Potti Veeraiah was a hero who defeated his disability: Rajasekhar, Jeevitha

In the demise of Potti Veeraiah, the Telugu film industry has lost a rare artist. Gattu Veeraiah, whom the audience know as Potti Veeraiah, died on Sunday after a heart attack. In Telugu, Tamil, Kannada and Malayalam, he acted in more than 500 films. Prominent actor Rajasekhar and Jeevitha Rajasekhar have paid a rich tribute to the departed soul. The couple went to meet the bereaved family of the comedian at Chitrapuri Colony in Hyderabad to extend their profoundest sympathies. On the occasion, they talked about their association with Veeraiah.

Speaking on the occasion, the duo said, “Hardly anybody is not aware of Veeraiah garu. He acted alongside all top actors. He acted in our movies, too. We knew him for a long time. He was a hero who defeated his disability, and carved a unique image for himself as an artist. He used to be a constant presence at Movie Artists Association’s General Body meetings and award functions. Veeraiah garu was a jovial person who used to make others happy. His journey in the film industry corresponded with ours. He was always accessible. His demise is saddening. We promise that we will be there for his family whenever needed.”

వైకల్యాన్ని జయించిన వీరుడు పొట్టి వీరయ్య – రాజశేఖర్, జీవిత దంపతులు
తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అరుదైన నటుడిని కోల్పోయింది. పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు తెలిసిన గట్టు వీరయ్య ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు పైగా సినిమాల్లో నటించిన వీరయ్యకు ప్రముఖ కథానాయకుడు రాజశేఖర్, జీవిత దంపతులు నివాళులు అర్పించారు. చిత్రపురి కాలనీకి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. వీరయ్యతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
రాజశేఖర్, జీవిత దంపతులు మాట్లాడుతూ “వీరయ్యగారు తెలియని వాళ్ళు లేరు. అగ్ర హీరోలు అందరితోనూ నటించారు. మాతోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. మాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన వైకల్యాన్ని జయించిన వీరుడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జనరల్ బాడీ మీటింగ్స్ కానివ్వండి, అవార్డు ఫంక్షన్స్ కానివ్వండి…ఏ కార్యక్రమానికి పిలిచినా సరే తప్పకుండా హాజరు అయ్యేవారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. మేం పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పరిశ్రమలో ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. ఆయన మరణం బాధ కలిగించింది. ఆ కుటుంబానికి మాకు వీలైనంత సహాయం చేయాలని అనుకుంటున్నాం”  అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here