Nithin,Rashmika’s Bheeshma Movie Review

Release date :-February 21st,2020
Cinemarangam.com:-Rating:3/5
Movie name:-”Bheeshma”.
Banner:-Sitara Entertainment.
Starring: Nithin,Rashmika Mandana,Naresh,Bramhaji,Vennela Kishor,Subhalekha Sudhakar,Etc..
Music Director :-Mahathi Swara Sager
Editor:-Naveen nuli.
Cinematography:-Sai Sreeram.
Director :-Venky Kudumula.
Producer :-Suryadevara Naga Vamshi.

హీరో నితిన్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది దానికి తోడు త్రివిక్రమ్ తో తీసిన “అఆ” తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కూడా నితిన్ కొట్టలేదు.దీనితో ఈసారి ఎలా అయినా హిట్ అందుకోవాలని వెంకీ కుడుములతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసారు.‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘భీష్మ’. సినిమాలోని పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

భీష్మ (నితిన్) డిగ్రీని సగంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురుచూస్తూ తనకు నచ్చినట్టు లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. మరో పక్క వ్యవసాయ రంగానికి చెందిన “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సీఈఓ భీష్మ (అనంత్ నాగ్) ఉంటాడు. దాని కోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్లే సీఈవో కోసం చూస్తుంటాడు. అయితే వీరికి పోటీగా క్రిమినల్ మైండెడ్ మరో కార్పొరేట్ కంపెనీ హెడ్ అయిన రాఘవన్(జిష్షు) అడ్డుపడుతుంటాడు…ఈ మధ్యలో చైత్ర (రష్మిక)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె వెంట పడుతూ ఆమెను లవ్ లో పడేయడానికి ట్రై చేస్తాడు. అంతలో కొన్ని ఊహించని పరిణామాల ద్వారా బీష్మ (నితిన్) తనకు ఏ సంబంధం లేని ఆ భీష్మ ఆర్గానిక్ కంపెనీ భాద్యతలు చేపడతాడు. ఆ తరువాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు ? అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈవో అయ్యాడు ? చివరికి నితిన్ రష్మిక ఒక్కటవుతారా ? లేదా ? మొత్తం ఈ క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

నితిన్ నటన, హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.నితిన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్ తో పాటు తన టైమింగ్‌ తో కూడా బాగా నవ్వించాడు. ముఖ్యంగా కార్ సీన్స్ లో మరియు ఫోన్ లో మెసేజ్ చేసే సీక్వెన్స్ లో అలాగే మిగిలిన కామెడీ అండ్ లవ్ సీన్స్ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇంటర్వెల్ సీన్ లో కూడా చాలా బాగా చేశాడు. కథానాయకిగా నటించిన రష్మిక తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఇంపార్టంట్ రోల్ లో కనిపించిన అనంత్ నాగ్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు.
అలాగే సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మరియు నితిన్, కేజీయఫ్ ఫేమ్ నటుడు అనంత్ నాగ్ ల మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్,అలాగే ఆసక్తికరంగా మారే కథనాలు బాగున్నాయి.మరో కీలక పాత్రలో కనిపించిన వెన్నెల కిషోర్ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు..తండ్రి పాత్రలో నటించిన సంపత్ రాజ్ తన నటనతో మెప్పించారు. అలాగే మరో కీలక నటుడు జిష్షు గుప్త మరోసారి టాలీవుడ్ లో మంచి హాట్ టాపిక్ అవుతాడని చెప్పాలి.హెబ్బా పటేల్ స్క్రీన్ షోకే పరిమితం అయింది.ఇక సినిమాలోని మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

ఛలో” చిత్రంతో వెంకీ చేసిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యిందని చెప్పాలి.దర్శకుడు వెంకీ ఫస్ట్ హాఫ్ ని సరదాగా నడిపాడు. అలాగే సెకండాఫ్ లో కూడా సరదాగా నడుపుతూనే ఆర్గానిక్ సంబంధించి మంచి మెసేజ్ ఇస్తూ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసారు.ఆర్గానిక్ ట్రాక్ కి సంబంధించి మరింతగా డిటైల్డ్ గా చూపించి ఉంటే బాగుండేది. సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నా, దర్శకుడు మాత్రం తన శైలిలోనే కథనాన్ని కామెడీగా నడిపాడు

దర్శకుడు వెంకీ రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్ తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కాకపొతే ఆయన కథనం పై ముఖ్యంగా రెండువ భాగం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లేలో కామెడీ చూపించిన విధానం బావుంది.

మొత్తానికి రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్ తో మరియు ఆర్గానిక్ కి సంబంధించి మంచి మెసేజ్ తో యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని బాగానే అలరిస్తుంది. ఈ సినిమా మంచి ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Cinema Rangam.com  3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here