‘Music Shop Murthy’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్  : ఫ్లై హై సినిమాస్‌
సినిమా : ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 14.06.2024
నిర్మాతలు : హర్ష గారపాటి, రంగారావు గారపాటి
దర్శకత్వం: శివ పాలడుగు
నటీనటులు: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి, పటాస్ నాని తదితరులు
సంగీతం: పవన్
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్
ఎడిటర్‌ : నాగేశ్వర్
పి. ఆర్. ఓ : సాయి సతీష్


ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై అజయ్ ఘోష్, చాందినీ చౌదరి నటీ నటులుగా శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి, రంగారావు గారపాటి లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 14న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ

వినుకొండలో మ్యూజిక్ షాప్ నడుపుతున్న 50 ఏళ్ల మూర్తి(అజయ్ ఘోష్) ఓ నడుపుతూ ఉంటాడు. నేటి ట్రెండ్‌లో పాటలు వినే పద్దతులు మారినా కూడా మూర్తి  పాత కాలంలా క్యాసెట్లు అద్దెకిచ్చి, పాటలు ఎక్కించడం, ఫంక్షన్స్ కి సౌండ్ సెటప్ పెట్టి పాటలు ప్లే చేయడం చేస్తూ ఉంటాడు.అయితే మూర్తి సంపాదనతో ఇంటిని ముందుకు సాగించడం కష్టమని, అతని భార్య (ఆమని) కూడా కష్టపడుతూ ఉంటుంది. అయితే డీజేగా మారి మ్యూజిక్ కొడితే డబ్బులు ఎక్కువగా వస్తాయని ఒక బార్ యజమాని చెప్పడంతో తన ఫ్యామిలీ కష్టాలు పడకూడదని భావించిన మూర్తి.దాంతో డీజే అవ్వాలని అనుకుంటాడు.

మరో వైపు అంజనా(చాందిని) కూడా డీజే అవ్వాలని అనుకుంటుంది.కానీ ఓ ఆడిపిల్ల అలా పబ్బుల్లో డీజే వాయించడం ఏంటి? అని ఆమె తండ్రి(భాను చందర్) వాదిస్తుంటాడు. తండ్రీ కూతుళ్లకు ఎప్పుడూ ఈ విషయంలో గొడవ జరుగుతూనే ఉంటుంది.అయితే మూర్తి, అంజనా ఒకసారి కలవాల్సి వస్తుంది? ఆ తరువాత ఏం జరిగింది? మూర్తి జీవితంలో అంజనా తీసుకొచ్చిన మార్పులేంటి? వీరిద్దరి ప్రయాణంలో ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు మూర్తి డి.జే అవ్వాలనుకున్న కలను , కోరికను తీర్చుకున్నాడా ? లేదా? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
ఇప్పటివరకు మనం అజయ్ ఘోష్‌ని విలన్‌గా, కమెడియన్‌గా చూశాం. ఇందులో  ఓ మిడిల్ క్లాస్ తండ్రి గా ఎలా ఉంటాడో అనేలా తన నటనతో ఏడ్పించేశాడు. తను ఇందులో నవ్వించడమే కాకుండా గుండెల్ని కదిలించేలా చాలా చక్కగా నటించాడు. మోడ్రన్ అమ్మాయి పాత్రలో నటించిన చాందిని తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత శుభలగ్నం, ఆ నలుగురు వంటి సినిమాల్లో దక్కినట్టుగా ఆమనికి మంచి పాత్ర  దక్కింది. అమిత్ శర్మ, భాను చందర్.దయానంద్ రెడ్డి, పటాస్ నాని లతో పాటు ఇందులో నటించిన వారంతా తమకిచ్చిన పాత్రల పరిధి మేరకు చాలా చక్కగా నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణులు పనితీరు
మ్యూజిక్ పై ఉన్న ఆసక్తి ఉన్న ఒక 50 ఏళ్ళ వ్యక్తి సిటీకి వచ్చి డి.జే అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. అలాగే తన ఫ్యామిలీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందనే అంశాలతో మూర్తి అనే పాత్ర చుట్టూ చక్కని కథ, కథనం, మాటలు రాసుకొన్నాడు దర్శకుడు. తనకిది మొదటి సినిమా అయినా యాభై ఏళ్ల వ్యక్తిని మెయిన్ లీడ్‌గా పెట్టుకొని నేటి యువతకు తగ్గట్టు కామెడీ, ఎమోషన్స్ జోడించి రెండున్నర గంటల సేపు ప్రేక్షకుడ్ని  సీట్ లో  కూర్చునేలా చేయడంలో దర్శకుడుగా శివ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.

పవన్ అందించిన సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసికెళ్ళిందని చెప్పచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చూసే ప్రేక్షకులను ఏడిపించేస్తుంది. సినిమాటోగ్రఫర్ శ్రీనివాస్ అందించిన విజువల్స్ బాగున్నాయి. నాగేశ్వర్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై నిర్మాతలు హర్ష గారపాటి, రంగారావు గారపాటి లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌ పుస్కలంగా ఉన్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.Com     Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here