New age Murder mystery ‘CSI Sanatan’ Movie Review

Cinemarangam. Com
సినిమా : “సిఎస్ఐ సనాతన్”
రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 10.03.23
సమర్పణ : శ్రీమతి సునీత
నిర్మాత‌ : అజయ్ శ్రీనివాస్
రచన, ద‌ర్శ‌క‌త్వం : శివశంకర్ దేవ్
కెమెరా : జి. శేఖర్
సంగీతం : అనీష్ సోలోమాన్
నటీనటులు : ఆది సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తారక్ పొన్న‌ప్ప, మ‌ధు సూద‌న్, ‘బిగ్ బాస్’ వాసంతి, భూపాల్ రాజా, ఖయ్యుమ్, రవిశంకర్ త‌దిత‌రులు  
కెమెరా : గంగనమోని శేఖర్
ఎడిటర్: అమర్ రెడ్డి
స్క్రీన్ ప్లే: చాగంటి శాంతయ్య
ఆర్ట్ డైరెక్టర్: రవికుమార్ గుర్రం
ఎగ్జిక్యూటివ్: నిర్మాత: కుమార్ శ్రీరామనేని
ఫైట్ మాస్టర్: యు పృథ్వీ
లైన్ ప్రొడ్యూసర్: గురజాల సుబ్బారావు
PRO: GSK మీడియా


శ్రీమతి సునిత సమర్పణలో చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై
ఆది సాయికుమార్, మిషా నారంగ్, నందినీ రాయ్, వాసంతి, తారక్ పొన్నప్ప, అలీ రెజా, ఖయ్యూమ్ నటీ నటులుగా శివశంకర్ దేవ్ దర్శకత్వంలో అజయ్ శ్రీనివాస్ నిర్మించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం “సిఎస్ఐ సనాతన్”.
ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సిఎస్ఐ సనాతన్” చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథః 

సనాతన్‌ (ఆది సాయికుమార్‌) పోలీస్‌ కావాలని ట్రై చేస్తుంటాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వలన ఎగ్జామ్‌ రాయలేకపోతాడు. ఎగ్జామ్స్ మిస్ అయినందున సీఎస్‌ఐ (క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేషన్‌) కోర్స్ చేస్తుంటాడు. ఆ కోర్స్ చేసే టైంలోనే కొన్ని కీలక కేసులు సాల్వ్ చేసి అందరితో మంచి పేరుతెచ్చు కుంటాడు. మరోవైపు ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ వీసీ గ్రూప్ సీఈవో విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) తన కంపెనీ ద్వారా పేదలకు వడ్డీలేని రుణాలు ఇస్తుంటాడు. మరోవైపు తన కంపెనీలో రోజుకి పది రూపాయలు ఇన్వెస్ట్ చేసే స్కీమ్‌ పెడతాడు. దాంతో తక్కువ కాలంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు విక్రమ్ .అయితే విక్రమ్ కు ఇంటర్నేషనల్ డీల్ రావడంతో వారిని కలవడానికి వెళ్లే క్రమంలో రాత్రి పార్టీ చేసుకుంటారు. ఆ రాత్రి అనుకోకుండా సీఈవో విక్రమ్ చక్రవర్తి హత్యకు గురవుతాడు. దాంతో చక్రవర్తి మర్డర్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సి బాధ్యత సనాతన్ కు అప్పగిస్తారు. విక్రమ్ చక్రవర్తితో పాటు కంపెనీలో పార్టనర్ దివ్య (నందినీ రాయ్), ఉద్యోగులు లాస్య (బిగ్ బాస్ వాసంతి), సనాతన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ సుదీక్ష (మిషా నారంగ్), మరో ఇద్దరిని ఇలా ఐదు మందిని అనుమానిస్తాడు. విక్రమ్, లాస్యతో పాటు ఎన్నో కేసులు ఉన్న మంత్రి రాజవర్ధన్ (మధుసూదన్ రావు) కూడా వీసీ కంపెనీలో భాగస్వామి అని తెలుస్తుంది. సనాతన్ ముందు ఇలా ఎన్నో ట్విస్ట్ లు ఉన్న ఈ కేస్ ను సనాతన్ ఎలా చేదించాడు. అనుమానిస్తున్న 5 గురిలో ఎవరు విక్రమ్ ను చంపారు? చంపడానికి గల కారణాలేంటి?మరో వైపు లవ్ లో ఉన్న సుదీక్ష, సనాతన్ లు ఎందుకు విడిపోయారు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే “సీఎస్‌ఐ సనాతన్” సినిమా చూడాల్సిందే…


నటీ నటుల పనితీరు
ఆది సాయి కుమార్ కిచ్చిన సనాతన్ క్యారెక్టర్ లో లీనమై నటించాడు. కేవలం తన హావ భావాలతో చాలా సీన్స్ లలో చాలా చక్కగా నటించి మెప్పించాడు. సుదీక్ష పాత్రలో నటించిన మిషా నారంగ్ స్క్రీన్ స్పేస్ తక్కువే. అయిన ఉన్నంతలో చాలా బాగా చేసింది..దివ్య పాత్రలో నందినీ రాయ్ కూడా మెప్పించింది. లాస్యగా నటించిన ‘బిగ్ బాస్’ వాసంతి కృష్ణన్ కనిపించిన సన్నివేశాలు తక్కువే అయినా ఉన్నంతలో బాగా చేశారు. అలీ రెజా, ఖయ్యుమ్, రవిప్రకాష్, మధుసూదన్ రావు తదితరులు వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
సమాజంలో మధ్య తరగతి, పేద ప్రజలు మోసపోతున్న అంశాలతో పాటు స్వార్థం, డబ్బు మీద ఆశ మనిషిని ఎన్ని తప్పులు చేయిస్తుంది? అనే అంశాలతో దర్శకుడు శివశంకర్ దేవ్ రాసుకున్న మర్డర్ మిస్టరీ అంశాలను ఈ చిత్రంలో చూపించిన తీరు బావుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనీష్ సోలమన్ అందించిన సంగీతం మరియు సినిమాటోగ్రాఫర్ గంగనమోని శేఖర్ కెమెరా పనితనం ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు . అమర్ రెడ్డి ఎడిటింగ్ పనితీరు బాగుంది. యు పృథ్వీ అందించిన ఫైట్స్ బాగున్నాయి. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన “సిఎస్ఐ సనాతన్” చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ లో ఖర్చుకు వెనుకాడకుండా అజయ్ శ్రీనివాస్ నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథలు ఇష్టపడేవారికి “సిఎస్ఐ సనాతన్” సినిమా కచ్చితంగా నచ్చుతుంది

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here