Pan India Actress Pooja Hegde interview about..’Radhe Shyam’

పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈ పేరుకు ఎంత క్రేజ్ వుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంజునాథ్ హెగ్డే (వ్యాపార వేత్త),లతా హెగ్డే(క్యూ నెట్ వర్క్ బిజినెస్ హెడ్)ల గారాల పట్టి పూజ హెగ్డే  ముంబయిలో జన్మించింది.భరత నాట్యంలో శిక్షణ పొందిన పూజా ముంబయి లోని ఎంఎంకే కాలేజ్ లో కామర్స్ లో ఉన్నత విద్యను అభ్యసించింది.కాలేజ్ ప్రోగ్రామ్స్ లలో డ్యాన్సర్ గా, ఫ్యాషన్ షో లలో మోడల్ గా పాల్గొనేది. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన తరువాత 2009 లో మిస్ ఇండియా పోటీలలో పాల్గొని ఎలిమినెట్ అయినా.. అనతి కాలంలోనే మోడల్ గా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకొంది. 2010 న జరిగిన ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొని రెండో స్థానంలో నిలిచి అందరి కళ్ళు తనవైపు తిప్పుకొనేలా చేసుకుంది.2012 లో తమిళం లో జీవా నటించిన “మూగ ముడి” తో సినిమా రంగంలోకి ప్రవేసించింది. 2014 లో నాగచైతన్య “ఒక లైలా కోసం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. వరుణ్ తేజ్ కు జోడీగా “ముకుంద” సినిమాలో నటించి గోపికమ్మా.. పాట తో తెలుగు ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.2016 లో హృతిక్ రోషన్ తో “మహేంజా దారో” సినిమాతో బాలీవుడ్ కు పరిచయమై అక్కడ సైతం మంచి గుర్తింపును తెచ్చుకుంది.2017లో అల్లు అర్జున్ తో ”దువ్వాడ జగన్నాథం”, బెల్లంకొండ శ్రీనివాస్ తో ”సాక్ష్యం”, 2018 లో జూనియర్ ఎన్టీఆర్ తో ”అరవింద సమేత వీర రాఘవ”,2019 లో మహేష్ బాబు తో ”మహర్షి”,వరుణ్ తేజ్ తో ”గద్దల కొండ గణేష్”, 2020 లో అల్లు అర్జున్ తో ”అల వైకుంఠపురం”, 2021 లో అఖిల్ తో ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, 2022 లో “రాధే శ్యామ్”వంటి సినిమాలు చేస్తున్న పూజ 2023 లో  కొరటాల శివ దర్శకత్వంలో  చిరంజీవి,రామ్ చరణ్ ల “ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, మలయాళం,కన్నడ హిందీ భాషల్లో అగ్ర హీరోలందరితో జోడి కడుతూ వరుస హ్యాట్రిక్ హిట్ సినిమాలు చేస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు పాన్ ఇండియా స్టార్ యాక్ట్రెస్ పూజా హెగ్డే. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “రాధే శ్యామ్” చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాకు ప్రాణం.అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, అత్యద్భుతమైన సెట్లు.. అన్నింటినీ కలిపి ”రాధే శ్యామ్” సినిమాను ఎప్పటికీ మరిచిపోలేని ఒక గొప్ప ప్రేమ కథగా తెరకెక్కించారు రాధాకృష్ణ కుమార్. ఇప్పటికే విడుదలయిన “రాధే శ్యామ్” గ్లింప్స్ అన్ని భాషల్లో రికార్డులు తిరగరాస్తుంది. లక్షల్లో లైకులు..కోట్లలో వ్యూస్ వచ్చాయి.రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌లో సమర్పిస్తుండగా యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నా రు. ప్రమోద్, వంశీ, ప్రసీధ నిర్మాతలు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో జస్టిన్ ప్రభా కరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ అందాల సుందరి పూజ హెగ్డే చిత్రంలో నటించిన అనుభవాలను పాత్రికేయ మిత్రులతో  ఆమె మాట్లాడుతూ…

– రాధే శ్యామ్ చిత్రంలో ప్రేరణ అనే పాత్రలో నటించాను. జీవితాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి ప్రేరణ. అందంగా ముస్తాభవుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రేరణతో కొన్ని సందర్భాల్లో నన్ను నేను పోల్చుకోగలను.

