Prathi Roju Pandage Review

Release date : December 20, 2019
Cinemarangam.com… Rating : 3/5
Movie name:-”Prathi Roju Pandage”
Presented:-Allu aravind
Banners:-u.v.Creations & G.A.2 pictures
Starring : Sai Dharam Tej, Raashi Khanna, Sathyaraj, Vijayakumar , Rao Ramesh, Hari Teja,mahesh
Editor : Kotagiri Venkateswara Rao
Cinematography : Jaya Kumar
Music Director : S. Thaman
Director : Maruthi
Producers : Allu Aravind, Bunny Vasu

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు.కెరీర్ ఆరంభంలో బాగానే నిలబడినా తర్వాత సరైన హిట్టు చిత్రాలు పడడం లేదు.అలాగే రీసెంట్ గా వచ్చిన “చిత్రలహరి”తో పర్వాలేదనిపించినా అంత పెద్ద హిట్ అయితే కాలేదు.అయితే మారుతీ దర్శకత్వంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ ఈరోజే విడుదల అయ్యింది.మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇపుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
ఇక కథలోకి వెళ్లినట్టయితే  రఘురామయ్య(సత్యరాజ్)పిల్లలు, మనువరాళ్ళు ఆస్ట్రేలియాలో,అమెరికాలో వారందరు జాబ్స్ లో బిజీగా నివసిస్తుంటారు.రావురమేష్ తండ్రి(సాయి ధరంతేజ్ తాత)సత్యరాజ్ క్యాన్సర్ తో బాధపడతారు అయితే తన ఆఖరి రోజుల్లో గడిపే కొన్ని క్షణాలు అయినా సంతోషంగా ఉంచాలని యూఎస్ నుంచి సాయి తేజ్ఇండియాలో రాజమండ్రిలోని తన ఊరికి బలదేరుతాడు.అక్కడ నుంచే తన కుటుంబాన్ని ఒకే చోటుకు చేర్చాలని ప్లాన్ చేస్తాడు.అయితే ఈ నేపథ్యంలో సాయి తేజ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు?నిజంగానే సత్యరాజ్ కు ఏమన్నా అయ్యిందా లేక ప్లానా?ఈ పరిస్థితులను సాయి తేజ్ ఎలా హ్యాండిల్ చేసాడు?ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :
ఈ చిత్రం విషయంలో మొదటగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఇప్పటికే చూసేసిన సినిమాలాగే ఉందా లేక మారుతి ఏమన్నా కొత్తగా తెరకెక్కించారా అన్నది.అయితే దీని కోసం మాట్లాడే ముందు మిగతా సినిమా ఎలా ఉందో చూద్దాం.ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి దర్శకుడు మారుతి ఎప్పటి లానే ఎంటర్టైన్మెంట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది.ఆ కామెడీ ట్రాక్స్ నవ్వించేలా బాగానే ఉంటాయి.చూసినప్పుడు కొన్ని ట్రాక్స్ అయితే మంచి హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి.కానీ వాటి మోతాదే కాస్త ఎక్కువ కావడం వల్ల సినిమా కాస్త పక్క దారి పడుతుందా అని అనిపిస్తుంది.ఈ విషయంలో మారుతి కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.అయితే మనం మొదట్లో మాట్లాడుకున్న అంశాన్నే పక్కకు తప్పించేందుకు మారుతి ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు.ఇలా పర్వాలేదనిపించే నరేషన్ తో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యిపోయింది కానీ ఇంకా ఏదో అసంతృప్తి అయితే ప్రేక్షకుడిలో మిగలొచ్చు.అలాగే ఇదే తరహా నరేషన్ తో కామెడీ ట్రాక్స్ తో ఎమోషన్స్ కు తావివ్వకుండా సెకండాఫ్ కూడా మారుతి నింపేశారు.దీనితో ఇవే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది.అయితే లాస్ట్ కి వచ్చే సరికి మాత్రం ఎప్పటిలానే అన్ని సినిమాల్లోలా తాను చెప్పాలనుకున్న పాయింట్ ను రివీల్ చేసి ఒకే అనిపిస్తారు.
ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే సాయి ధరమ్ తేజ్ ఎనర్జిటిక్ యాక్టింగ్  మరియు ఎంజెల్ అర్ణ పాత్ర‌లో రాశీ ఖన్నాల ఫైర్ మరోసారి చక్కగా కుదిరింది.సుప్రీం తర్వాత వీరిద్దరి మధ్య మిస్సయిన కామెడీ ట్రాక్స్ కానీ టైమింగ్ కానీ ఈ చిత్రం ద్వారా మనం చూడొచ్చు.అలాగే క్లైమాక్స్ లోని ఎమోషనల్ సీన్ సహా ఇతర కీలకమైన ఎమోషన్స్ ను పండించడంలో సాయి తేజ్ ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా ప్రీ క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ ఫైట్ సీన్ తో అయితే అదరగొట్టేసాడు.ఇంక అలాగే మరో కీలక పాత్రలో కనిపించిన సత్య రాజ్ మంచి ఎనర్జిటిక్ గా మాత్రమే కాకుండా ఎమోషనల్ గా అద్భుతమైన నటన కనబర్చారు.
ఇక అలాగే రావు రమేష్ లోని ఎమోషన్స్ కంటే కామెడీ సెన్స్ ను ఈ చిత్రం ద్వారా మనం చూడొచ్చు.ఇంకా మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పిస్తారు.ఇక ఇతర టెక్నిషన్స్ విషయానికి వస్తే సంగీతం అందించిన థమన్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ మరియు సాంగ్స్ అందించారు.విజువల్ పరంగా సాంగ్స్ మరింత ఆకట్టుకుంటాయి.వీటిలో జయకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మారుతి మరియు సాయి ధరమ్ తేజ్ ల కాంబో వచ్చిన “ప్రతిరోజూ పండగే” ఎక్కువ కామెడీ పైనే దృష్టి పెట్టారు. కామెడీ ఎమోషనల్ ఎంటర్ టైనర్, యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు.

cinema Rangam..Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here