‘Nallamala’ Title Song Launched by Versatile Actor Nazar

నల్లమల.. ఈ పేరు వినగానే ఎన్నో గుర్తొస్తాయి. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా రూపొందుతున్న చిత్రం “నల్లమల”. నల్లమల చుట్టూ ఉన్న ఎన్నో చీకటి కోణాలను స్పృశిస్తూ.. అక్కడి వారి జీవితాలను దారుణంగా ప్రభావితం చేస్తున్న అనేకమంది మోసాలను బట్టబయలు చేస్తూ తెరకెక్కుతున్న డేరింగ్ మూవీ ఇది. ఇప్పటివరకు ఇలాంటి కథాంశం తో తెలుగులో సినిమా రాలేదనే చెప్పాలి. కథే హీరోగా రూపొందుతున్న నల్లమల మూవీ నుంచి మొదటి వీడియో సాంగ్ విడుదల అయింది.
 పెద్దపల్లి రోహిత్ సంగీతంలో

“ఎరుపెక్కే గ్రహణమిది రవికెరుగని గగనం..
ఎదురొచ్చే శకలాలను పెకలించే పర్వం..
నిజాల చాటు నీలి నీడని..
సవాలు చేసే సమిధలం ….. ” అంటూ అత్యంత పవర్ఫుల్ గా ఉందీ పాట .ఈ వీడియో టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో విలక్షణ నటుడు నాజర్ చేతుల మీదుగా విడుదల చేసారు.అనంతరం...

నాజర్ గారు మాట్లాడుతూ ..పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా బావుంటుంది. నేను బిజీగా ఉన్నా ఈ చిత్రం లో నేను నటించాలని నా కోసం చిత్ర యూనిట్ చాలా రోజులు వెయిట్ చేశారు.నాకెప్పుడూ చిన్న చిత్రాలు అంటేనే ఇష్టం.ఎందుకంటే సెట్లో దర్శక,నిర్మాతలకు నా ఐడియాస్ చెప్పచ్చు. నల్లమల చిత్రం ఎన్విరాన్మెంట్ గురించి తీస్తున్నామని చెప్పగానే నేను ఒప్పుకున్నాను.ప్రస్తుతం రిలీజియస్,పాలిటిక్స్ ఎకానమీ కన్నా ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యం అలాంటి మంచి స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకొని మంచి టీం తో ఖర్చుకు వెనకడకుండా చాలా ప్రోఫెషన్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.నేను మొదటి సారి ఆదిలాబాద్ ఫారెస్ట్ కు వెళ్ళాను.ఎన్నో పర్సనల్ టెన్షన్స్ తో షూటింగ్ కు వెళ్ళాను. ఫారెస్ట్ లో న్యాచురల్ లోకేషన్స్ చూడగానే  నాకు ఆమ్మ ఒడిలో వాలినటువంటి ఫీల్ కలిగింది.దాంతో నాలో ఉన్న టెన్షన్స్ అన్ని పోయాయి.చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో నటించిన ఫీలింగ్ వచ్చింది. అమిత్ నేను చాలా సినిమాలు చేసాం.ఇప్పుడు ఈ సినిమాలో హీరో గా చాలా బాగా నటించాడు.ఇందులో రోహిత్ చేసిన పాటలు కాంపిటీటివ్ గా ఉన్నాయి.ఈ చిత్రం టీం అందరికీ మంచి పేరు తీసుకు వస్తుందని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ… నాకిష్టమైన నటుడు నాజర్ గారి చేతుల మీదుగా నల్లమల  సాంగ్ ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది.ఇది నేను మర్చిపోలేని రోజు.ఇందులో అమిత్ హీరో గా చాలా అద్భుతంగా నటించాడు.మ్యూజిక్ డైరెక్టర్ రోహిత్ మేము అనుకున్న దానికంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు.ఈ పాటలోని లిరికల్ వాల్యూ చూస్తేనే సినిమా రేంజ్ తెలిసిపోతుందని చెప్పొచ్చు. విన్న ప్రతి ఒక్కరూ అద్భుతమైన పాట అని మెచ్చుకుంటున్నారు.మంచి కంటెంట్ తో వస్తున్న మా చిత్రాన్ని చూసి ప్రేక్షకులు ఆశీర్వదించాలని అన్నారు.

హీరో మాట్లాడుతూ ..నేను నాజర్ సార్ తో చాలా సినిమాలు చేశాను.నేను హీరోగా చేస్తున్న నా మొదటి సినిమాకు ఆయన వచ్చి సాంగ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ప్రేక్షకులు ఇచ్చిన బ్లెస్సింగ్స్ తో మొదటి సారి హీరోగా నటిస్తున్నాను, మీ బ్లెస్సింగ్స్ అలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ కు లాంచ్ చేయడానికి వచ్చిన నాజర్ సర్ కు ధన్యవాదాలు. దర్శక,నిర్మాతలకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నా నన్ను నమ్మి, నాకీ అవకాశం ఇచ్చారు.వారిచ్చిన నమ్మకాన్ని ఈ చిత్రం ద్వారా ప్రూవ్ చేసుకుంటానని అన్నారు.

నటీ నటులు..

అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్,కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్

సాంకేతిక నిపుణులు

ఎడిటర్ : శివ సర్వాణి
ఫైట్స్ : నబా
విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్
ఆర్ట్ : యాదగిరి
పి.ఆర్.వో : దుద్ది శ్రీను
సినిమాటోగ్రఫీ : వేణు మురళి
సంగీతం, పాటలు : పి.ఆర్
నిర్మాత : ఆర్.ఎమ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here