Out-and-out entertainer ‘NAMO’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సినిమా : ‘నమో’.
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 07.06.2024
నిర్మాత : ఏ.ప్రశాంత్
రచన, దర్శకత్వం : ఆదిత్య రెడ్డి కుందూరు
నటీనటులు:  విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ, తదితరులు
సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్ 
సంగీతం : క్రాంతి ఆచార్య వడ్లూరి
ఎడిటర్ : సనల్ అనిరుధన్
పీఆర్వో : ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 7న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నమో’ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
నగేష్ (విశ్వంత్ దూడుంపూడి) మరియు మోహన్ (అనురూప్ కటారి) మంచి స్నేహితులు. చాలా కాలం నుండి తన కుటుంబానికి దూరంగా ఉంటున్న నగేష్ తండ్రి ఒక నక్సలైట్ గ్రూపుకు నాయకుడు. తన తండ్రి మాతో ఉంటే మా ఫ్యామిలీ ఎంతో హ్యాపీ గా ఉంటుందని భావించి తన తండ్రిని ఎలాగైనా వెతికి తీసుకువచ్చి శాశ్వతంగా తన ఫ్యామిలీ కి దగ్గర చెయ్యాలని నగేష్ ప్లాన్ చేస్తాడు. దీంతో తన తండ్రిని వెతకడానికి ఫ్రెండ్ మోహన్ తో కలసి నల్లమల అడవిలోకి బయలుదేరుతారు. ఆలా వెళ్లిన వీరు ఈ అడవిలో ఉన్న గిరిజనుల చేతుల్లో బందీలు అవుతారు.ఈ క్రమంలోనే ఆ ఊరి గిరిజనులు వెలివేసిన గంగ అనే గిరిజన అమ్మాయితో ప్రేమలో పడతాడు. దాంతో వారికీ అక్కడ కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే వీరి నుండి తప్పించుకొనే క్రమంలో ఆ అడవిలో నగేష్ మరియు మోహన్‌లకు ఏమి జరుగుతుంది. చివరికి తన తండ్రిని కలుస్తాడా ? మరియు గంగ ప్రేమను దక్కించుకుంటాడా? లేదా అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “నమో” సినిమా చూడాల్సిందే..

నటీ,నటుల  పనితీరు
మంచి టైమింగ్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి తన టాలెంట్‌ని నిరూపించుకున్నాడు హీరో విశ్వంత్ దూడంపూడి. ప్రీ క్లైమాక్స్ సన్నివేశంలో అతని ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ నటుడికి ఎసెట్. అనురూప్ కటారి పూర్తి నిడివి పాత్రలో కనిపించాడు మరియు తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు నవ్వు తెప్పించాడు. హీరోయిన్ విస్మయశ్రీ గంగ గా గిరిజన యువతి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఆర్టిస్టులు మేకా రామకృష్ణ మరియు వడ్లమాని శ్రీనివాస్‌లు చాలా చక్కగా నటించారు.గిరిజన సమూహ నాయకుడిగా వీరేంద్ర చౌహాన్ దూకుడు పాత్రలో అత్యుత్తమంగా నటించాడు.ఇంకా ఇందులో నటించిన వారంతా వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే చిత్రమే “నమో” .ఇద్దరు స్నేహితులు గిరిజన ప్రజల నుండి తప్పించుకోవడానికి వారు ఎలాంటి కష్టాలు పడ్డారు అనేటటువంటి చక్కటి కథను రాసుకొని దీనికి సరైన కామెడీని మరియు భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు తన వంతు ప్రయత్నం చేయడంలో దర్శకుడు ఆదిత్య రెడ్డి కుందూరు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. క్రాంతి ఆచార్య వడ్లూరి అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాత్సవ్ సహజమైన లొకేషన్లలో చిత్రీకరించి మంచి విజువల్స్‌ ఇచ్చాడు. సనాల్ అనిరుధన్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.శ్రీ నేత్ర క్రియేషన్స్ మరియు ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ బ్యానర్ పై  ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాత ఏ.ప్రశాంత్ నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మధ్య మధ్యలో వచ్చే ప్రతీ ట్విస్టు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే రెండు భాగాల్లో మంచి డైలాగులు, ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది.కొత్త కంటెంట్ ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం “నమో”‘’ సినిమా తప్పకుండా నచ్చుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

Cinemarangam.Com Review Rating .. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here