Netflix Announces The Release Date of The Much Awaited 9 Part Anthology film ‘NAVARASA’

Netflix today announced the release date and launched the teaser of its much awaited nine-part Tamil anthology film – Navarasa. The film presented by the legendary filmmaker Mani Ratnam and renowned writer and filmmaker Jayendra Panchapakesan, is based on the nine ‘rasas’ (human emotions) – anger, compassion, courage, disgust, fear, laughter, love, peace and wonder – and will release exclusively on Netflix on August 6th 2021 across 190 countries.

Navarasa is truly a cinematic marvel and a landmark moment of cultural pride for the Tamil entertainment industry, as the finest and most acclaimed talent has come together to bring this project to life. The most prolific actors, directors, musicians, writers, producers and technicians from the industry, and beyond, have collaborated to make this incomparable dream a reality. While the spectacular creative community of Tamil cinema came together for this one-of-a-kind project, many leading icons of the industry graciously offered their services pro-bono contributing the proceeds from the films towards the well-being of film workers in Tamil cinema impacted by the pandemic. The nine stellar and critically acclaimed directors lending their incredible vision and distinctive perspective on each rasa are Arvind Swami, Bejoy Nambiar, Gautham Vasudev Menon, Karthick Naren, Karthik Subbaraj, Priyadarshan, Rathindran Prasad, Sarjun, and  Vasanth Sai.

Speaking about  Navarasa, Mani Ratnam and Jayendra Panchapakesan said, “We go a long way back in working together to raise funds for causes. The pandemic was staring at our face to stand up and do something. We realised our industry was the most badly hit and we felt a strong urge to do something for our own people. Navarasa was born from this strong urge to help and support the tamil film industry. We reached out to directors, actors and technicians in the industry with this idea. The response was a spontaneous yes from all of them. The project was executed in the thick of the pandemic, under the most difficult conditions by the different teams. Putting the utmost safety measures in place, nine films were completed.Today Navarasa is ready for the world to see. People in 180 countries will see the work created by an industry coming together for its people with passion and commitment. Every one of the industry icons have put their heart and soul into this project for the cause, working pro bono.The result is an anthology that we are excited to reveal and share with pride. Navarasa will showcase the talent and creativity of our industry.It will also support 12000 of our colleagues to tide through the pandemic. Wide support across the industry has been individually delivered with the help of Bhoomika trust. We are grateful to Netflix to have partnered us on this emotional journey.”

The first look teaser released today has been conceptualized by iconic filmmaker Bharat Bala and showcases perfectly the intricacy of human emotions as captured beautifully in the nine short films.
Basic Facts:

Producers – Mani Ratnam and Jaydendra Panchapakesan

Title – Edhiri (Compassion)
Director – Bejoy Nambiar
Cast- Vijay Sethupathy, Prakash Raj, Revathy

Title – Summer of 92 (Laughter)
Director – Priyadarshan
Cast- Yogi Babu, Remya Nambeesan, Nedumudi Venu

Title – Project Agni (Wonder)
Director – Karthick Naren
Cast- Arvind Swami, Prasanna, Poorna

Title – Payasam (Disgust)
Director – Vasanth S Sai
Cast- Delhi Ganesh, Rohini, Aditi Balan, Selfie Karthik

Title – Peace (Peace)
Director – Karthik Subbaraj
Cast- Simha, Gautham Vasudev Menon, Master Tarun

Title – Roudhram (Anger)
Director – Arvind Swami
Cast- Riythvika, Sreeram, Abhinayasree, Ramesh Thilak, Geetha Kailasam

Title – Inmai (Fear)
Director – Rathindran R Prasad
Cast-  Siddharth, Parvathy Thiruvorthu

Title – Thunintha Pin (Courage)
Director – Sarjun
Cast- Atharva, Anjali, Kishore

Title – Guitar Kambi Mele Nindru (Love)
Director – Gautham Vasudev Menon
Cast- Suriya, Prayaga Rose Martin

About Netflix:
Netflix is the world’s leading streaming entertainment service with 208 million paid memberships in over 190 countries enjoying TV series, documentaries and feature films across a wide variety of genres and languages. Members can watch as much as they want, anytime, anywhere, on any internet-connected screen. Members can play, pause and resume watching, all without commercials or commitments.For the latest news, updates and entertainment from Netflix India, follow us on IG @Netflix_IN, TW @NetflixIndia, TW South @Netflix_INSouth and FB @NetflixIndia

About Justickets:
The Navarasa anthology of short films was conceived by directors Mani Ratnam and Jayendra Panchapakesan (co-founder, Qube Cinema) as an initiative that will raise funds to support those in the cinema industry who have been acutely affected by the COVID-19 crisis. The project is being produced under the banner of Justickets, in association with AP International and Wide Angle Creations as executive producers. All the talent and companies involved in the project have offered their services pro bono, with the sole objective of supporting the industry at large

