‘PEKAMEDALU’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
సినిమా : “పీక మేడలు”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 19.07.2024
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
నటీనటులు : వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వస్తున్న సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 19న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “పేక మేడలు” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ..

పేకమేడలు మహిళా సాధికారత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం.  హైదరాబాద్‌లోని ఒక మురికివాడలో తమ బిడ్డతో జీవితాన్ని గడిపే ఒక జంటకు కొన్ని అసాధారణమైన లక్ష్యాలు ఉంటాయి. తన భార్య ఇంట్లో కొన్ని ఆహారపదార్థాలు తయారు చేసి వాటిని షాప్స్ కు    విక్రయించి డబ్బు సంపాదిస్తుంది. ఇలా వచ్చే డబ్బు ద్వారా  కుటుంబాన్ని నడుపుతుంటుంది.  ఆమె భర్త మాత్రం  బాగా చదువుకున్నా మద్యం, పేకాట కు అలవాటు పడడంతో సులభంగా డబ్బు కావాలని డబ్బు  సంపాదించడానికి పార్ట్‌టైమ్ గా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తాడు, కానీ అక్కడ వచ్చే డబ్బు సరిపోక  ఇంట్లో తన భార్య దాచుకున్న డబ్బును కూడా తీసుకొని పోతాడు. ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరుగుతుంది. నువ్వు బాగా చదువుకున్నావు మంచి ఉద్యోగం చూసుకో.. నేను చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తా అప్పుడు ఈ  మురికివాడ నుండి బయటికి వెళ్లి హ్యాపీ గా బతుగుదాం అంటుంది అందుకు  ఆమె భర్త ఒప్పుకోక పోవడమే కాకుండా.. చెడు తిరుగుళ్లకు అలవాటుపడి ఆమె పై చేయి చేసుకుంటాడు. ఇలా సాగుతున్న వీరి సంసారం నుండి ఇంకా ఆమె భర్త నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది.చివరికి మురికివాడ నుండి బయటకు వచ్చి వ్యాపారం చేయాలనుకున్న ఆమె కలను నెరవేర్చుకుందా? లేదా అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే 

నటీ, నటుల పనితీరు

నటన పరంగా వినోద్ కిషన్ మరియు అనూష కృష్ణ ఇద్దరూ పోటీ పడి నటించారు. , వారి కాంబినేషన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి, ముఖ్యంగా సెకండాఫ్‌లో వారి నటన వాస్తవికానికి దగ్గరగా ఉంది. రితికా శ్రీనివాస్ తన పాత్రకు న్యాయం చేసింది. జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ మరియు ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు నీలగిరి మామిళ్ల మధ్యతరగతి భావోద్వేగాలను అన్ని వాస్తవిక అంశాలతో అందంగా చిత్రీకరించినందుకు మనం అభినందించాలి, అతను ప్రేక్షకులను కట్టిపడేసేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడు. డైలాగ్స్ బాగున్నాయి. స్మరణ్ సాయి సంగీతం పర్ఫెక్ట్. సృజన అడుసుమిల్లి, హమ్జా అలీ ఎడిటింగ్ పనితీరు బాగుంది .హరిచరణ్ కెమెరా పనితీరు బాగుంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్‌లో రాకేష్ వర్రే ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి పేకమేడలు లాంటి అందమైన రియలిస్టిక్ సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా సినిమాకి కనెక్ట్ అవుతారని కచ్చితంగా చెప్పచ్చు..

Cinemarangam.Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here