Nagachaitanya interview about Venkymama

‘మజిలీ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య విక్ట‌రీ వెంక‌టేష్ తో కలిసి నటిస్తున్న భారీ ముల్టీస్టారర్  ‘వెంకీమామ‌’. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి. సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  విక్ట‌రీ వెంక‌టేష్  పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ఇంటర్వ్యూ..

ఇద్దరు మామయ్యలతో కలిసి పని చేయడం ఎలా అన్పించింది?
– ఒక మామయ్య కెమెరా వెనకా, ఒక మావయ్య కెమెరా ముందు మంచి సపోర్ట్‌నిచ్చారు. ఈ షూటింగ్‌లో సినిమాకి సంబంధించిన ఏదో ఒక యాస్పెక్ట్‌లో కొత్త విషయాన్ని సురేష్‌ మావయ్య దగ్గర నేర్చుకున్నాను.

మొదటిసారి వెంకటేష్‌గారితో ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా నటించారు కదా! ఆయన దగ్గరనుండి ఏమైనా నేర్చుకోవడం జరిగిందా?
– వెంకీమామ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా పర్సన్‌గా ఆయన ఆన్‌సెట్‌ ఎలా బిహేవ్‌ చేస్తారు. ఎలా కామ్‌గా, పాజిటివ్‌గా ఉంటారు అనేది అబ్జర్వ్‌ చేశాను. చాలామంది అంటుంటారు వెంకటేష్‌గారికి నో హేటర్స్‌. నో నెగిటివిటీ అని. ఆయన్ని అబ్జర్వ్‌ చేశాక ఆయన్ని ఎందుకు అలా అంటారు అనేది నాకు అర్థమైంది. ఆయనతో చేయడం ఏ యాక్టర్‌కైనా బ్లెస్సింగ్‌. ఎమోషనల్‌ సీన్లలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌, కామెడీ టైమింగ్‌ ఇవన్నీ ఆయనతో నటించే ఎవరికైనా ప్లస్సే.

రియల్‌ లైఫ్‌లో కూడా మీరిద్దరూ మామ-అల్లుళ్లు కావడం ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అయ్యింది?
– నిజం చెప్పాలంటే రియల్‌ లైఫ్‌లో మేమిద్దరం చాలా క్వైట్‌. సైలెన్స్‌లోనే ఒక బాండింగ్‌, ఎటాచ్‌మెంట్‌ ఉంటుంది. కానీ సినిమాలో ఎక్కువ డైలాగులు చెప్పడం, హై ఎమోషన్స్‌లాంటివి చేశాం. మొదటివారం ఎడాప్ట్‌ అవ్వడానికి కొంచెం టైమ్‌ పట్టింది. ఎందుకంటే చెన్నై నుండి కూడా మా ఇద్దరి రియల్‌ లైఫ్‌లో జెన్యూన్‌ బాండింగ్‌ ఉంది. నా చిన్నప్పట్నుంచీ ఆయన నన్ను అబ్జర్వ్‌ చేస్తూనే ఉన్నారు కాబట్టి సెట్లో అలా చేయడం కొత్తగా అన్పించేది. రేపు సినిమా చూశాక ఆడియన్స్‌ కూడా ఈ రెండు క్యారెక్టర్ల మధ్య కూడా రియల్‌ బాండింగ్‌ ఉంది అనేంతలా ఫీలవుతారు. ఈ స్క్రిప్ట్‌కి అది బోనస్‌.

ట్రైలర్ లో మాసీ క్యారెక్టర్‌లో కన్పిస్తున్నారు! ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
– ఇందులో నాది ఒక డిఫరెంట్‌కైండ్‌ ఆఫ్‌ మాసీ క్యారెక్టర్‌. నేను సిటీలో పెరిగి హాలిడేస్‌కి భీమవరం వస్తాను. ఇంతవరకూ నేను ఆర్మీ ఎపిసోడ్‌ ఎటెంప్ట్‌ చేయలేదు. అలాగే కొత్త స్టైల్లో ఉండే నెంబరాఫ్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. కథని ఏదైతే ఎలివేట్‌ చేసిందో ఆ మిలట్రీ ఆఫీసర్‌ పాత్ర చేయడం కొత్తగా ఉంది.

ఈ కాంబినేషన్‌ కోసం ఎప్పటినుండి ఎదురు చూస్తున్నారు?
– నేను యాక్టింగ్‌ మొదలు పెట్టినప్పట్నుంచీ వెంకీమామతో, సురేష్‌ ప్రొడక్షన్స్‌లో నటించాలనే ఆలోచన ఉంది. అయితే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌ వచ్చాక ఆటోమేటిగ్గా అదే సెట్‌ అవుద్ది అనుకున్నాను. 2019లో ఎలాంటి ప్లానింగ్‌ లేకుండానే ఈ రెండూ కలిసొచ్చాయి. ఈ కథ భీమవరంలో స్టార్ట్‌ అయి కశ్మీర్‌లో ఎండ్‌ అవుతుంది. ముందు కథలో ఈ స్పాన్‌ లేదు. సురేష్‌గారు, వెంకటేష్‌గారు బాబీతో కూర్చుని డిజైన్‌ చేసిన స్ట్రక్చర్‌ అది. నా కెరీర్‌కి ది బెస్ట్‌ మూవీ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఇవ్వాలనే కథని అలా డిజైన్‌ చేశారు. ఈ సినిమా తప్పకుండా నా కెరీర్‌కి పెద్ద ప్లస్‌ అవుతుంది.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, సెకండాఫ్‌ ఎమోషనల్‌గా ఉంటుంది అని సురేష్‌బాబు అన్నారు.
– అవును. సినిమాలో బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. దాంతో పాటు మామ అల్లుళ్ల మధ్య ఒక త్యాగం ఉంటుంది. ఆ లేయర్‌కి నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. రియల్‌ లైఫ్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య ఒక అన్‌కండీషనల్‌ లవ్‌, ఎక్స్‌పెక్టేషన్స్‌ లేని శాక్రిఫైస్‌ ఉంటుంది. ఈమధ్యకాలంలో అలాంటివి తెరమీద చూడలేదు. అందులోనూ ఒక రియల్‌ లైఫ్‌ మామ అల్లుళ్లు ఆ క్యారెక్టర్స్‌ చేయడం ఆడియన్స్‌ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. యూనివర్శల్‌ ఎమోషన్స్‌ కూడా అన్ని వర్గాలవారికి కనెక్ట్‌ అవుతాయి.