కోవిడ్ తరువాత నేను చేస్తున్న సీరియస్ మెచ్యూర్డ్ లవ్ స్టొరీ ఇది.ఇది రెగ్యులర్ లవ్ స్టొరీ లా ఉండదు. ఇటువంటి మూవీ చేయడానికి దేవుడు నాకొక ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో నాది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, నా క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంటుంది. ఇందులో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. కెరీర్ లో మొదటి సారి నా క్యారెక్టర్ కు చాలా రీసెర్చ్ చేశాను.నేను చాలా బుక్స్ చదివాను.అలా చేసినందుకు నా క్యారెక్టర్ చాలా హెల్ప్ అయ్యింది.

– ఇది పీరియాడిక్ మూవీ. కానీ యూరప్ లో కథ జరుగుతుంది కాబట్టి అక్కడి సంప్రదాయ, వేషభాషలు ఎలా ఉంటాయో వాటి ప్రకారమే చిత్రీకరణ జరిపారు. షూటింగ్ కోసం జార్జియా వెళ్లినప్పుడు మూడు రోజులు షూటింగ్ చేయగానే ఫస్ట్ లాక్ డౌన్ పెట్టారు. భయంభయంగా తిరిగొచ్చాం. అది నా కెరీర్ లో ఎక్కువగా భయపడిన సందర్భం. తెలిసిన వాళ్లు ఫోన్లు చేసి బతికుంటే షూటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. తిరిగొచ్చేయ్ అన్నారు.

– ఇటలీ షూటింగ్ టైమ్ లో నా పర్సనల్ టీమ్ లో ముగ్గురికి కోవిడ్ వచ్చింది.అప్పుడు ప్రభాస్ వారికి తన టీమ్ తో ఫుడ్ వండించి పంపేవారు.నాకు  పిజ్జా,పాస్తా అంటే ఎంతో ఇష్టం.అవి కూడా ప్రిపేర్ చేయించేవారు. వెజిటేరియన్ ఫుడ్స్ కూడా చాలా బాగుండేది. దాంతో మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది.ప్రభాస్ బయట ఎక్కువగా మాట్లాడరు గానీ సెట్ లో  జోవియల్ గా ఉంటూ ఎంతో సందడి చేస్తూనే ఉంటారు.

– ప్రభాస్ తో పెయిర్ బాగుందని చెబుతున్నారు. దీనికి మా ఇద్దరి హైట్స్ దాదాపు మ్యాచ్ అవడమే కారణం అనుకుంటా. రాధే శ్యామ్ కు టైటానిక్ మూవీకి సంబంధం లేదు. షిప్ సీన్స్ ఉన్నాయి అంతే. టైటానిక్ తో పోల్చడం మా సినిమా గౌరవమే.

– ప్రేరణగా నటించే కొన్ని సీన్స్ లో నిజంగానే ఏడ్చేశాను. అయితే దర్శకుడు కట్ చెప్పాక మళ్లీ హిందీకి చేద్దాం రెడీ అన్నారు. ఇప్పుడే పూర్తయ్యింది. మళ్లీ ఏడవాలా అనుకునేదాన్ని.ఇలా తెలుగు, హిందీ భాషలలో ప్యార్లల్ గా  ఎంతో ఛాలెంజ్ గా తీసుకొని యాక్ట్ చేయడం జరిగింది. నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా తో జర్నీ చేస్తున్నాను.

