RAM (Rapid Action Mission) Movie Review

Cinemarangam.Com
సినిమా : “రామ్” (RAM Rapid Action Mission)
విడుదల తేదీ : 26.1.2024
రివ్యూ రేటింగ్ : 3 /5
బ్యానర్: దీపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఓఎస్‌ఎం విజన్‌
ప్రొడ్యూసర్: దీపికాంజలి వడ్లమాని
దర్శకత్వం : మిహిరామ్ వైనతేయ
నటీనటులు: భానుచందర్, సాయికుమార్,సూర్య అయ్యలసోమయాజులు,ధన్యా బాలకృష్ణ, శుభలేక సుధాకర్. భాషా,రవి వర్మ, మీనా వాసు తదితరులు
సినిమాటోగ్రఫీ: ధారన్ సుక్రి
సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్
ఫైట్స్ : రాజ్ కుమార్ మాస్టర్


మోడ్రన్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా చాలా సినిమాలు ఈ మధ్య వస్తున్నాయి. అవన్నీ ఎక్కువ భాగం ఓటీటీని టార్గెట్ చేస్తూ నిర్మించినవే.అయితే దేశ భక్తికి కమర్షియల్ అంశాలను జోడించి అందరినీ ఆకట్టుకునే చిత్రాాలు తీయడం అంటే మాములు విషయం కాదు. తొలి ప్రయత్నంలోనే అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే కంటెంట్ అండ్ క్వాలిటీతో దేశ భక్తిని చాటే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “రామ్” (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా  ఈ సినిమాను రూపొందించారు. సూర్య అయ్యలసోమయాజుల హీరోగా ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా మిహిరామ్ వైనతేయను దర్శకుడిగా పరిచయం చేస్తూ దీపికాంజలి వడ్లమాని నిర్మించారు. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్‌‌ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న గ్రాండ్‌గా .ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
దేశానికి హాని తలపెడుతున్న ఉగ్రవాదులను వారి స్టావరాలను మట్టు బెట్టాలని తన టీంతో బయలు దేరుతాడు మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్).. టీంతో కలసి అందరి ఉగ్రవాదులను హతమార్చిన తరువాత ఒక ఉగ్రవాదిదగ్గర ఉన్న బెల్ట్ బాంబ్ కారణంగా టీం అందరినీ సేవ్ చేసే క్రమంలో తన ప్రాణాలు లెక్కచేయకుండా దేశంకోసం వీర మరణం పొందుతాడు. తమ కోసం మరణించాడంటూ మరో మేజర్ జేబీ (భాను చందర్) ఆ త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. మేజర్ సూర్య ప్రకాష్ కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల) మాత్రం దేశానికి సేవ చేయడం అంటే ఇష్టం ఉండదు. దేశానికి సేవ చేస్తూ తన తండ్రి చనిపోతే దిక్కులేని వాళ్లం అయ్యామని, చిన్నతనంలోనూ నాన్న తనతో ప్రేమగా ఉండలేకపోయాడంటూ కోపంతో ఉంటాడు రామ్. అలాంటి రామ్‌ను సూర్య ప్రకాష్ కోరిక మేరిక డిపార్ట్మెంట్‌లోకి జాయిన్ చేయించడానికి జేబీ చేసిన ప్రయత్నాలు ఏంటి? జేబీ కూతురు జాహ్నవి (ధన్య బాలకృష్ణ)కు ఈ కథలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఏంటి? ఉగ్ర సంస్థల కుట్రను చివరకు రామ్ అడ్డుకున్నాడా? దేశభక్తి అసలే లేని రామ్.. చివరకు దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తిగా ఎలా మారాడు? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా రామ్ సినిమా చూడాల్సిందే…