Teaser Link: https://www.youtube.com/watch?v=MEXvhhXpOQM

Plain Still Link: VanDAM (netflix.com)
Netflix Branded Stills: VanDAM (netflix.com)

 

నెట్‌ఫ్లిక్స్‌ మోస్ట్‌ అవెయిటెడ్‌ అంథాలజీ ‘నవరస’ రిలీజ్‌ డేట్‌

తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అంద‌రిలో ఆస‌క్తి క‌లిగించిన అంథాల‌జీ ‘న‌వ‌ర‌స‌’. ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో ఈ అంథాల‌జీ ఫిల్మ్ రూపొందింది. మాన‌వ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని న‌వ‌ర‌సాలు అని కూడా అంటాం.  (కోపం, ధైర్యం, క‌రుణ‌, అస‌హ్యం, భ‌యం, వినోదం, ప్రేమ‌, శాంతి, ఆశ్చ‌ర్య‌పోవ‌డం) వీటి ఆధారంగా ‘న‌వ‌ర‌స‌’ రూపొందింది. ప్రముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ అంథాల‌జీని ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో ఆగ‌స్ట్ 6న విడుద‌లచేస్తోంది.

‘నవరస’ అంథాలజీ తమిళ సినీ రంగానికి సంబంధించిన సాంస్కృతిక గర్వకారణంగానూ, అద్భుతంగా.. మైలురాయిగా నిలవనుంది. అందుకు కారణం అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఈ అంథాలజీ రూపకల్పన కోసం ముందుకు రావడమే. టాప్‌ మోస్ట్‌ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణుల కలిసి ఈ అంథాలజీకి జీవం పోయడమే కాకుండా సాటిలేని ఓ కలను సాకారం చేశారు. తమిళ సినిమా రంగంలోని అద్భుతమైన సృజనాత్మకతను కలిగిన వారందరూ ఈ సినిమాకు పనిచేశారు. కొవిడ్‌ సమయంలో ఇబ్బందులు పడ్డ సినీ పరిశ్రమలోని కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ఫిల్మ్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగించనున్నారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న .. తొమ్మిది మంది స్టార్స్‌తోపాఉ అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, ప్రియదర్శన్, రతీంద్రన్ ప్రసాద్, సర్జున్ మరియు వసంత సాయి దర్శకులుగా తిరుగులేని విజన్‌తో ‘నవరస’లోని ప్రతి రసాన్ని రూపొందించారు.

ఈ సందర్భంగా మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్‌ మాట్లాడుతూ “పాండమిక్‌ నేపథ్యంలో నిధుల సమీకరణ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. కొవిడ్‌ పరిస్థితుల్లో సినీ పరిశ్రమ చాలా ఘోరంగా దెబ్బతింది. ఇలాంటి సిట్యువేషన్స్‌లో సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం. అలాంటి బలమైన కోరికలో నుంచి నవరస పుట్టింది. ఈ ఆలోచనను ఇండస్ట్రీలోని ఇతర నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు తెలియజేశాం. అందరూ వెంటనే తమ సుముఖతను తెలియజేశారు. కొవిడ్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. మా టీమ్స్‌లో సభ్యులందరూ చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఈ అంథాలజీలోని తొమ్మిది భాగాలను విజయవంతంగా పూర్తి చేశాం. ఇండస్ట్రీ కోసం ప్యాషన్‌, కమిట్‌మెంట్‌తో మేం చేసిన ఈ ప్రయత్నాన్ని 190 దేశాల్లోని ఆడియెన్స్‌ వీక్షించనున్నారు. ఈ ప్రాజెక్ట్స్ కోసం అందరూ మనసు పెట్టి కష్టపడ్డారు. అందరికీ గర్వకారణంగా నిలిచిన ఈ అంథాలజీ విషయాన్ని రివీల్‌ చేయడానికి చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నాం. మన ఇండస్ట్రీ టాలెంట్‌, క్రియేటివిటీకి నవరస నిదర్శనంగా నిలవనుంది. 12000 మంది సహోద్యోగులకు దీని ద్వారా సహకారాన్ని అందించబోతున్నాం. భూమిక ట్రస్ట్‌ ద్వారా మేం చేయనున్న ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ఈ భావోద్వేగ ప్రయాణంలో భాగమైన నెట్‌ఫ్లిక్స్‌ సంస్థకు ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం” అన్నారు.
తొమ్మిది కథల సమాహారంగా రూపొందించబడ్డ ‘నవరస’ టీజర్‌ను భరత్‌ బాలా రూపొందించారు. మనలోని భావోద్వేగాలను చాలా చక్కగా చిత్రీకరించారు.

