Naveen Polishetty and Anushka Shetty’s ‘Miss Shetty Mr. Polishetty’ Block Buster Celebrations held grandly

Young talented hero Naveen Polishetty and star heroine Anushka Shetty acted together in a clean family entertainer ‘Miss Shetty Mr. Polishetty’ recently came to the audience at pan India level. The film is doing well in both the Telugu states as well as in the US. This movie is getting appreciations from audience as well as celebrities. In this background, ‘Miss Shetty Mr. Polishetty’ blockbuster celebrations were held in Hyderabad on Saturday evening. Directors Maruthi, Nag Ashwin, Anudeep KV, Nandini Reddy, Buchibabu, Merlapaka Gandhi, producers Abhishek Agarwal, SKN and others participated as guests in this program. On this occasion,

Director Nandini Reddy said – I used to go to other people’s movie events as a guest, but I come to Naveen’s even as a fan. I loved his performance. I saw ‘Miss Shetty Mr. Polishetty’ and it’s a beautiful movie. The way UV Creations makes a movie, the dedication they have on the project is amazing. Congratulations to whole team.

Director Merlapaka Gandhi said – The emotion and entertainment in the movie ‘Miss Shetty Mr. Polishetty’ was impressive. Naveen and Anushka impressed with their performance. In some movies one can imagine another hero but in Naveen’s three movies Agent Sai Srinivasa Atreya, Jathi Ratnalu, Miss Shetty Mr Polishetty one cannot imagine another hero but you. My appreciations to director Mahesh Babu. He made the movie to touch the heart. My best wishes to all the UV producers and the rest of the team.

Lyricist Ramajogayya Sastry said – I have a good association with UV company. Miss Shetty Mr. Polishetty movie came as a hit without any rush. A good point has been shown to touch the heart. I want this movie to go towards a bigger success.

Music director Gopisunder said – I am happy to be a part of such a good film. The movie was a good hit. Naveen’s acting is very good. The emotional content of the movie ‘Miss Shetty Mr. Polishetty’ will touch your heart. If there are those who have not seen it, they must watch ‘Miss Shetty Mr. Polishetty’.

Lyricist Ananth Sriram said – This is a movie made Manasetti (with heart) by Shetty and Polishetty. A sensitive topic has been chosen and the film has been made to impress. When I thought about how to write the sentiments for the song, a line struck. Thanks to UV creatons for daring to make a film with such a new story.

Director Buchibabu said – I was introduced to Vikram in UV company. Charan introduced Vikram during Rangasthalam shoot. He is very good. I’m happy that UV creations got a hit. I know Naveen from the time of the movie One Nenokkadne. He acted in the song Who Are You in that movie. In that song, when Mahesh arrives, a boy gets up and shouts. He is Naveen. He asked for that shot and took too many. Mahesh Garu said this boy is active, he is performing well. He will become a star. He became a star just like that. All this was possible due to the passion and perseverance of Naveen. I want him to do more hit movies like this.

Director Anudeep KV said – Director Mahesh told me this story during Jathi Ratnalu movie time. Since then he has been working on this story. Naveen is thought to do only comedy but he has done the emotional content equally well in this movie. We all want this movie to be more successful.

Producer SKN said – Naveen, who entered the industry with a small character in 2012, has become a star hero today. Behind this is a lot of hard work that he put in. Happy that ‘Miss Shetty Mr Polishetty’ became Biggest Entertainer of the Year. It can be said that UV company is a landmark for passionate film making. The next movies on UV should also be a big hit.

Mahesh Babu, director of ‘Miss Shetty Mr. Polishetty’. said – Thanks to everyone who came to our movie success celebrations today. I would like to thank the audience for giving such a big success to our movie with the word of mouth that the movie is good. If Naveen, UV and Anushka didn’t believe in the idea that came to me, this film would not have been made today and would not have been so successful. All my technicians supported me in this journey. Thanks to all of them.

