“Rani” Movie Review

Cinema rangam.. Rating… 3/5
Movie Name:– “Rani”
Banner:-Manohari Arts & Naziya shek
Starring:- Shweta Verma, Praveen Yandamuri, Kishore Marisetti, Appaji Ambarisha Dharma, Meka Ramakrishna, Rajasekhar Anningi, Surabhi Sravani, Sujatha, etc.
Cinematography..Rama Maruthi M
Castums & Styling..Naziya Shek,Aindi
Lyrics..Sandi Addanki,Eswar Dattu,lakshmi Priyanka,Krishnaji
PRO..Madhu VR
Editor:- Jeswin Prabhu
Music:-Shandi Addanki
Producer:- kishor Marisetty,Nakita Shek
Writer and Director:- Raghavendra Katari

మనోహరి ఆర్ట్స్ & నజియా షేక్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్వేత వర్మ, ప్రవీణ్ యండమూరి, కిషోర్ మారిశెట్టి నటీనటులుగా రాఘవేంద్ర దర్శకత్వంలో కిషోర్ మారిశెట్టి  మరియు నజియా షేక్ లు నిర్మిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం “రాణి” అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫాంలలో తెలుగు,హిందీ బాషల్లో ఈ నెల 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా వుందో తెలుసు కుందాం…

కథ

శివ (ప్రవీణ్ ) రాణి (శ్వేతావర్మ) ,పోలీస్ గా విక్రమ్ ,రాణి ఫాదర్ తన కూతురును కష్టపడి చదివించి కలెక్టర్ ని చేయాలను కుంటాడు తాను కూడా తన తండ్రి కోరికను నెరవేర్చాలనే పట్టుదలతో చదువుకునే మిడిల్ క్లాస్ అమ్మాయి. విక్రమ్ అన్యాయాన్ని ఎదుర్కొనే సాధారణ పోలీస్.శివ (ప్రవీణ్ )అమ్మాయిలు వీక్ నెస్ తెలుసుకొని వారిని ప్రాస్టిట్యూట్ గా మారుస్తూ సుమారు 200 మంది అమ్మాయిలను తన గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తూ..తన మాట వినని వారిని చంపేస్తుంటాడు. ఈ క్రమంలో శివ చూపు రాణిపై పడుతుంది.రాణిని ప్రాస్టిట్యూట్ గా దింపాలనే విషయం లో ఇద్దరికీ గొడవ జరిగి శివ ను రాణి దాడి చేస్తుంది. పోలీస్ స్టేషన్ కెళ్ళి శివ పై కంప్లేన్ట్ రాసి విక్రమ్ కు ఇస్తుంది.కొంతమంది సహాయంతో శివను జైల్లో పెట్టిస్తుంది.రాణి పై కక్ష్య పెంచుకొన్న శివ,జైల్ నుండి బయటకు వచ్చి డాక్టర్ సహాయంతో రాణిపై ఒక కొత్త ప్రయోగం తో రాణి ని ప్రాస్టిట్యూట్ గా ఎలా మార్చాడు? శివ ట్రాప్ నుండి రాణి ఎవరి సహాయంతో బయట పడింది. తను ఇలా మారడానికి కారణమైన వారిపై రాణి రివెంజ్ తీర్చుకుందా? రాణిని కలెక్టర్ గా చూడాలనే తన తండ్రి కోరికను నెరవేర్చిందా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే…

నటీ నటులు

శ్వేతా వర్మ రాణి గా రివెంజ్ క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది.రెండు వేరియేషన్స్ లలో కూడా తన రెండు పాత్రలను బ్యాలెన్సు చేస్తూ చక్కగా నటించింది.ఫ్లాష్ బ్యాక్ లో డాక్టర్ తో రాణి పై చేసే ప్రయోగం, మనిషిని ఎలా అడిక్ట్ అయ్యేలా చేయచ్చో దర్శకుడు చాలా చక్కగా చూపించాడు.పోలీస్ పాత్రలో విక్రమ్ తన పాత్రకు న్యాయం చేశాడు.ఈ సినిమాలో ఉన్న ఐదు, పది క్యారెక్టర్లు వున్నా కనువింపుగా పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ తో ఆడియన్స్ ను కూర్చోపెట్ట కలిగారు.సినిమాలో వచ్చే మూడు తీమ్ సాంగ్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి ..ఈ సినిమాలో ఉన్న కొన్ని డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. శివ రాణిపై చెప్పే డైలాగు “దాని చావు ఎంత దారుణంగా ఉండాలంటే.. ఎండలో భగభగ మండుతున్న నాపరాతి బండి మీద చిన్న పురుగును పడవేస్తే అది ఎలా కొట్టుకుంటూ చస్తుందో రాణి కూడా అలా చచ్చేటప్పుడు చూడాలి అనే డైలాగ్ బాగా పండింది. అలాగే డాక్టర్ శివతో “పగ తీర్చుకోవడం అంటే శత్రువుని చంపడం కాదు మనకు నచ్చినట్టుగా మార్చుకోవడం” వంటి డైలాగులు గుర్తిండి పోతాయి .ఫస్ట్ టైం ఈ బ్యానర్లో తీసిన రాణి సినిమాను సక్సెస్ ఫుల్ గా జనాలకు చూపించగలిగారు .

సాంకేతిక నిపుణులు

నిర్మాతలు ఫస్ట్ ప్రొడక్షన్ లో ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా కంటెంట్ కు తగ్గట్టుగా మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలుగా సమాజానికి ఉపయోగపడే విధంగా… చాలా మందికి ఇనిస్పిరేషన్ కలిగించేలా సినిమా నిర్మించారు. దర్శకుడు సైతం నిర్మాతల అభిరుచికి తగ్గట్టుగా ఈ కథను సినిమాగా మలుస్తూ. మంచి టెంపోను మెయింటైన్ చేసాడు.సినిమా ప్రారంభం నుంచే కథలో లీనమయ్యేలా స్క్రీన్ ప్లే తీర్చిదిద్దాడు దర్శకుడు.ఎడిటింగ్,ఆర్,ఆర్ సరిగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్, సినిమాను చాలా క్వాలిటీగా తీశారు. సరైన ప్యాడింగ్ లేక పోవడం సినిమాకు పెద్ద మైనస్. పెద్ద ప్యాడింగ్ ఉండి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. కరోనా టైంలో ఎంతో కష్ట పడి షూటింగ్ చేశారు.కరోనా టైం లో షూట్ చెయ్యకుండా లాక్ డౌన్ తరువాత ఇంకొంచెం కష్టపడి చేసి ఉంటే బాగుండేది. శ్వేత వర్మ గతంలో చేసిన సినిమాలకు బాగా పెరు వచ్చింది.ఈ సినిమా కూడా తనకు మంచి పేరు తీసుకొస్తుంది.డిజిటల్ ప్లాట్ ఫాం లలో అమెజాన్, ఎం.ఎక్స్ ప్లేయర్ లలో విడుదలైన ఈ సినిమాను ఇంట్లొ ఫ్యామిలీ తో కలసి చూడదగ్గ సినిమాలా ఉంది.నేటి యూత్ ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా రాణి.

Cinemarangam.com 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here