నటీనటుల పనితీరు 
రామ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడు. దేశభక్తి అంటే గిట్టని, అల్లరి చిల్లరగా తిరిగే ఓ కుర్రాడిలా కనిపించినప్పుడు.. దేశ భక్తితో ఎదిగిన ఓ సిన్సియర్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు చూపించే వ్యత్యాసం ఆకట్టుకుంటుంది. ఆ రెండింటికీ చాలా వ్యత్యాసం చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త అల్లరి చిల్లరగా, పిచ్చి జుట్టు వేసుకున్నట్టుగా.. అమ్మాయి ప్రేమ కోసం తిరిగే ఓ సాధారణ కుర్రాడిలా కనిపిస్తాడు. ద్వితీయార్దంలో మాత్రం దేశం కోసం ప్రాణాలిచ్చే సిన్సియర్ ఆఫీసర్‌గా సీరియస్ పాత్రలోనూ అలరించారు. యాక్షన్ ఎమోషన్ కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ సూర్య ఆకట్టుకున్నాడు. ఇక మొదటి సినిమా అన్న బెరుకు ఎక్కడా లేకుండా యాక్షన్ సీక్వెన్స్‌లోనూ బాగా చేశాడు.. రోహిత్ చాలా రోజులకు మంచి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి కనిపించిన రియల్ హీరోలా మారాడు. భానుచందర్ ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. సాయి కుమార్, శుభలేక సుధాకర్ తమ అనుభవాన్ని చూపించారు. భానుచందర్, సాయి కుమార్ ల ప్రతీ డైలాగ్ అందరినీ ఆలోచింపజేసేలా తూటాలా ఉన్నాయి.హీరోయిన్ ధన్యా బాలకృష్ణ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. భాషా కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన వారందరూ వారి పాత్రలకు న్యాయం చేశారాని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
మన దేశంలో ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్‌లోనే కాదు.. దేశం లోపలే ఎంతో ప్రమాదకర శత్రువులున్నారని హెచ్‌ఐడీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అంటూ కొత్తది చూపించి.. దాని చుట్టూ ఈ కథనాన్ని అల్లు కొని దేశం లోపల ఓ మతానికి చెందిన కోవర్టులు ఎలా ఉన్నారు? వారికి రాజకీయ నాయకుల అండ ఎలా ఉంటోంది? మన దేశంలోనే ఉంటూ.. పక్క దేశానికి పని చేసే స్లీపర్ సెల్స్ మాత్రమే కాకుండా దేశసరిహద్దు లోపల టెర్రర్ అటాక్ బారి నుంచి మనల్ని కాపాడే అన్ సంగ్ హీరోలు ఉన్నారని చాలా చక్కని కథ రాసుకొని తెరకెక్కించడం తీరు మాత్రం కొత్తగా ఉంది .పనీ పాట లేని అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. దేశం కోసం ప్రాణాలిచ్చే అధికారిగా మారే జర్నీని ఎంతో చక్కగా చూపించాడు. క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. ప్రతీ ఒక్క భారతీయుడికి ఈ సీన్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. త్రివర్ణ పతాకం కనిపించే షాట్, దేశ భక్తిని, మత సామరస్యాన్ని చాటేలా చివర్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేలా చూపించే షాట్.. హిందూ అధికారికి, ముస్లిం పౌరుడు సాయం చేసే సీన్‌కు దండం పెట్టాల్సిందే. భారత్ మాతాకి జై అని తెరపై అంటే.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకి సైతం ఆ వైబ్ వచ్చేలా చేయడంలో దర్శకుడు మిహిరామ్ వైనతేయ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు

టెక్నికల్ విషయాలను చూస్తే ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన సంగీతం బావుంది. ధారన్ సుక్రి సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ఎడిటింగ్ పనితీరు బాగుంది.దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి దీపికాంజలి వడ్లమాని ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాయే అయినా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా నిర్మించారు. ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుంటా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు. ఈ సినిమా కోసం వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఇందులో వచ్చే మాటలు గుండెల్ని హత్తుకుంటాయి .హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన “రామ్” సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కచ్చితంగా చెప్పవచ్చు .

Cinemarangam.Com Review Rating .. 3./5

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here