Director Nag Ashwin said – I knew Naveen for a long time. When I was an assistant director under Shekhar Kammula, Naveen used to come for auditions. I am happy to be a guest at his film success meet today. Comedy is Naveen’s only strength. But he can do anything be it action, villain, comedy, emotion. I Wish him to do more such versatile roles. He cried sometimes with emotional scenes in this movie. Naveen carried the promotion of this movie on his shoulders and made it reach such an audience today. Im proud to see his success. Watched the movie ‘Miss Shetty Mr. Polishetty’ with family. Everyone enjoyed it. I know how hard a movie team works for a success. Congratulations to all the team.

Director Maruti said – I went and watched the movie ‘Miss Shetty Mr. Polishetty’ with my family. Everyone is enjoying the movie. Making a family entertainer with a new point of view is not a common thing. This is a good movie. Telugu audience should support a movie like this wherever they are. Don’t wait to see it in OTT. This is a movie to be enjoyed in the theater. Director Mahesh worked hard for this movie for two years. Also, Naveen’s work is seen in every scene. Happy to have another hit for our UV organization.

Hero Naveen Polishetty said – Thank you to every single guest who came here to support a good movie and extend thier congratulations. There is a lot to be said about the journey of ‘Miss Shetty Mr. Polishetty’. Post production delays, postponement of the movie release date, so many problems were faced. As soon as we announced the date of September 7, we got to know that a big Hindi movie is coming on the same date. Then we got very tensed. We have cross-checked many times that the expected date is correct. Since its premiere in Dallas on 7th of this month, now till 16th, the movie is showing house full collections everywhere.

He added, “I would like to thank the Telugu audience for giving us such a big hit amidst many difficulties. This was possible with the word of mouth of a good movie. Acting with Anushka was a happy experience. Today, the chemistry between our pair is good and we have shown a good love story. We wondered how they would accept the new point. First we showed our movie to Megastar Chiranjeevi and he talked to us for two hours. He said that the movie will be a hit. The result came as he said. Also, thanks to Prabhas, Mahesh, Ravi Teja, Rajamouli, Samantha who tweeted and supported our film. Those who have seen it tell others that the movie is good. Please watch the film in theaters.

ఘనంగా జరిగిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ మూవీకి ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ, నందినీ రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, ఎస్కేఎన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ – నేను మిగతా వాళ్ల సినిమా ఫంక్షన్స్ కు గెస్ట్ గా వెళ్తుంటా కానీ నవీన్ సినిమాలకు మాత్రం ఒక ఫ్యాన్ గా వస్తుంటా. ఆయన పర్ ఫార్మెన్స్ అంటే నాకు అంత ఇష్టం. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  చూశాను. బ్యూటిఫుల్ మూవీ. యూవీ క్రియేషన్స్ వాళ్లు ఒక సినిమాను నిర్మించే విధానం, ఆ ప్రాజెక్ట్ మీద వారికి ఉన్న డెడికేషన్ అద్భుతం. ఈ మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ – ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకుంది. నవీన్, అనుష్క నటనతో ఇంప్రెస్ చేశారు. కొన్ని సినిమాల్లో మరో హీరోను ఊహించుకోవచ్చు కానీ నవీన్ చేసిన మూడు సినిమాలు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టిలో మిమ్మల్ని తప్ప మరో హీరోను ఊహించుకోలేం. డైరెక్టర్ మహేశ్ బాబుకు నా అప్రిషియేషన్స్ చెబుతున్నా. సినిమాను మనసుకు హత్తుకునేలా రూపొందించాడు. యూవీ ప్రొడ్యూసర్స్ తో పాటు మిగతా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. అన్నారు.

లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ – యూవీ సంస్థ నాకు మంచి అనుబంధం ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఎలాంటి హడావుడి లేకుండా కామ్ గా వచ్చి హిట్ కొట్టింది. ఒక మంచి పాయింట్ ను మనసుకు హత్తుకునేలా చూపించారు. ఇంకా మరింత పెద్ద సక్సెస్ వైపు ఈ సినిమా వెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.

