Rajamouli, Jr Ntr, Ram charan’s ‘RRR’ Movie World Wide Grand Releasing on Mach 25

భార‌తదేశ స్వాతంత్య్ర స‌మ‌ర యోధులు కొమురం భీమ్‌, అల్లూరి సీతా రామరాజు జీవితాల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘‘ఆర్ ఆర్ ఆర్‌” (ర‌ణం రౌద్రం రుధిరం)’.హైదరాబాద్ తో పాటు  ప్రపంచంలోని ప‌లు ప్ర‌దేశాల్లో భారీ సెట్స్ వేసి చిత్రీక‌రించిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మ‌రో కాలానికి తీసుకెళుతుంది. జాతీయ స్థాయిలో అతి పెద్ద మ‌ల్టీస్టార‌ర్ మూవీగా యంగ్‌ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, బాలీవుడ్ స్ఠార్స్ అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రేస్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి లు న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రూ.450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈ నెల 25 న విడుదల అవుతున్న  సందర్భంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లోని ఐ.టి.సి కోహినూర్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ,ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి లు విలేకరులతో మాట్లాడుతూ..

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ..  ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా ప్రారంభించిన సమయంలో ఎలాంటి టైటిల్‌ని అనుకోలేదు. మా ముగ్గురిని (రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌) దృష్టిలో ఉంచుకొని ఆర్‌.ఆర్‌.ఆర్‌ అని వర్కింగ్‌ టైటిల్‌ పెట్టాం. ఫ్యాన్స్‌కి అది బాగా నచ్చింది. అందుకే ఆ పేరునే ఫైనల్‌ చేశాం..తారక్‌, చరణ్‌లను ఈ సినిమా కోసం ఎంచుకోవడానికి మొదటి కారణం వాళ్లకి ఉన్న స్టార్‌డమ్‌. అలాగే వారి వ్యక్తిత్వం, టాలెంట్‌ కూడా. నేను రాసుకున్న కథలో కొమురంభీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలకు వాళ్లు మాత్రమే న్యాయం చేయగలరని భావించా. అందుకే వాళ్లను తీసుకున్నా. చెర్రీ, తారక్‌ ఈ సినిమా నుంచి స్నేహితులయ్యారనేది అబద్దం. వాళ్లు ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. ఇది కూడా వారి ఎంపికకు ఒక కారణం. వయసును దృష్టిలో పెట్టుకొని తారక్‌ని కొమురం భీమ్‌గా, చెర్రీని అల్లూరిగా పెట్టుకోలేదు. రామ్‌ (అల్లూరి సీతారామరాజు)ఎంత అగ్నినైనా గుండెల్లో పెట్టుకొనే స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. అది చరణ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాంటి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా తొణకకుండా స్థిరంగా ఉంటాడు. అందుకే ఆ పాత్ర చరణ్‌కి ఇచ్చా. ఇక భీమ్‌(కొమరంభీమ్‌) పాత్ర ఎంతో అమాయకమైన వ్యక్తిది. పీలింగ్స్‌ని దాచుకోలేడు అది తారక్‌లో కనిపిస్తుంది. అందుకే తారక్‌కు భీమ్‌ పాత్ర ఇచ్చా. లుక్స్‌ చూసి ఆలియాను సీత పాత్రకు ఎంచుకోలేదు. నేను రాసుకున్న కథలో సీత పాత్రకి.. ముఖం చూడగానే సాయం చేయాలనే అమాయకత్వం కనిపించాలి. అదే విధంగా నీరు, నిప్పు అనే ఇద్దరు వ్యక్తులను కంట్రోల్‌ చేయగలిగే మనోధైర్యం ఉండాలి. ఇవన్నీ ఆలియాలో ఉన్నాయి. అందుకే ఆమెను సీత పాత్రకి తీసుకున్నాం.