– ఫెంటాస్టిక్ మేకింగ్ విజువల్స్ రాధే శ్యామ్ లో చూస్తారు. ఎంత ఫన్ ఉంటుందో, అంతే ఎమోషనల్ గా ఉంటుంది. ప్రేరణ, విక్రమాదిత్య కలిశారా లేదా అనేది టికెట్ కొని సినిమాలో చూడండి.

– నేను ఆస్ట్రాలజీ ని నమ్ముతాను.చాలా సార్లు నేను ఆస్ట్రాలజీ దగ్గరకు వెళ్లడం జరిగింది. మన భారతీయ సంప్రదాయం చాలా గొప్పది, చారిత్రకమైనది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి లేని రోజుల్లో మన పూర్వీకులు ఖగోళం, సైన్స్ లో అద్భుతాలు సృష్టించారు.

ముకుంద సినిమా చేసిన తరువాత పూజా గ్లామర్ రోల్స్ కు పనికిరాదు అన్నారు.డి.జె చేసిన తరువాత గ్లామర్ రోల్స్ కు పనికిరాదనే పేరు తొలగిపోయి గ్లామర్ రోల్ ను పర్ఫెక్ట్ గా చేసింది అన్నారు.అరవింద సమేత లో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశాను. వాల్మీకి లోని ఎల్లువోచ్చి గోదారమ్మ పాటకు మంచి అప్లాజ్ వచ్చింది. తారక్, అల్లు అర్జున్ లతో నటిస్తున్నప్పుడు వారు సింగిల్ టేక్ లో యాక్ట్ చేస్తే నేను వన్ మోర్ అనే దాన్ని .అలవైకుంఠపురం ద్వారా నాకు చాలా మంచి పేరు వచ్చింది.బ్యాచిలర్ లో విభ క్యారెక్టర్ లో స్టాండప్ కమెడియన్ గా ,, ఆచార్య సినిమాలో  ట్రెడిసినల్ ఆఫ్ శారీ లో డీఫ్రెంట్ రోల్ చేస్తున్నాను.

ప్రభాస్ కూడా సెట్ లో చాలా జోవియల్ గా అందరినీ నవ్విస్తూ ఎంకరేజ్ చేసే వారు.ఇలా టాలీవుడ్ లో అందరితో వర్క్ చేయడంతో నాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను.ఇలా అతి తక్కువ సమయంలోనే డిఫ్రెంట్ క్యారెక్టర్స్ లలో హృతిక్ రోషన్, చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు,అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ఇలా టాలీవుడ్ లోని అందరి హీరోలతో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషముగా ఉంది.

— బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న నన్ను పాన్ ఇండియా యాక్ట్రెస్ అంటున్నారు.కానీ ఇవేవీ నాకు ఇష్టం ఉండదు.భాషతో సంబంధం లేకుండా నటనలో మంచి గుర్తింపు నిచ్చే మంచి కంటెంట్ ఉన్న  సినిమాలలో నటించి బెస్ట్ యాక్టర్ అనిపించుకోవాలనేదే నా కోరిక.

– నేనే నెంబర్ వన్ హీరోయిన్ అనుకోవడం లేదు. నెంబర్ వన్ అనేది ట్రెండ్ , నేను ట్రెండ్ లో ఉండను. క్లాసిక్ గా ఉండాలను కుంటున్నాను. నా తల్లిదండ్రులు నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా అమ్మ  భరత నాట్యం నేర్పించారు.అందుకే నాకు సినిమాలలో డ్యాన్స్ లకు అది బాగా ఉపయోగపడింది.

అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు.నా లైఫ్ లో టైం లేదు..ఎందుకంటే  సంవత్సరానికి 5,6 సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా వున్నాను. అందుకే నాకు.పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు.

– ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో వరుసగా డీఫ్రెంట్ ప్రాజెక్ట్స్,డీఫ్రెంట్ రోల్స్ లలో చేస్తున్నాను. నేనుంటే బాగుంటుంది అనుకోబట్టే హీరోలు, నిర్మాతలు, దర్శకులు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు అని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here