సంగీత దర్శకుడు గోపీసుందర్ మాట్లాడుతూ – ఇలాంటి మంచి చిత్రంలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. సినిమా మంచి హిట్ అయ్యింది. నవీన్ యాక్టింగ్ చాలా బాగుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ మీ మనసుకు టచ్ అవుతుంది. చూడని వాళ్లు ఉంటే తప్పక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చూడమని కోరుతున్నా. అన్నారు.

లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – శెట్టి పోలిశెట్టి మనసెట్టి చేసిన సినిమా ఇది. ఒక సున్నితమైన అంశాన్ని ఎంచుకుని ఆకట్టుకునేలా సినిమా చేశారు. నోనో పాట కోసం ఇందులోని భావాలను ఎలా రాయాలని ఆలోచించినప్పుడు ఒక లైన్ తట్టింది. వద్దంటా పైరు నారు, వద్దంటా ఏ పాలేరు. పండాలంటా తన పంట..ఇంతకన్నాఈ పాయింట్ పొయెటిక్ గా చెప్పలేకపోయాను. ఇంత కొత్త కథతో సినిమా చేయాలన్న ధైర్యం చేసిన యూవీ వాళ్లకు ధన్యవాదాలు. అన్నారు.

డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ – యూవీ సంస్థలో విక్రమ్ గారు నాకు పరిచయం. చరణ్ గారు రంగస్థలం టైమ్ లో విక్రమ్ గారిని పరిచయం చేశారు. ఆయన ఎంతో మంచివారు. యూవీ సంస్థకు హిట్ రావడం సంతోషంగా ఉంది. నవీన్ నాకు వన్ నేనొక్కడినే సినిమా టైమ్ నుంచి తెలుసు. ఆ సినిమాలో హూ ఆర్ యూ పాటలో నటించాడు. ఆ పాటలో మహేశ్ రాగానే ఒక కుర్రాడు లేచి అరుస్తాడు. అతనే నవీన్. ఆ షాట్ కోసం అడిగి మరీ టేక్స్ చేశాడు. మహేశ్ గారు అన్నారు ఈ కుర్రాడు యాక్టివ్ గా ఉన్నాడు, బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడు.. స్టార్ అవుతాడని. ఆయన అన్నట్లుగానే స్టార్ అయ్యాడు. ఇదంతా నవీన్ లోని తపన, పట్టుదల వల్లే సాధ్యమైంది. ఇంకా ఇలాంటి మరెన్నో హిట్ మూవీస్ నవీన్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ అనుదీప్ కేవీ మాట్లాడుతూ – జాతి రత్నాలు సినిమా టైమ్ లో నాకు డైరెక్టర్ మహేశ్ ఈ కథ చెప్పాడు. అప్పటి నుంచి ఈ స్టోరి మీద వర్క్ చేస్తూనే ఉన్నాడు. నవీన్ కామెడీ మాత్రమే చేస్తాడని అనుకుంటారు కానీ ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ కూడా అంతే బాగా చేయగలిగాడు. ఈ మూవీని మీరంతా మరింత సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ – 2012లో చిన్న క్యారెక్టర్ తో ఇండస్ట్రీకి వచ్చిన నవీన్ ఇవాళ స్టార్ హీరో అయ్యాడు. దీని వెనక అతను పడిన ఎంతో శ్రమ ఉంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ గా కావడం సంతోషంగా ఉంది. యూవీ సంస్థ ప్యాషనేట్ సినిమా మేకింగ్ కు ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. యూవీలో నెక్ట్ వచ్చే మూవీస్ కూడా బిగ్ హిట్ అవ్వాలి. అన్నారు.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ డైరెక్టర్ మహేశ్ బాబు.పి. మాట్లాడుతూ – ఇవాళ మా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా బాగుందనే మౌత్ టాక్ తో మా సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. నాకు వచ్చిన ఐడియాను నవీన్, యూవీ, అనుష్క గారు నమ్మకుంటే ఈ సినిమా ఇవాళ రూపొంది, ఇంత సక్సెస్ అయ్యేది కాదు. ఈ జర్నీలో నా టెక్నీషియన్స్ అంతా నా వెంట ఉండి సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ  థ్యాంక్స్. అన్నారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – నవీన్ చాలాకాలంగా నాకు తెలుసు. నేను శేఖర్ కమ్ముల గారి దగ్గర అసిస్టెంట్ డైెరెక్టర్ గా ఉన్నప్పుడు నవీన్ ఆడిషన్ వచ్చేవాడు. ఇవాళ అతని సినిమా సక్సెస్ మీట్ కు నేను గెస్ట్ గా రావడం సంతోషంగా ఉంది. కామెడీ మాత్రమే నవీన్ స్ట్రెంత్  అనుకుంటాం. కానీ అతను యాక్షన్, విలన్, కామెడీ, ఎమోషన్ ఏదైనా చేయగలడు. అలాంటి వర్సటైల్ రోల్స్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ తో కొన్నిసార్లు ఏడిపించాడు. ఈ సినిమా ప్రమోషన్ ను నవీన్ తన భుజాల మీద మోసుకుని ఇవాళ ఇంత ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేశాడు.  నవీన్ ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఫ్యామిలీతో చూశా. అందరూ ఎంజాయ్ చేశాం. ఒక సక్సెస్ కోసం మూవీ టీమ్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ఫ్యామిలీతో వెళ్లి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూశా. ప్రతి ఒక్కరూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక కొత్త పాయింట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేయడం మాములు విషయం కాదు. ఇదొక మంచి మూవీ. తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి. ఓటీటీలో చూద్దామని ఆగకండి. ఇది థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ.  డైరెక్టర్ మహేశ్ రెండేళ్లుగా ఈ మూవీ కోసం కష్టపడ్డాడు. అలాగే నవీన్ కష్టం ప్రతి సీన్ లో కనిపిస్తుంది. మా యూవీ సంస్థకు మరో హిట్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. అన్నారు.

హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ – ఒక మంచి సినిమాను ఎంకరేజ్ చేసేందుకు, కంగ్రాట్స్ చెప్పేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ కు థాంక్స్ చెబుతున్నా. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  జర్నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్, మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవడం..ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మేము సెప్టెంబర్ 7 డేట్ అనౌన్స్ చేయగానే ఒక పెద్ద హిందీ సినిమా అదే డేట్ కు వస్తోందని తెలిసింది. అప్పుడు మేము ఎంతో టెన్షన్ పడ్డాం. మేము అనుకున్న డేట్ కరెక్టేనా అని ఎన్నోసార్లు క్రాస్ చెక్ చేసుకున్నాం. ఈ నెల 7న డల్లాస్ లో ప్రీమియర్ వేసినప్పటి నుంచి ఇప్పుడు 16 తేదీ వరకు ప్రతి చోటా హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తో మూవీ ప్రదర్శితమవుతోంది. అనేక ఇబ్బందుల మధ్య మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నా. మంచి సినిమా అనే వర్డ్ ఆఫ్ మౌత్ తోనే ఇది సాధ్యమైంది. అనుష్క గారితో కలిసి నటించడం హ్యాపీ ఎక్సీపిరియన్స్. ఇవాళ మా పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగుందని, మంచి లవ్ స్టోరి చూపించారని ప్రశంసలు వస్తున్నాయి. కొత్త పాయింట్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అనుకున్నాం. ఫస్ట్ మేము మా సినిమా చూపించింది మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన మాతో రెండు గంటలు మాట్లాడారు. సినిమా హిట్ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే రిజల్ట్ వచ్చింది.  అలాగే మా సినిమాకు ట్వీట్స్ చేసి సపోర్ట్ చేసిన ప్రభాస్ గారు, మహేశ్ గారు, రవితేజ గారు, రాజమౌళి గారు, సమంత..ఇలా అందరికీ థ్యాంక్స్. చూసిన వాళ్లు మిగతా వాళ్లకు సినిమా బాగుందని చెప్పండి. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here