Participate in “Game On” contest and win one lakh rupees..Film Producer Ravi Kasturi

గీత్ ఆనంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లిరికర్ “రిచో రిచ్”పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ పాట 3 మిలియన్స్ తో వ్యూస్ తో దూసుకుపోతున్న సందర్బంగా చిత్ర బృందం ఒక కాంటెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ లో రీల్స్ చేసి విజయం సాధించిన వారిని సెలెక్ట్ చేసి ఒక్కక్కరికి 25 వేల చొప్పున లక్ష రూపాయల ప్రైజ్ మనీని ఇస్తామని అనౌన్స్ చేసింది చిత్ర బృందం.ఈ సందర్బంగా…

నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ.. మా ‘గేమ్ ఆన్’ చిత్రం నుండి మేము రీసెంట్ గా మొదటి సారి హైదరాబాద్ ఫేమస్ నవాబ్ గ్యాంగ్ బ్యాండ్ ద్వారా విడుదల చేసిన రిచో రిచ్ సాంగ్ కు 3 మిలియన్స్ వ్యూస్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు తెలుపుతూ వారందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో వారు మాకిచ్చిన గిఫ్ట్ ను తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మేము ఒక కాంటెస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొని బెస్ట్ రీల్స్ చేసిన నలుగురిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 25,000 చొప్పున లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.అందరూ పాల్గొని మా ప్రైజ్ మనీని గెలుచు కోవాలని కోరుకుంటున్నాము. ఈ చిత్రం నుండి మేము విడుదల చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ చూసి చాలా మంది ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి ఏప్రిసియేట్ చేస్తున్నారు. దాంతో మా సినిమాపై మాకు చాలా మంచి నమ్మకం వచ్చింది.అందరూ ఎంతో కష్టపడి, కలసి టీం వర్క్ చేశారు. అర‌వింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువ‌ల్స్ ఇచ్చాడు. ప్ర‌తి ఫ్రేమ్ మిమ్మ‌ల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. ఇన్‌టెన్స్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ఇది. హీరో ఒక లూజ‌ర్ గా తన లైఫ్ లో మిగిలి పోతున్న టైమ్‌లో త‌న లైఫ్‌లో ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. త‌న‌ని ఆ గేమ్ ఏ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌ నేదే ఈ క‌థ‌. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ త‌ప్ప‌కుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ప్రతీ ఒక్కరూ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ ద‌యానంద్ మాట్లాడుతూ.. మేము విడుదల చేసిన రిచో రిచ్ సాంగ్ కు 3 మిలియన్స్ వ్యూస్ రావడం చాలా సంతోషంగా ఉంది.వారికే తిరిగి ఇవ్వాలని మేము తలపెట్టిన కాంటెస్ట్ లో పాల్గొని లక్ష రూపాలు బహుమానం పొందాలని కోరుతున్నాను. గేమ్ ఆన్ విషయానికి వస్తే ‘ఇది రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు రావడమే కాదు.. స‌క్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవ‌లోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నాను. చాలా ట్విస్టులు, ట‌ర్న్స్ ఉన్న మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ఈ సినిమాలో యాక్ష‌న్‌, రొమాన్స్. ఎమోష‌న్స్..తో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ తో త్వరలో వస్తున్న మా సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.

న‌టీన‌టులు:

గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, వాసంతి, కిరిటీ, శుభ‌లేక సుధాక‌ర్‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌: క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్‌, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌: ర‌వి క‌స్తూరి
ద‌ర్శ‌క‌త్వం: ద‌యానంద్‌
మ్యూజిక్‌: న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ – అరుణ్‌
సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌
డైలాగ్స్‌: విజ‌య్ కుమార్ సి.హెచ్‌
ఒరిజిన‌ల్ బ్యాగ్రౌండ్ స్కోర్‌: అభిషేక్ ఎ.ఆర్‌
ఎడిట‌ర్ : వంశీ అట్లూరి
ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌: దిలీప్ జాన్‌, రాజ్ క‌మ‌ల్‌
స్టంట్స్‌: రామ‌కృష్ణ‌న్‌, న‌భా స్టంట్స్‌
కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌
పి.ఆర్‌.ఒ: మధు వి. ఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here