నవరస’ వివరాలు:

టైటిల్‌ – ఎదిరి(కరుణ)
డైరెక్టర్‌ – బిజోయ్‌ నంబియార్‌
నటీనటులు – విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, రేవతి

టైటిల్‌ – సమ్మర్‌ ఆఫ్‌ 92(హాస్యం)
డైరెక్టర్‌ – ప్రియదర్శన్‌
నటీనటులు – యోగిబాబు, రమ్య నంబీశన్‌, నెడుమూడి వేణు

టైటిల్‌ – ప్రాజెక్ట్‌ అగ్ని(ఆశ్యర్యం)
డైరెక్టర్‌ – కార్తిక్‌ నరేన్‌
నటీనటులు – అరవందస్వామి, ప్రసన్న, పూర్ణ

టైటిల్‌ – పాయాసం(జుగుప్స)
డైరెక్టర్‌ – వసంత్‌ ఎస్‌ సాయి
నటీనటులు – డిల్లీ గణేశ్‌, రోహిణి, అదితి బాలన్‌, సెల్ఫీ కార్తీక్

టైటిల్‌ – పీస్‌(శాంతి)
డైరెక్టర్‌ – కార్తీక్‌ సుబ్బరాజ్‌
నటీనటులు –  సింహ, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, మాస్టర్‌ తరుణ్‌

టైటిల్‌ – రౌద్రం(కోపం)
డైరెక్టర్‌ – అరవింద్‌ సామి
నటీనటులు – రిత్విక, శ్రీరామ్‌, అభినయ శ్రీ, రమేశ్‌ తిలక్‌, గీతా కైలాసం

టైటిల్‌ – ఇన్మయ్‌(భయం)
డైరెక్టర్‌ – రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌
నటీనటులు – సిద్ధార్థ్‌, పార్వతీ తిరువోతు

టైటిల్‌ – తునింత పిన్‌(ధైర్యం)
డైరెక్టర్‌ – ఎస్‌ ఆర్జున్‌
నటీనటులు – అథర్వ, అంజలి, కిశోర్‌

టైటిల్‌ – గిటార్‌ కంబి మేల్‌ నిండ్రు(ప్రేమ)
డైరెక్టర్‌ – గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌
నటీనటులు – సూర్య, ప్రయాగ రోస్‌ మార్టిన్‌

నెట్‌ఫ్లిక్స్ గురించి..

డిజిట‌ల్ రంగంలో వ‌రల్డ్ నెంబ‌ర్ వ‌న్‌గా రాణిస్తోన్న నెట్‌ఫ్లిక్స్‌కు 208 మిలియ‌న్స్ మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారు. 190 దేశాల‌కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంట‌రీలు.. ఇలా డిఫ‌రెంట్ జోన‌ర్స్ కంటెంట్‌తో ప‌లు భాష‌ల్లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది నెట్‌ఫ్లిక్స్‌. వీక్ష‌కులు(స‌బ్‌స్క్రైబ‌ర్స్‌) ఎక్క‌డ నుంచి, ఎంత వ‌ర‌కు అయినా, ఎలాంటి ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌లో అయినా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. స‌భ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడ‌టం, కావాలంటే వారు చూస్తున్న షోను కావాల్సినంత సేపు ఆపుకోవ‌డం మ‌ళ్లీ కావాలంటే ఆపేసిన చోట నుంచే వీక్షించవ‌చ్చు. ఇలా చేసే స‌మ‌యంలో ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌, డిస్ట్రెబ‌న్స్  ఉండ‌వు. నెట్‌ఫ్లిక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు సంబంధించి లేటెస్ట్ న్యూస్‌, అప్‌డేట్స్ IG@Netflix_IN, TW@Netflixindia TW South@Netflix_INSouth and FB@NetflixIndiaల‌ను ఫాలోకండి

జ‌స్ట్‌టికెట్స్‌ గురించి…
షార్ట్ ఫిలింస్ అంథాల‌జీగా రూపొందిన ‘న‌వ‌ర‌స‌’ను మ‌ణిర‌త్నం జ‌యేంద్ర పంచ‌ప‌కేశ‌న్‌(కో ఫౌండ‌ర్ క్యూబ్ సినిమా)లు రూపొందించారు. కొవిడ్ 19 కార‌ణంగా ఎఫెక్ట్ అయిన సినీ ప‌రిశ్ర‌మ‌లోని వారి కోసం ఈ అంథాల‌జీని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌ను జ‌స్ట్ టికెట్స్‌ బ్యాన‌ర్‌..  ఏపీ ఇంట‌ర్నేష‌న‌ల్‌, వైడ్ నేష‌న‌ల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ గా, వారి స‌హ‌కారంతో  రూపొందించింది. ప్రో బోనోగా ఈ అంథాల‌జీలో భాగ‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వారి సేవ‌ల‌ను అందించారు. అందుకు కార‌ణం..సినీ ప‌రిశ్ర‌మ‌కు త‌మ‌వంతుగా స‌హ‌కారం అందించ‌డ‌మే.

Teaser Link: https://www.youtube.com/watch?v=MEXvhhXpOQM

Plain Still Link: VanDAM (netflix.com)
Netflix Branded Stills: VanDAM (netflix.com)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here