‘Padmavyuham lo Chakradhari’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ :  వీసీ క్రియేషన్స్
సినిమా : ‘పద్మవ్యూహంలో చక్రధారి’
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 21.06.2024
నిర్మాత: కే.ఓ.రామరాజు
దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపు  
నటీనటులు: ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌, శశికా టిక్కూ, అషురెడ్డి, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్, మహేష్ విట్టా తదితరులు.
సంగీత దర్శకుడు: వినోద్ యాజమాన్య
సినిమాటోగ్రఫీ: జీ. అమర్
ఎడిటర్: ఎస్ బీ ఉద్దవ్
పీఆర్ఓ: హరీష్, దినేష్

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ హీరోగా పరిచయం అయిన ఈ సినిమా నేడు థియేటర్లో విడుదలైంది. ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్,  ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. దాంతో ప్రేక్షకుల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ‘పద్మవ్యూహంలో చక్రధారి’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి. 

కథ:
రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామానికి చెందిన చక్రీ(ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌) సిటీలో ఐటీలో జాబ్ చేసుకుంటూ స్నేహితులతో ఉంటాడు. అదే సమయంలో హీరో ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. చక్రీ, సత్యకు జాబ్ రావడంలో హెల్ప్ చేస్తాడు. దాంతో ఇద్దరు మంచి స్నేహితులు, ఆ తరువాత ప్రేమికులుగా మారుతారు. అదే సమయంలో అనుకోకుండా సత్య జాబ్ వదిలేసి ఊరికి వెళ్లిపోతుంది. విషయం తెలుసుకున్న చక్రీ తన ఉద్యోగానికి లీవ్ పెట్టి తాను కూడా విలేజ్‌కి వెళుతాడు. హీరో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) ఊరిలో ఎలక్ట్రీషన్‌గా పనిచేస్తాడు. అతని సాయంతో సత్యను కలువాలి అనే ప్లాన్ చేస్తాడు. అదే విలేజ్‌లో స్కూల్ టీచర్‌గా పద్మ(అషురెడ్డి) పనిచేస్తుంది. తన భర్త కోటి(భూపాల్ రాజ్) ఓ తాగుబోతు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్(మధునందన్) కూడా తన పాస్ట్‌లో జరిగిన సంఘటనలకు ఆ ఊరి వారంటే ద్వేషం పెంచుకుంటాడు. అతను తాగుబోతు అవుతాడు. ప్రేమకోసం వచ్చిన చక్రీ సత్యను దక్కించుకున్నాడా లేదా? పద్మ తాగుబోతు అయిన కోటిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.? అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏంటి? సత్యను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల నాన్న హీరోకు పెట్టిన కండీషన్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు

హీరోగా ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ తొలిపరిచయం అయినా సరే నటన పరంగా మెప్పిస్తాడు. లవ్ సీన్లలో చాలా బాగా నటించాడు. అలాగే సాంగ్స్ కూడా మెప్పించే విధంగా ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా చేశాడు. కచ్చితంగా సిల్వర్ స్క్రీన్‌పై మంచి భవిష్యత్తు ఉంది. అలాగే హీరోయిన్ శశికా టిక్కూ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో తన కళ్లతో, హావభావాలతో అలరించింది. తెలుగు నేటివిటీకి ఫిట్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమాతో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక అషురెడ్డి తను గ్లామర్ క్యారెక్టర్ కాకుండా సెటిల్డ్ క్యారెక్టర్ చేసింది. ఒక పిల్లాడి తల్లిలా నటించింది. మురళిధర్ గౌడ్ తన క్యారెక్టర్ మేరకు మెప్పించాడు. అలాగే మహేష్ విట్టా కామెడీ అద్భుతంగా పండించాడు. మధునందన్ నటన బాగుంది. రెండు వెరియేషన్స్ ఉన్న పాత్ర చేశాడు. ఇక కోటి పాత్రలో నటించిన భూపాల్ రాజ్ పెద్ద పాత్ర. అందులో జీవించాడు. అలాగే ధనరాజ్, రూపా లక్ష్మి, చైల్డ్ ఆర్టిస్టులు తదితరులు తమ పాత్రల మేర మెప్పించారు. 
సాంకేతిక నిపుణుల పనితీరు
చక్రవ్యూహంలోకి ఎవరు వెళ్లినా బయటకు రాలేరు. దాని నుంచి ఎలా బయట పడాలో తెలిసిన వ్యక్తులు ఒకరు అర్జునుడు, మరొకరు ఆ చక్రధారుడైన శ్రీకృష్ణుడు. అనే  కాన్సెప్ట్ ను తీసుకొని దానికి లవ్ & కామెడీ ఎంటర్టైన్మెంట్ ను జోడించి అడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెర కెక్కించడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్‌లో అన్ని క్యారెక్టర్లను రివీల్ చేసే విధానం బాగుంది.ముఖ్యంగా  గ్రామంలో కన్పించే రెగ్యూలర్ క్యారెక్టర్లను చాలా ఫన్నీగా రాసుకున్నారు. ఇక ఇక సెకండ్ హాఫ్‌లో కూడా  కామెడీ తగ్గకుండా భావోద్వేగాలతో కట్టిపడేశారు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తన ప్రేమ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇక హీరో హీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ సైతం బాగుంది. అలాగే ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. కిట్టు క్యారెక్టరైజేషన్ కూడా అలరిస్తుంది. విలేజ్ నెేటివిటీకి తగ్గట్టుగా రచయిత దర్శన్ రాసిన డైలాగ్స్ తెరమీద అద్భుతంగా పండాయి. జీ. అమర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.  అలాగే నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా సువ్వి సువ్వి పాటతో తో పాటు ఇందులో ఉన్న పాటలు ఆన్నీ ప్రేక్షకులను అలరించాయి. ఎడిటింగ్ పనితీరు బాగుంది.. వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ రామరాజు  నిర్మించిన చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. విలేజ్ నేపథ్యంలో సాగే కథ కాబట్టి పల్లె వాతవరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.ఎక్కడా అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఎంటర్ టైనింగ్ తో రూపొందించిన “పద్మవ్యూహంలో చక్రధారి” సినిమా ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది.
Cinemarangam.Com    Review Rating .. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here