‘Pushpa’ Movie art Directers Ramakrishna,Mounika interview

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ` క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. మొదటి భాగం ‘పుష్ప’ (ది రైజ్‌) క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా ప్రొడక్షన్‌ హౌస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సౌతిండియాలో టాక్‌ఆఫ్‌ సిల్వర్‌ స్క్రీన్స్‌లో ‘పుష్ప’ మూవీ కూడా ఒకటి. తమ క్రియేటివ్‌ వర్క్‌తో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న ఆర్ట్‌ డైరెక్టర్‌ దంపతులు రామకృష్ణ`మౌనికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈచిత్రానికి అద్భుతమైన సెట్స్‌ వేశారు. ‘పుష్ప’ వంటి నేచురల్‌ బేస్డ్‌ సినిమాలకు పనిచేయడం అంటే ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు కత్తిమీద సాముకన్నా పెద్ద పదాలనే వాడాలి. అయినా అవలీలగా.. అద్భుతంగా ‘పుష్ప’కు హంగులు అద్దారు ఈ దంపతులు. శుక్రవారం ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు రామకృష్ణ`మౌనిక.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..‘ ‘సుకుమార్‌ గారి ‘రంగస్థలం’ మాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆయన సినిమాల్లో టెక్నీషియన్స్‌ చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఆయనతో ఒక్కసారి కనెక్ట్‌ అయితే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేం. మనం చేసిన వర్క్‌ను స్క్రీన్‌మీద సూపర్బ్‌గా ప్రెజెంట్‌ చేయగలిగే సూపర్‌ డైరెక్టర్‌ సుక్కుసార్‌. ‘పుష్ప’ వంటి నేచురల్‌ బేస్డ్‌ స్క్రిప్ట్‌లు తెరకెక్కించడంలో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ది చాలా కీలకమైన పాత్ర. ఈసినిమాలో ఏది సెట్టు.. ఏది కాదు అని ప్రేక్షకులు కనిపెట్టడం కష్టం. తూర్పుగోదావరి మారేడ్‌మిల్లితో పాటు చిత్తూరులోని దట్టమైన అడవుల్లో షూట్‌ చేశాం. ఎర్ర చందనం చెట్లు లేకపోతే ఈ సినిమానే లేదు. ఆందుకే వేలాది ఎర్రచందనం చెట్లకు కృత్రిమంగా ప్రాణ ప్రతిష్ఠ చేశాం. ఒక ఫ్యాక్టరీలా ఎర్రచందనం చెట్లను తయారు చేశాం. అలాగే గొడ్డలి కూడా కీలకం. అల్లు అర్జున్‌ గారు ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి ప్రీ రిలీజ్‌లో మాట్లాడటమే మా కష్టానికి గుర్తింపుగా భావిస్తాం. ప్రతిరోజూ ఆయన సెట్‌ను చూడటానికే కాసేపు కేటాయించేవారు. దాని వల్ల ఆయన ఆ సీన్‌ మూడ్‌లోకి వెళ్లిపోయేవారట. 1998 నుంచి 2004 మధ్య కథ. ఈ రెండు సంవత్సరాల పాటు చాలా వెదర్‌ కండీషన్స్‌లో చేశాం. వాటిని మ్యాచ్‌ చేయడానికి హైదరాబాద్‌లో సేమ్‌ సెట్స్‌ వేశాం. మేం సెట్స్‌ వేసుకుంటూ పోతుంటే… వెనకాల వాళ్లు షూటింగ్‌ చేసుకుంటూ వచ్చారు. ఒక సినిమా ఒప్పుకునే ముందు ఆ స్క్రిప్ట్‌ ఏ బ్యాక్‌డ్రాప్‌లో ఉంది, ఏ పిరియడ్‌లో ఉంది, ఏమూడ్‌లో ఉంది, యాక్షన్‌ ఎంతుంది, రొమాన్స్‌ ఎంతుంది, ఎంత ‘రా’ సబ్జెక్ట్‌ ఉంది అనేది చూస్తాం. సినిమా రాసుకున్నప్పుడే సుకుమార్‌గారు కొన్ని సీన్స్‌కు కలర్స్‌ కూడా రాసుకుంటారు. అది మాకు పని ఈజీ చేస్తుంది.

ఇలాంటి సినిమాలు చేయాలంటే ఫ్యాషన్‌, ఛాలెంజ్‌, డేర్‌ ఉండాలి. ఇలాంటిసినిమాలు చేయడం అంత ఈజీ కాదు. మైత్రి మూవీస్‌ వారు తప్ప ఇది ఎవ్వరూ చేయలేదు. వారికి ఇది బిజినెస్‌కన్నా ప్యాషనబుల్‌ జర్నీ. మైత్రిలో మాకు 4వ సినిమా. ఎప్పుడూ ఏ ఇబ్బందీ కలగలేదు. మైత్రి సంస్థ మన ఇండస్ట్రీకి దొరికిన వరం లాంటిది. దేవుడు క్రియేట్‌చేసిన దాన్ని మళ్లీ మనం క్రియేట్‌ చేయడం చాలా కష్టం. ఈ చిత్రంలో 60 పర్సంట్‌ అడివి ఉంటుంది. గత 2 నెలల్లో 29 సెట్స్‌ వేశాం. ఒకేసారి పుష్ప, రామ్‌చరణ్‌ 15 మూవీ , తలైవి ఇలా ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌లు చేయగలిగాం అంటే, వేటికవే డిఫరెంట్‌ మూవీస్‌. పైగా ముగ్గురు దర్శకులకీ వాళ్లకేం కావాలి అనే దానిమీద క్లియర్‌కట్‌గా ఓ క్లారిటీ ఉంది. దాంతో మేము టెన్షన్‌ ఫ్రీగా పనిచేయగలిగాం. సెకండ్‌ పార్ట్‌ 80 పర్సంట్‌ సెట్స్‌లో ఉంటుంది. అదికూడా 2 షెడ్యూల్స్‌ అయిపోయాయి. మేం ట్రైన్డ్‌ డిజైన్స్‌ కావడం వల్ల స్ట్రెస్‌ తెలియదు. మేం ఇద్దరం మా ఐడియాస్‌ను షేర్‌ చేసుకుని ఫైనల్‌ ఔట్‌పుట్‌ను దర్శకుడి ముందు ఉంచుతాం. ఈసినిమా అంతా ఎక్స్‌టీరియర్‌లో ఉంటుంది. సినిమాలో కొంత భాగం ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ చూడటం వేరు.. దాదాపు సినిమాలో మేజర్‌ పార్ట్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ చూపిస్తూ ప్రేక్షకులను సీట్లలో కూర్చో పెట్టాలంటే ప్రతి సీన్‌లోనూ అడివిని కొత్త కొత్త వేరియేషన్స్‌లో చూపించాలో ఆలోచించండి. ‘పుష్ప’ భారతీయ ప్రేక్షకులకు ఓ విజువల్‌ ఫీస్ట్‌. ఇటువంటి సినిమా చేయాలంటే మైత్రి మూవీస్‌ వంటి బ్యానర్‌కు, అల్లు అర్జున్‌ వంటి మాస్‌ స్టార్‌కు, సుకుమార్‌ వంటి క్రియేటివ్‌ జీనియస్‌కు మాత్రమే సాధ్యం’’ అంటూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here