‘Prabhuthva Junior Kalashala Punganur-500143’ Pre Release event held grandly..Movie Releasing on June 21st

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్ నుంచి యూ.ఏ సర్టిఫికేట్ అందుకున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ – ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఆ రోజు మా జీవితాల్లో ఒక బిగ్ డే అనుకోవాలి. ఎన్నో ఇబ్బందులు దాటి మా సినిమాను రిలీజ్ వరకు తీసుకురావడమే పెద్ద విజయంగా భావిస్తున్నాం. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. యువత, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ట్రైలర్ లో మీరు సినిమా క్వాలిటీ ఎంత బాగుందో చూశారు. మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా తెరకెక్కించాం. ఈ సినిమా రిహార్సల్స్, వర్క్ షాప్స్ కు కొన్ని నెలల టైమ్ కేటాయించాం. ఆర్టిస్టులను మా ఊరు పుంగనూరు తీసుకెళ్లి రాయలసీమ యాస నేర్పించాం. డబ్బింగ్ కోసమే 8 నెలల టైమ్ వెచ్చించాం. దీన్ని బట్టి మేము మూవీ క్వాలిటీ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో అర్థం చేసుకోండి. సినిమా మీద ప్యాషన్ తో ఇదంతా చేశాం. మనం ఉన్నా లేకున్నా సినిమా మాత్రం ఎప్పటికీ నిలిచిఉంటుంది. ఆ సినిమా బాగుండాలి. నేను పుట్టి పెరిగింది చదివింది పుంగనూరులో. మా ఊరు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి మా ఊరి పేరును టైటిల్ లో పెట్టి మా ఊరిలోనే సినిమా చిత్రీకరించాం. అలా మా ఊరుకు నా వంతుగా ఒక గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉంది. నేను ఒక పెద్ద ప్రొడక్షన్ లో సినిమా చేయాలి. కానీ అది కుదరలేదు. అప్పుడు సొంతంగా నేనే సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా దగ్గర కెమెరా రెంట్ తీసుకునేందుకు కూడా డబ్బులు లేవు. అలాంటి టైమ్ లో దేవుడి ఫొటో దగ్గర 5డీ కెమెరా పెట్టి మా అమ్మను పిలిచి పూజ చేయమని చెప్పా. డబ్బులు లేవు కదా అని అమ్మ అనలేదు. నువ్వు సినిమా చేయగలవు అని ధైర్యం చెప్పి పూజ జరిపింది. నన్ను నమ్మిన మా పేరెంట్స్ కు ముందుగా థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే ఈ ప్రయాణంలో నన్ను నిస్వార్థంగా నమ్మి హెల్ప్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి, ఇతర మిత్రులకు థ్యాంక్స్. డబ్బు కోసం ఈ సినిమా చేయలేదు. డబ్బు కావాలంటే ఎన్నో పనులు ఉన్నాయి. కానీ నాకు సినిమా అంటే ఇష్టం. కానీ చాలా మందికి సినిమా అంటే వ్యాపారం. అలాంటి వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇవన్నీ దాటుకుని ఈ నెల 21న గ్రాండ్ గా మా మూవీ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఆర్టిస్టుల పరంగా మాది చిన్న సినిమానే కానీ క్వాలిటీ పరంగా కాదు. విజయ్ యేసుదాస్, చిన్మయి లాంటి వాళ్లతో పాటలు పాడించాం. మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా చూశాక మీరు మీ పేరెంట్స్ ను గుర్తు తెచ్చుకుంటారు. అన్నారు.

నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ – నాకు సినిమా ఇండస్ట్రీ వాళ్లతో ఎలాంటి పరిచయాలు లేవు. శ్రీనాథ్ గారికి ఒక సందర్భంలో కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలతో సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ అర్థమైంది. అలా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమాకు ప్రొడ్యూసర్ గా మారాను. సినిమా మేకింగ్ టైమ్ లో మా డైరెక్టర్ కు సినిమా మీదున్న ఇష్టం, సినిమా పట్ల ఉన్న కమిట్ మెంట్ మరింతగా తెలిసింది. ఆయన మాలాంటి చిన్న ప్రొడ్యూసర్ దగ్గర సినిమా చేయాల్సిన దర్శకుడు కాదు. చాలా పెద్ద సినిమాలు చేయాల్సినంత ప్రతిభ, కమిట్ మెంట్, ప్యాషన్ శ్రీనాథ్ పులకురంలో ఉన్నాయి. ఆయన త్వరలో పెద్ద సినిమాలు రూపొందిస్తాడనే నమ్మకం ఉంది. మేము ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్ లో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించాడు. ఈ సినిమా నిర్మాణంలో నాకు సపోర్ట్ చేసి ఆర్థికంగా సహాయం చేసిన మిత్రులకు, మా కుటుంబ సభ్యులకు థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమా చూసి మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ షాజ్ఞ మాట్లాడుతూ – ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′సినిమాతో హీరోయిన్ గా మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ శ్రీనాథ్ గారు నాతో మంచి పర్ ఫార్మెన్స్ చేయించారు. ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించాం. ఒక ఫ్యామిలీలా టీమ్ వర్క్ చేశాం. ప్రణవ్ మంచి కోస్టార్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమా ఇది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి మంచి మూవీని సపోర్ట్ చేయండని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

హీరో ప్రణవ్ ప్రీతం మాట్లాడుతూ – ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′సినిమా మా అందరి లైఫ్ లో ఎంతో స్పెషల్. ఈ సినిమాకు వర్క్ చేసిన ఎక్సీపిరియన్స్ మర్చిపోలేం. సిటీలో పెరిగే మాకు పుంగనూరు లాంటి అందమైన ఊరిలో షూటింగ్ చేయడం ఎంతో ప్లెజెంట్ గా ఉండేది. నాకు హీరో కావాలనే డ్రీమ్ లేదు. కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. డైరెక్టర్ శ్రీనాథ్ గారు మా అందరికీ లైఫ్ ఇచ్చారని చెప్పాలి. మా సినిమాలో హీరోయిన్ షాజ్ఞ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆమెకు మంచి పేరొస్తుంది. హీరోగా నాకూ మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′సినిమా ఈ నెల 21న థియేటర్స్ లో తప్పకచూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక వర్గం
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
పీఆర్ఓ – సురేష్ కొండేటి
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here