ఎన్టీఆర్ కు నేను ఇక లైన్ చెపితే మిగిలినవి నా ఊహకు తగ్గట్టుగా ఊహించుకొని షాట్ కు రెడీ అయిపోతాడు.చరణ్ కు తన పాత్ర గురించి తెలిసినా.. ఏమి తెలియనట్టు తెల్లని కాగితంలా వచ్చి ఏ పెయింటింగ్ కావాలో వేసుకోమని దర్శకుడుకి సరెండర్ అయిపోతాడు. ఇలా వీరిద్దరూ కూడా పోటీ పడి చాలా చక్కగా నటించారు.అయితే ఇద్దరికి పాత్రలు, ఫైట్స్,డైలాగ్ద్ సమానంగా ఉంటాయా అనే ఆలోచన కొంతమంది అభిమానులకు రావచ్చు.అయితే మారుతున్న కాలంతో ఇలా ఆలోచించే స్థాయిని మనం ఎప్పుడో దాటేశాము అను కుంటున్నాను.సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఈ కథలోని క్యారెక్టర్స్ ను సమానంగా  చూస్తూ ఫీలవ్వాలి.అప్పుడే మనకు సినిమా నచ్చుతుంది. సినిమాలో అన్నీ కూడా సమానంగా ఉండాలి ఆనుకొని నేను సినిమా తీస్తే అది హృదయం లేని సినిమా అవుతుంది.కరోనా కారణంగా ప్రపంచంలో అందరూ ఎంతో ఇబ్బంది పడ్డారో మేము అంతే ఇబ్బంది పడ్డాము. ఫస్ట్ లాక్ డౌన్ లో షూటింగ్ ఆపేశాం. సెకెండ్ లాక్ డౌన్ లో సినిమాను కాస్త ఫైన్ ట్యూన్ చేసుకునే సమయం దొరికింది. మూడో లాక్ డౌన్ లో సినిమా కంప్లీట్ అయ్యింది.మా సినిమాను ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకున్నప్పుడు అక్కడ రాజకీయ సమీకరణాలు మాకు  తెలియదు.ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చాము.ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నందున మా సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ తో  మాట్లాడుతూనే వున్నాను.నేను ఏ సినిమా చేసినా బాగా రావాలని తీస్తాను తప్ప నా 20 సంవత్సరాల కెరీర్ లో నా సినిమా అంత చేస్తుంది, ఇంతచేస్తుంది అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటాను.

ఇటీవలే ఎపి ముఖ్యమంత్రి జగన్ ను కలవడం జరిగింది.మేము అడిగిన దానికి సాను కూలంగా స్పందించారు.పెద్ద బడ్జెట్ తో సినిమా తీశారు.మీకు నష్టం రావడం మా అభిమతం కాదు.మేము ఇచ్చిన కొత్త జీవో ప్రకారం సినిమాను రన్ చేసుకోండి.అలాగే ప్రేక్షకులపై భారం పడకుండా చూసుకోండి అంటూ ఇప్పుడు విడుదల అవుతున్న అన్ని సినిమాలకు ఐదు షోలు వేసుకునేలా అనుమతి ఇచ్చారు.ఈ నెల 25 న వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

 

యంగ్‌ టైగ‌ర్ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. రాజమౌళి గారూ నాకు కథ చెప్పినపుడు ఈ కథ విన్న నేను ఎంతో ఎగ్జైట్ అయ్యాను. ఇందులోని ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం 60 రాత్రులు షూట్ చేశాము.రాజమౌళి గారితో వర్క్ చేస్తుంటే తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను.ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తే.. నేను నటించేవాడిని కాదేమో. ఇలాంటి కథ జక్కన్నకే సొంతం. ఏ దర్శకుడు ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి కథను రాసే సాహసం చేయడు. ఒకటి మాత్రం చెప్పగలను. ఇకపై మల్టీస్టారర్‌ సినిమాలు వస్తూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. బలమైన కథలు వచ్చి, ఆ దర్శకుడు డీల్‌ చేయగలడు అనే నమ్మకం కలిగితే తప్పకుండా మల్టీస్టారర్‌ చేస్తా.మహేశ్‌  బాబు, ప్రభాస్‌, చిరంజీవి, బాలయ్య బాబాయ్‌, వెంకటేశ్‌.. ఇలా అందరితో కలిసి నటించాలని ఉంది.ఈ సినిమాకు నేను ,చరణ్ పోషించిన పాత్రలు వినిమకు ఎంత హెల్ప్ అయ్యాయో తెలియదు కానీ మా స్నేహం మరింత బలపడడానికి మాత్రం ఈ సినిమా కారణమైంది.రాజమౌళి తో సినిమా అంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది అంటారు.కానీ అది తప్పు మేము ఆర్.ఆర్.ఆర్ కోసం మేము పని చేసిన రోజులు తక్కువే..మూడు లాక్ డౌన్స్ ల కారణంగా రెండు సంవత్సరాలు పోయింది.

మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ..ఎన్టీఆర్ గ్రేట్ యాక్టర్ తనను చూసి నా క్కూడా బాగా చేయాలనే ఫీల్ కలిగింది. ఈ సినిమా మోసం ఎక్కువ రోజులు వర్క్ షాప్ చేయక పోయినా మా పాత్రలకు సంబంధించిన అంశాలపై నేను,తారక్ రెండు,మూడు రోజులు వర్క్ షాప్ చేయడం జరిగింది.అల్లూరి సీతారామరాజు బాల్యం,ఆ తరువాత యంగ్ ఏజ్ లో ఎం చేసెవారు అనే పూర్తి స్థాయి పరిశోధన చేయడానికి ఈ ఆర్.ఆర్.ఆర్ బయోపిక్ కాదు.ఇది కల్పిత కథ.రామ్,భీమ్ లకు సంబంధించిన కథ.అయితే మా కన్నా ఎక్కువగా రాజమౌళి గారు వర్క్ షాప్ చేశారు.ఈ సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడి చేసినా మాకు ఒత్తిడి అనిపించలేదు.ఈ నెల 25 న వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here