Oscar Award winner Chandra Bose Launched Independent Music Video ‘Bangaru Bomma’, The billboard in Times Square grabbed the attention

టాలెంట్‌ను ప్రద్రర్శించేందుకు ప్రస్తుతం ఎన్నో మార్గాలు, సాధనాలున్నాయి. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. యంగ్ యాక్టర్స్, మ్యూజిషీయన్స్, ఆర్ట్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్లంతా కూడా రకరకాల మాధ్యమాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కు ఎక్కువగా క్రేజ్ ఉంటోంది. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌పై దృష్టి పెడుతున్నారు. తెలుగులో ఇండిపెండెంట్ ఆల్బమ్స్ తక్కువగా వస్తుంటాయి.
ఎం.సి.హరి, ప్రొజాక్‌లు నటించిన బంగారు బొమ్మ అనే ఇండిపెండెంట్ ఆల్బమ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటను ఎం.సి.హరి, ప్రొజాక్‌లు రాయడమే కాకుండా స్వయంగా ఆలపించారు. వేదం వంశీ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ క్రేజీ ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రణీత్ నెకురి నిర్మించారు.
ఈ ఆల్బమ్‌లోని విజువల్స్, కాన్సెప్ట్ అన్నీ కూడా బాగున్నాయి. ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ బంగారు బొమ్మ అనే ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను ఎం.సి.హరి, ప్రొజాక్‌లు రాయడమే కాకుండా స్వయంగా ఆలపించారు. వేదం వంశీ బాణీ కట్టారు. ప్రస్తుతం ఇలాంటి ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కి ఎక్కువగా క్రేజ్ ఏర్పడింది. నిర్మాత ప్రణీత్ అమెరికాలో డాక్టర్. కళ మీదున్న ప్యాషన్‌తో ఇక్కడకు వచ్చి ఇలా ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను నిర్మించారు. ఈ పాటలో రెండు లేయర్స్ ఉన్నాయి. ఇదొక కొత్త ఆలోచనకు నాంది. ఇలాంటి ఆల్బమ్స్ మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. ఈ పాట పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 
న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ భవనంపై బంగారు బొమ్మ సందడి చేస్తోంది. అక్కడి వారందరు బంగారు బొమ్మ పోస్టర్‌ను చూసి ఫిదా అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here