Padmasri Mammootty’s ‘Great Shankar’ Movie Review

Release date :- August 27, 2021
Cinema rangam :– Rating 3./5
Movie Name :- “Great Shankar”
Presents :– Lagadapati Bharghava
Banner :-  Sri LVR Productions
Cast : – Padmasri Mammootty,Varalakshmi Sharath kumar,Inni Miku dan(Bhagamathi fame),Punam Bajva etc.
Music :-  Deepak Dev
DOP :- Vinod Vallampaati
P.R.O :- Madhu V.R
Producer :- Lagadapati Sridhar
Director : – Ajay Vasudev

శ్రీ లగడపాటి భార్గవ సమర్పణలో  లగడపాటి శ్రీనివాస్ శ్రీ ఎల్.వి.ఆర్ సంస్థ నుండి వస్తున్న ఈ చిత్రం  మలయాళంలో విజయం సాధించిన “మాస్టర్ పీస్” చిత్రాన్ని “గ్రేట్ శంకర్” గా మన తెలుగు ప్రేక్షకులకు అందించారు. సూపర్ స్టార్ మమ్ముట్టి , వరలక్ష్మి శరత్ కుమార్  కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
కాలేజీ క్యాంపస్ నేపథ్యంలో సాగె కథ.. ఈ క్యాంపస్‌లో రెండు వ్యతిరేక గ్రూపు విద్యార్థుల మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా ఆ కళాశాల ప్రాంగణం ఎల్లప్పుడూ గోడవలతో ఉద్రిక్త వాతావరణంలో ఉంటుంది.ఎడ్వర్డ్ లివింగ్‌స్టన్ ఆంగ్ల ప్రొఫెసర్‌(మమ్ముట్టి) ని నియమిస్తే  క్యాంపస్‌కు సరైన మార్గంలోకి తీసుకు వస్తాడని కాలేజ్ ప్రొఫెసర్ గా నియమిస్తారు. ఇంతలో కాలేజీ లో ఇద్దరు విద్యార్థులు హత్య చేయబడతారు దాంతో అందరి చూపు కాలేజ్ పైనే పడుతుంది. అలాగే చనిపోయిన స్టూడెంట్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ACP గా భవానీ దుర్గ (వరలక్ష్మీ శరత్‌కుమార్) మరియు ఆమె సహోద్యోగి జాన్ థెక్కెన్ (ఉన్ని ముకుందన్) లు నియమిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. చనిపోయిన స్టూడెంట్స్ ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో స్టూడెంట్స్ కు పోలీసుల మధ్య గొడవ జరుగుతుంది. మరి ఆ సమస్యలని ఆ ప్రొఫెసర్ (మమ్ముట్టి) ఎలా పరిష్కరించాడు.. ఉద్రిక్త వాతావరణం లో ఉన్న ఆ కాలేజీని ప్రశాంత వాతావరణంగా మార్చ గలిగాడా లేదా అనేదే కథ.

నటీనటుల పనితీరు
ముఖ్య పాత్రలుగా నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.ఎడ్వర్డ్ లివింగ్‌స్టన్ గా మమ్ముట్టి చేసిన  యాక్షన్ సీన్స్,ACP గా భవానీ దుర్గ (వరలక్ష్మీ శరత్‌కుమార్), జాన్ థెక్కెన్ (ఉన్ని ముకుందన్), పూనమ్ బజ్వా, ల నటనకు థియేటర్ లో ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సినిమా రెండవ భాగంలో. కెప్టెన్ రాజు పావని అవతార్‌ కామెడీ బాగుంది.. అదేవిధంగా, మమ్ముట్టి పాత్ర చాలా సందర్భాలలో ‘నేను మహిళలను గౌరవిస్తాను’ అని  చెపుతూ నిరంతరం కాలేజీ కోసం పడుతున్న తపన ను చూసిన వారంతా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ప్రొఫెసర్ గా  క్లాస్‌లో వారిని క్రమశిక్షణతో పెడుతూ, స్టూడెంట్స్ కొట్టడానికి వచ్చిన గుండాలతో ఫైట్ చేయడం వంటి సీన్స్ లలో చక్కగా నటించాడు. మిగిలిన నటులంతా వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
మమ్ముట్టి ప్రొఫెసర్ పాత్రలో సినిమాకి ప్రాణం పోశాడు. అతను ఎడ్వర్డ్ లివింగ్‌స్టోన్,గా కఠినమైన కళాశాల ప్రొఫెసర్‌గా వుంటూ అవసరమైనప్పుడు కాలేజీ స్టూడెండ్ గా స్టైలిష్‌గా ఉండేలా దర్శకుడు అజయ్ వాసుదేవ్ చాలా చక్కగా తెరకెక్కించాడు., ఎడ్వర్డ్, పోలీసుల కంటే ముందు  మరణంచిన వారి రహస్యాన్ని ఛేదించే సీన్స్ ,యాక్షన్ సీక్వెన్స్‌ లను తెరకెక్కించిన విధానంతో  విమర్శకుల ప్రశంశలు పొందాడు దర్శకుడు. ప్రస్తుత పరిస్థితుల్లో నేటి యూత్ చదువుకోకుండా వారు   జీవితంలో ఎం కొల్పోతారు అనే విషయాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్లు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. తన జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఇందులో పొందుపరిచాడు దర్శకుడు. దీపక్ దేవ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి. వినోద్ వల్లంపాటి అందించిన డిఒపీ బాగుంది. కథ ,నటీనటుల ఎంపికలో దర్శకుడి టేస్ట్ బాగుంది.నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణ విలువలను చాలా గ్రాండియర్ గా చూపించారు. ఇందులో నటించిన పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి.  ఫ్యామిలీతో  పాటు కలసి చూడవలసిన సినిమా “గ్రేట్ శంకర్” ఇది అందరికీ తప్పక నచ్చుతుంది.

            Cinemarangam.com Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here