Niharika Konidela – Pink Elephant Pictures’ “Committee Kurrollu” teaser launched by Hero Nithin

పెరిగి పెద్దై బాధ్యతలను మోస్తున్న పెద్దవాళ్లనైనా, యువత అయినా ఏదో ఒక సందర్భంలో చిన్నతనమే బావుందని అనుకుంటాం.  అలా అనుకోవటం కూడా నిజమే! ఎలాంటి పొరపచ్చాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది… ఈ పాయింట్‌ను బేస్ చేసుకుని రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’.

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు.  ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం విశేషం. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది.  త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం రోజున ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్‌ విడుదలైంది. ప్రముఖ హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

టీజర్‌ను గమనిస్తే కొంత మంది యువకులు వారి బాల్యాన్ని తలుచుకుంటే అప్పట్లో ఆటలు ఆడుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరదాగా గడిపిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు. చిన్నతనంలో వాళ్లందరూ కలిసి ఓ ఇడ్లీ అంగల్లో ఇడ్లీలు తినటం, పంపు సెట్టుకాడా సరదాగా స్నానాలు చేయటం వంటి సన్నివేశాలను మనం చూడొచ్చు. అలాగే టీనేజ్‌లో మనసుకు నచ్చిన అమ్మాయిలను ప్రేమించటం, ఆ సందర్బంలో జరిగిన కామెడీని వారు గుర్తుకు తెచ్చుకోవటం వంటి సన్నివేశాలను కూడా టీజర్లో గమనించవచ్చు.

ఇదే టీజర్‌లో ఊర్లో జరిగే గొడవలను కూడా చూడొచ్చు. అసలు సరదాగా ఉండాల్సిన యువత ఊళ్లో గొడవల్లో ఎందుకు తలదూర్చుతారు. ఆ గొడవల కారణంగా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనే విషయాలు తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

నటీనటులు :

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు

సాంకతిక వర్గం :

సమర్పణ – నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు – పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక,  రచన, దర్శకత్వం – యదు వంశీ, సినిమాటోగ్రఫీ – రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ – అనుదీప్ దేవ్,  ప్రొడక్షన్ డిజైనర్ – ప్రణయ్ నైని, ఎడిటర్ – అన్వర్ అలీ, డైలాగ్స్ – వెంకట సుభాష్  చీర్ల, కొండల రావు అడ్డగళ్ల,  ఫైట్స్ – విజయ్, నృత్యం – జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, సౌండ్ డిజైన‌ర్‌:  సాయి మ‌ణింద‌ర్ రెడ్డి, పోస్ట‌ర్స్‌:  శివ‌, ఈవెంట్ పార్ట్‌న‌ర్‌:  యు వి మీడియా, మార్కెటింగ్‌:  టికెట్ ఫ్యాక్ట‌రీ,  పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here