మనిషి జీవితమే ఒక “తోలు బొమ్మలాట”:-న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్.

అల్ రౌండర్ గా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న డా. రాజేంద్ర ప్రసాద్ ఎఫ్ 2 డిఫ్రెంట్ కామెడీ,ఓబేబి లో ఎమోషన్స్ తో కూడిన మంచి మంచి పాత్రలు చేస్తూ నటుడిగా దూసుకెళ్తున్నారు న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్ర‌స్తుతం సుమ దుర్గా క్రియేష‌న్స్ ప‌తాకంపై దుర్గా ప్ర‌సాద్ మాగంటి నిర్మాతగా విశ్వ‌నాథ్ మాగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `తోలు బొమ్మలాట`. చిత్రంలో విశ్వంత్ కథానాయకుడిగా నటించాడు. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌ కీల‌క పాత్ర‌ల్లోన‌టించారు. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన కథగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట‌ర్వ్యూ.

‘తోలు బొమ్మలాట` ఎవరు ఎవరిని ఆడిస్తారు ?
— మాములుగా మ‌నమంద‌రం మనిషి జీవితమే ఓ తోలు బొమ్మలాట అనే ప‌దం వినే ఉంటాం. అయితే దాని అర్ధం ఏంటంటే మ‌న‌మంద‌రం తోలు ఉన్న బొమ్మలం, మనతో ఆ దేవుడు ఆడే ఆటే తోలు బొమ్మలాట.అనుకున్నట్లు జరగనీదే జీవితం. అయితే కొన్ని సందర్భాల్లో మన తల్లి దండ్రులు, గురువు కూడా ఆ ఆట ఆడతారు. ఎందుకు ఆడాల్సి వ‌చ్చింది అనేది ఈ క‌థ‌.

డైరెక్ట‌ర్ విశ్వనాథ్ చిన్నవాడైనా ఈ క‌థ చెప్ప‌గానే మీకేమ‌నిపించింది?
— ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ నన్ను కలిసి మీకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథ ఉందని ఈ కథ మొత్తం మీ చుట్టూనే తిరుగుతుందని చెప్ప‌గానే ఏదైనా కామెడీ ఫ్లేవర్ ఉండే కథ అయి ఉంటుందేమో అని ఊహించాను. కాని వృద్దాప్యంలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచనలు, అతనికి సంబందించిన బాధతో కూడిన ఓ ఎమోషనల్ కథ చెప్పాడు. కుటుంబ బంధాలు అనుబంధాలు గురుంచి చెప్పే మంచి కథ . ఆ క‌థ విన్నాక ఆశ్చర్యమేసింది. నీ వయసెంత, ఈ కథ నువ్వే రాశావా..? నువ్వే తీస్తావా ? అని కూడా అడిగి తెలుసుకున్నాను. నిజంగా ఈ వయసులో అలాంటి కథ రాయడం గొప్ప విషయం.అలాగే చెప్పినట్టే మంచి సినిమా తీయ‌డం అభినంద‌నీయం.

ఈ సినిమాలో మీరు ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారు ?
— ఈ సినిమా లో సోడాలరాజు అనే పాత్ర చేసాను, అయితే ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఏ సినిమాలో అయినా నటుడు అనే వాడు కనిపించకుండా పాత్ర కనిపించాలి. అప్పుడే సన్నివేశాలు పండుతాయి అనేది నా న‌మ్మ‌కం. నటుడిగా నేను ఎప్పుడూ అదే ఫాలో అవుతాను. ఈ సినిమాలో సోడాల రాజు గా కనిపించడానికి పెద్ద మనిషి లా కనపడాలి, అందరూ గౌరవించేలా ఉండాలి అందుకు కొంత ప్రిపైర్ అవ్వడం జరిగింది. ఈ సినిమాలో నాకు దొరికిన మరో మంచి పాత్ర. ఊళ్ళో వాళ్ళు సోడాల రాజు దగ్గరికి వెళ్తే టెన్షన్ రిలీఫ్ అవుతుంది అనుకునేలాంటి పాత్ర.

‘తోలు బొమ్మలాట’ సినిమా ఎలా ఉండబోతుంది ?
— ‘తోలు బొమ్మలాట’ ఎమోషన్ తో కూడిన ఎంటర్టైన‌ర్‌. ఒకప్పుడు మనం పాటించిన పద్దతులు ఇప్పుడు వదిలేయడంవ‌ల్ల జ‌రిగే ప‌రిణామాల గురించి ఈ సినిమాలో ఓ చిన్న సందేశం ఇవ్వ‌డం జ‌రిగింది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమాలో వెన్నెలకిషోర్ పాత్ర ఎలా ఉంటుంది ?
— సినిమా కథ ఎమోషనల్ జర్నీ అయిన‌ప్ప‌టికీ కామెడీ కూడా ప్రాదాన్యం ఉంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు నన్ను సలహాలు అడుగుతూ ఎంతో చక్కగా ఆ పాత్రను చేశాడు.

టాలీవుడ్ లో కామెడీ హీరో గా మీ ప్లేస్ ఎవరికి ఇస్తారు, మీ వారసున్ని సినిమాలలోకి తీసుకురాకపోవడానికి కారణం ఏంటి ?
— యన్టీఆర్ గారిని చూసి నేను హీరో అవ్వాలనే ఆసక్తితో నాకు నేనే సినిమాల్లోకి వచ్చాను,,కానీ నా మనవరాలు మహానటి ద్వారా పరిచయమైంది.ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు లో కూడా చేస్తోంది.కానీ నా పిల్లలు రాలేదు నా వారసున్ని కూడా నేనే..

తీరికాలేకుండా చేస్తున్నారు కదా మరి మీ త‌దుప‌రి చిత్రాలు ఏంటి ?
— ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాను. `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో మహేష్, నా క్యారెక్ట‌ర్ టామ్ అండ్ జెర్రీ లాగా అనిపిస్తుంది. ఇక బన్నీ ‘అల వైకుంఠపురములో’ ఎస్‌పి క్యారెక్ట‌ర్ చేస్తున్నాను.ఎర్రచీర లో చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here