వెంకటేష్‌గారి కామెడీ టైమింగ్‌ అందుకోవడం కష్టం అన్పించిందా?
– నిజంగానే చాలా కష్టమైంది. నేనే నవ్వు కంట్రోల్‌ చేసుకోలేక చాలా టేక్స్‌ తీసుకున్నాను. ట్రైలర్‌లో చూసింది కొంచెమే. సినిమా ఫుల్‌లెంగ్త్‌ ఎంజాయ్‌ చేస్తారు.

ఈ సినిమా మీ కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ అవుతుందని సురేష్‌బాబు అన్నారు..
– నా క్యారెక్టర్‌ కోసం సర్జికల్‌ స్ట్రైక్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేశారో ఆ ఎపిసోడ్‌ ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్‌ అన్నింట్లో మోస్ట్‌ ఛాలెంజింగ్‌ అన్పించింది. ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి ఆడియన్స్‌ డెఫినెట్‌గా రిసీవ్‌ చేసుకుంటారు.

రాశిఖన్నాతో రెండోసారి నటించారు?
– ‘మనం’లో తనతో రెండు నిమిషాల ఎపిసోడ్‌ చేశాను. తను అప్పటికీ, ఇప్పటికీ నటన పరంగా చాలా పరిణితి సాధించింది. ఆమె నటించిన ‘తొలిప్రేమ’ సినిమా నాకు చాలా ఇష్టం. అందులో పూర్తి ఛేంజోవర్‌ కన్పించింది. పాయల్‌ కూడా చాలా బాగా చేసింది.

ఆన్‌ స్క్రీన్‌లో నాగార్జున, వెంకటేష్‌గార్లలో కన్పించిన సిమిలారిటీస్‌ ఏంటి?
– వెంకీమామ టైమింగ్‌, ఆయన మీటర్‌ చాలా డిఫరెంట్‌. అలాగే నాన్న టైమింగ్‌, మీటర్‌ టోటల్లీ డిఫరెంట్‌. అందుకే వారిద్దరి సినిమాలు కాంట్రాస్ట్‌ జోనర్స్‌లో ఉంటాయి. ఏదైనా డెసిషన్‌ తీసుకోవాల్సి వస్తే మాత్రం ఇద్దరూ ఇమ్మీడియెట్‌గా తీసేసుకుంటారు. రిస్క్‌ అయినా దాని గురించి ఎక్కువ ఆలోచించరు. అదే క్వాలిటీ మళ్లీ నాగేశ్వరరావు, రామానాయుడుగారిలో చూశాను.

ఒక యాక్టర్‌గా మీకెలాంటి క్యారెక్టర్స్‌ అంటే ఇష్టం?
– యాక్టర్‌గా రియలిస్టిక్‌ స్టోరీలు, క్యారెక్టర్స్‌ అంటేనే ఇష్టం.

ఈ సినిమాతో హీరోగా మీ స్పాన్‌ పెరిగిందని అనుకుంటున్నారా?
– తప్పకుండా అండీ. వెంకటేష్‌గారికి లేడీస్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. ఆయన సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్‌ కూడా ఎక్కువే. వెంకటేష్‌గారి సినిమాలో నేనుండటం వల్ల నా స్పాన్‌ తప్పకుండా పెరుగుతుందని భావిస్తున్నా. నా క్యారెక్టర్‌ని ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తే ఆ క్రెడిట్‌ అంతా సురేష్‌బాబు, వెంకటేష్‌, బాబీగార్లదే.

సమంత మీ సినిమాలను క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేస్తుంది కదా?
– అవునండీ. ఈ సినిమా కథ తనకి తెలీదు. ఈమధ్యే సినిమా చూసింది. తను ఏదైనా ఫ్రాంక్‌గా, ఓపెన్‌గా చెబుతుంది. నాకు అలాంటి వాళ్లంటే ఇష్టం. ఈ సినిమా నిజంగా చాలా ఎంజాయ్‌ చేశాను అని చెప్పింది.

శేఖర్‌ కమ్ములగారి సినిమాలో మీ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుంది?
– ఆ సినిమాలో నేను నా మనసుకి దగ్గరైన క్యారెక్టర్‌. అందుకే చాలా ఎంజాయ్‌ చేస్తూ నటిస్తున్నాను. 40% షూటింగ్‌ పూర్తయింది. ‘లవ్‌స్టోరి’ అనేది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే. టైటిల్‌ ఇంకా కన్‌ ఫర్మ్‌ కాలేదు. అలాగే నాన్నగారితో కలిసి నటించే ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. తరువాత కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. కన్‌ఫర్మ్‌ కాగానే మిగతా వివరాలు తెలియజేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు అక్కినేని నాగ‌చైత‌న్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here