“Nenu – Keerthana” Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : చిమటా ప్రొడక్షన్స్
సినిమా : “నేను కీర్తన”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 30.08.2024
సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), 
నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, 
రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!!
నటీనటులు: రేణు ప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ తదితరులు 
ఛాయాగ్రహణం: కె. రమణ,
సంగీతం: ఎం.ఎల్.రాజా,
పాటలు: సి.హెచ్.ఆర్ – అంచుల నాగేశ్వరరావు – శ్రీరాములు,
కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, 
డి.ఐ: భాను ప్రకాష్, 
వి.ఎఫ్.ఎక్స్: నవీన్, 
ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, 
పోరాటాలు: నూనె దేవరాజ్, 
నృత్యాలు: అమిత్ కుమార్ – సి.హెచ్.ఆర్,
పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ. 


ఇటీవల కాలంలో పెద్ద చిత్రాలకు ధీటుగా వార్తల్లో ఉంటూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన చిత్రం “నేను – కీర్తన”. స్వయంగా కథ – మాటలు – స్క్రీన్ ప్లే సమకూర్చుకుని.. చిమటా రమేష్ బాబు డైరెక్టర్ కమ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న “నేను కీర్తన” చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ తెచ్చుకొన్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..


కథ
విశాఖపట్నం శివారు ప్రాంతంలో ఉన్న నాగులపాడు గ్రామంలో జరిగే కథ. ఆ గ్రామంలో ఉండే పెద్ద స్వామి (విజయ రంగ రాజు) చెప్పిందే వేదం ఆ ఉరిలోని ప్రజలకు ఏ రోగం వచ్చినా వీరి దగ్గరికే వెళ్ళాలి. ఆలా కాకుండా పట్నంకు వెళ్లి చూయించుకుంటే వారిని చంపేస్తారు. అలాగే
ఈ గ్రామంలో ఉండే సారవంతమైన పొలాలకు రాసాయనాలు వేసి బీడు భూములుగా మారుస్తూ వాటిని ఆక్రమించుకుంటూ ఉంటాడు.మరో వైపు తన కొడుకు చిన్న స్వామి (మంజునాథ్) కంట పడిన ప్రతి అమ్మాయిని తన వశం చేసుకుంటూ ఉంటాడు.ఇలా వారు చేసే అరాచకాలకు అక్కడ అడ్డు అదుపు ఉండదు.

మరో వైపు టౌన్ లో ఉండే జానీ (చిమటా రమేష్ బాబు) తన తల్లి తండ్రులు చిన్న తనంలోనే చనిపోవడంతో పెద్దయ్యాక తన ఫ్రెండ్స్ తో ఉంటూ అక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా వారి సమస్యలో నిజం ఉంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఎంత దూరమైనా వెళ్లి ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకు కీర్తన (రిషిత ) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.అయితే అనుకోకుండా ఒక రోజు కీర్తన కనిపించకుండా పోతుంది. కీర్తనను వెతుకుతూ నాగులపాడుకు చేరుకుంటారు.ఈ క్రమంలో అక్కడ తనకు తెలియని, ఊహించని ఎన్నో విషయాలు తెలుసుకున్న జానీ.. ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు. తద్వారా తన జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది. చివరికి తను ప్రాణంగా ప్రేమించిన కీర్తనను దక్కించుకున్నాడా? అలాగే సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా వినియోగించాడన్నది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “నేను కీర్తన” సినిమా చూడాల్సిందే

నటీ నటుల పనితీరు
హీరో పాత్రలో జానీ గా నటించిన చిమటా రమేష్ బాబు  మొదటి సినిమా అన్న బెరుకు ఎక్కడా లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌లోనూ, డ్యాన్స్ లోనూ  పెద్ద హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా  చాలా చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు.. కథానాయకి కీర్తన పాత్రలో నటించిన రిషిత పల్లేటూరి అమ్మాయిలా తన అందం అభినయంతో అద్భుతంగా నటించి మెప్పించింది. పెద్ద స్వామి పాత్రలో నటించిన విజయ రంగ రాజు తన విలనిజంతో క్రూరత్వం అంటే ఎలా ఉంటుందనే మరో కోణాన్ని ఈ సినిమాలో చూపించాడు. విలన్ కొడుకుగా  చిన్న స్వామి  (మంజునాథ్)  తన నటనతో చాలా  చక్కగా నటించాడు. చమేళీ  పాత్రలో  మేఘన తనకిచ్చిన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. రేణు ప్రియ ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఇంకా ఈ సినిమాలో జబర్దస్త్ కళాకారులు జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీల కామెడీ బాగానే పండింది. ఇంకా జీవా, రాజ్ కుమార్ లతో పాటు ఇందులో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
“మల్టీ జోనర్ ఫిల్మ్”గా ప్రచారం చేసిన ఈ చిత్రంలో నిజంగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలన్స్ చేస్తూ చాలా చక్కగా తెరకెక్కించడంలో దర్శకుడుగా,రైటర్ గా, మరోవైపు హీరోగా సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. ఒక చిన్న సినిమాలో ఇన్ని జోనర్స్ మిక్స్ చేయడం అవసరమా అని అక్కడక్కడా అనిపించినా… కథ మలుపులు తిరిగేకొద్దీ రక్తి కట్టిస్తుంది.
ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం ఒక సినిమా థియేటర్లో ఉన్నామన్న భావన కలగదు. ఈ సినిమాను  ఎం.ఎల్.రాజా  సంగీతం నిలబెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశారు. పాటల విషయానికి వస్తే, ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుండటం  విశేషం. ప్రతి పాట సన్నివేశానికి తగినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా  కులుమనాలిలో చిత్రీకరించిన “మనసయ్యింది”, సీతా కొకై ఎగిరింది మనసే, మరియు కొంచెం కొంచెం గుడు గుడు గుంజం వంటి స్పెషల్ సాంగ్ లతో పాటు… ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాకు  కె.రమణ  అందించిన  సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. వినయ్ రెడ్డి బండారపు  ఎడిటింగ్ పనితీరు బాగుంది.చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా లక్ష్మికుమారి  ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాయే అయినా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌గా  ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుండా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన “నేను కీర్తన”  సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారని కచ్చితంగా చెప్పవచ్చు .

Cinemarangam.Com Review Rating .. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here