్‌కు అద్దం పట్టిందని చెప్పవచ్చు. మర్డర్ మిస్టరీ, థ్రిలర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

Cinema rangam.com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here