Psychological Action Dark Thriller ‘Mangalavaaram’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “మంగళవారం”
విడుదల తేదీ : నవంబర్ 17, 2023
రివ్యూ రేటింగ్ : 3.25 /5
బ్యానర్ : ఏ’ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్
నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం,
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : అజయ్ భూపతి.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి,
మ్యూజిక్ : ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్,
సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర,
నటీ నటులు : పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్, శ్రవణ్ రెడ్డి తదితరులు
ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి,
మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్,
ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి,
ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి, 
ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, పృథ్వీ,
సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : ‘నేషనల్ అవార్డ్ విన్నర్’ రాజా కృష్ణన్,
కొరియోగ్రఫీ : భాను,
కాస్ట్యూమ్ డిజైనర్ : ముదాసర్ మొహ్మద్,
పి.ఆర్.ఓ : పులగం చిన్నారాయణ


ఆర్ఎక్స్ 100′ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్. తెలుగుకు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా ‘మంగళవారం’. ఆమెకు జోడీగా ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన తారాగణంగా నటించారు. అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నవంబర్ 17న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.. 


కథ
ఈ కథ 1980,90 నేపద్యంలో జరిగే కథ. మా లక్ష్మీపురం అనే గ్రామంలో అక్రమ సంబంధాలు పెట్టుకొన్న జంటలు ప్రతీ ‘మంగళవారం’ మరణిస్తుండడంతో ఆ ఊరి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతుంటారు. ఆ ఊళ్లో ఉన్న అమ్మవారు(మాలచ్చమ్మ) జాతర జరిపించకపోవడం వల్లే ఇలా జరుగుతోందని గ్రామస్థులు భావిస్తుంటారు. అదే సమయంలో మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి ఎస్.ఐ గా (నందిత శ్వేత) వస్తుంది. మరో వైపు శైలు (పాయల్ రాజ్‌పుత్) దెయ్యంగా మారి అందర్నీ చంపేస్తుందనే మూఢ నమ్మకంతో ఉంటారు ఆ ఊరి గ్రామ ప్రజలు.ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వచ్చిన ఎస్ఐ మరణాల వెనుక ఏదో మిస్టరీ ఉందనే అనుమానంతో ఆ ఊర్లో ఉన్న వాసు (శ్రవణ్ రెడ్డి), కసిరాజు(అజయ్ ఘోష్ ) గురజ (శ్రీ తేజ్ ),ఆర్.ఎంపీ విశ్వనాథం(రవీంద్ర విజయ్) లాంటి కొంతమంది వ్యక్తుల పై అనుమానంతో దర్యాప్తు చేపడుతుంది. అయితే మంగళవారం రోజే ఆ గ్రామంలో జరిగుతున్న మరణాల వెనుక అసలు కారణాలు ఏమిటి? ఈ హత్యలన్నింటికీ శైలు (పాయల్ రాజ్‌పుత్) కారణం అంటూ జమీందార్ (చైతన్య) ఆదేశాలతో గ్రామస్థులు ఆమెను ఎందుకు శిక్షించాలని అనుకొంటారు? ఈ విషయంలో శైలుకు ఎవరు అండగా నిలుస్తారు? చివరకు గ్రామంలో జరిగేవి హత్యలా? ఆత్మహత్యలా? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి ‘మంగళవారం‘ సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
పక్కా పల్లెటూరి అమ్మాయిగా శైలు పాత్రలో నటించిన (పాయల్ రాజ్‌పుత్) నటనాపరంగా విజృంభించింది. ఎవరూ ధైర్యం చేయని పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఫెర్ఫార్మ్ చేసిన విధానం సూపర్బ్ అనిపించేలా చేసింది. ఇక రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, లక్ష్మణ్, శ్రవణ్ రెడ్డి, దయానంద్ రెడ్డి, నందిత శ్వేత, చైతన్య కృష్ణ, నందిత శ్వేత(పోలీస్ ఆఫీసర్), దివ్య పిళ్లై, అజ్మల్ అమర్ పాత్రలు అన్నీ బలమైన పాత్రలే కావడంతో వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు రాణించారు. అజయ్ ఘోష్, లక్ష్మణ్ కాంబినేషన్‌‌లో వచ్చే సీన్లు మంచి కామెడీని పండించాయి. దివ్య పిళ్లై సినిమాను సమూలంగా మార్చే పాత్రలో అద్బుతంగా రాణించారు. ఇందులో నటించిన వారందరూ అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
“మంగళవారం” టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు ‘ఆర్ఎక్స్ 100’ తరహాలో మరోసారి డిఫరెంట్ కంటెంట్ అండ్ కమర్షియల్ బేస్డ్ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనే నమ్మకం ప్రేక్షకులలో  కలగడమే కాకుండా..ఈ సినిమాపై బాగా బజ్ క్రియేట్ అయ్యింది. ప్రేక్షకులు అనుకున్నట్లే డైరెక్టర్ బ్రిల్లియంట్ మేకింగ్ తో ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మీద ఎవరు చూడనటువంటి కొత్త డార్క్ థ్రిల్లర్, విలేజ్ బ్యాక్ డ్రాప్ రా రస్టిక్ … స్టోరీ ని సెలెక్ట్ చేసుకుని ఇందులో మ్యూజిక్, ఎమోషన్స్, మెసేజ్…తో పాటు ప్రేక్షకులకు అనుక్షణం కొత్త అనుభూతిని కిలిగిస్తూ.. థ్రిల్లింగ్‌గా అనిపించే ట్విస్టులతో తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతిని కచ్చితంగా మరోసారి మొచ్చుకొవాలి.అలాగే నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు.

అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ప్రతీ ఫ్రేమ్‌ను హైలెట్ చేసేలా, ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇచ్చేలా మ్యూజిక్ అందించారు.‘గణగణ మోగాలిరా’ ‘పాట ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. . ‘రంగస్థలం’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకున్న సౌండ్  డిజైనర్ ఎంఆర్ రాధాకృష్ణ గారు నెక్స్ట్ లెవల్ లో చేశారు.  దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫి మరో హైలెట్. ప్రతీ ఫ్రేమ్‌ను విజువల్ ట్రీట్‌గా మార్చారు. తల్లూరి కృష్ణ ఆర్ట్ విభాగం పనితీరు, గుల్లపల్లి మాధవ్ కుమార్ ఎడిటింగ్ పనితీరు బాగుంది..

అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ లు సంయుక్తంగా కలసి ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించారు. చివరి 45 నిమిషాల్లో వచ్చే ప్రతీ ట్విస్టు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది.కొత్త కంటెంట్, డార్క్ థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడే వారికి మాత్రం “మంగళవారం” సినిమా తప్పకుండా నచ్చుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

Cinemarangam.Com Review Rating 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here