‘Rave Na Chelia’ Movie Grand Releasing on August 13

సూర్య చంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌లో నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రావే నా చెలియా’. కీర్తి శేషులు నెమలి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్వర్ రెడ్డి దర్శకుడు. ఏడు నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇటీవల థియేటర్స్ మళ్లీ తెరుచుకోవడంతో చిత్రాన్ని ఆగస్ట్ 13న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహేశ్వర్ రెడ్డి చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఈ సినిమా విషయంలో నిర్మాత నెమలి సురేష్‌గారి సపోర్ట్ మరిచిపోలేనిది. ఆయన ఇటీవలే మృతి చెందారు. ఆయన ఉండి ఉంటే ఈరోజు ఎంతో ఆనందించేవారు. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి. బ్యూటీఫుల్ ప్రేమకథను ప్రేక్షకులు చూడబోతున్నారు. అలాగే హీరో నెమలి అనిల్‌కి తొలి చిత్రమే అయినా.. చాలా అనుభవం ఉన్న హీరోలా నటించారు. ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్స్‌లు చాలా బాగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. అలాగే హీరోయిన్ కూడా. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా మంచి ప్రొడక్ట్ ప్రేక్షకులకు ఇవ్వాలని ఎంతగానో సపోర్ట్ చేశారు. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ‘రావే నా చెలియా’ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అన్ని హంగులతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఆగస్ట్ 13న థియేటర్లలోకి వస్తుంది. అందరూ చూసి మా యూనిట్‌ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..’’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here