Ramesh Kishans Film Productions Number 1 Poster Release

రమేష్ కిషన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రమేష్ కిషన్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా గోడ పత్రిక విడుదల కార్యక్రమం ఈ శనివారం నాడు హైదరాబాద్ లోని కార్యాలయంలో జరిగింది. 

త్వరలోనే పేరు ప్రకటించబోతున్న ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని 15రోజుల సింగల్ షెడ్యూల్ లో అత్యంత అద్భుతంగా చిత్రికరించటం జరిగిందని,త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని OTT, థియేటర్ ల ద్వారా విడుదల చెయ్యడానికి సంసిద్ధం అవుతున్నామని దర్శకులు
తెలియచేసారు.

ఇదే సందర్బంగా రమేష్ కిషన్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ప్రొడక్షన్ నెంబర్ 2సినిమా ముహూర్తం పూజా కార్యక్రమం కూడా జరిగింది. సెంటిమెంట్, రొమాంటిక్ క్రైమ్ మరియు థ్రిల్ ఎలిమెంట్ లతో రూపొందబోతున్న ఈ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో  నాటకరంగంలో నిష్ణాతులైన నటి,నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని, ఈ చిత్రాన్ని  రెండు షెడ్యూల్లలో 24రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి OTT మరియు  థియేటర్  ద్వారా విడుదల చేస్తామని దర్శకనిర్మాత రమేష్ కిషన్ గౌడ్ గారు తెలియచేసారు.

కార్యక్రమంలో ప్రధాన పాత్రల్లో నటించిన నభీనా,ఓం ప్రదీప్,రమేష్ కిషన్ గౌడ్, పద్మిని గౌడ్, గంగా భవానీ, జంగయ్య గౌడ్,మంజులా, శ్రీనివాస రావు,అశోక్,ఉదయ్, అణేష్,ఎల్లప్ప, సిరిగిరి గౌడ్, గీత రచయిత వంశీకృష్ణ

సంగీత దర్శకులు సిమియోన్
కెమెరామెన్లు :BS కుమార్, శ్రీశైలం
ఎడిటర్ :మహేష్ కాసర్ల
గ్రాఫిక్స్ రమేష్ బండారి,
సంభాషణల రచయిత CH.దయానంద్
నిర్మాత మరియు కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అందించిన
శ్రీ రమేష్ కిషన్ గౌడ్ లు మరియు
ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.
Banner :Ramesh kishan’s film ప్రొడక్షన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here