‘RED’ Movie Review

Release date :-January 14,2021
Cinema rangam :- Rating 3/5
Movie Name :- “RED”
Banner:-Sri Sravanthi Movies
Presents:-Krishna Pothineni
Starring:- Ram Pothineni , Nivetha Pethuraj, Malvika Sharma, Amritha Ayyar, Vennela Kishore, Comedian Satya, Heba Patel, Sonia Agarwal Etc…
Editor:- Junaid Siddikhi
Music:-Mani Sharma
Cinematography:-Sameer Reddy
Producer:- Sravanthi RaviKishor
Director:- kishor Tirumala

ఇస్మార్ట్ శంకర్ తో మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రామ్ ఇప్పటివరకూ ఈ తరహా పాత్రలు చెయ్యలేదు. కెరీర్ తొలినాళ్లలో క్రైమ్ ఓరియంటెడ్ స్టోరీతో చేసిన ‘జగడం’.అలాగే యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీలు అతడికి వర్కవుట్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు డ్యుయెల్ రోల్‌లో క్రైమ్ బేస్డ్ స్టోరీని అతడు ఎలా లాక్కొస్తాడోననే కుతూహలం కలిగింది. రామ్‌తో ఇదివరకు ‘నేను.. శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’ సినిమాలు తీసిన తిరుమల కిశోర్ డైరెక్షన్‌లో స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల ఊహలకు తగినట్లే ఉందా? భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ అంచనాల్ని ‘రెడ్’  ఏమాత్రం అందుకున్నాడో చూద్దాం రండి..

కథ:

సిద్ధార్థ్ (రామ్), ఆదిత్య (రామ్) కవలలు.అచ్చు గుద్దినట్లు ఒకేలా కనిపించే ఇద్దరు యువకుల కథ. ఒకడు సొంతంగా ఓ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మొదలుపెట్టిన సివిల్ ఇంజనీర్ సిద్ధార్థ (రామ్‌) అయితే, మరొకడు డబ్బు కోసం చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికే పేకాట వ్యసనపరుడైన ఆదిత్య (రామ్‌). ఇద్దరూ పోలికల్లోనే కాదు ఇద్దరి డీఎన్‌ఏ కూడా ఒకేలా ఉంటుంది. సోనియా అగర్వాల్, రవి ప్రేమించి పెళ్లి చేసుకుని అభిప్రాయ భేదాలతో విడిపోతారు. వీరిద్దరి సంతానమే సిద్ధార్థ్, ఆదిత్యలు. పేరెంట్స్ విడిపోవడంతో సిద్దార్థ్ తండ్రి వద్ద.. ఆదిత్య తల్లి వద్ద పెరుగుతాడు.తన ఆఫీస్ ఉండే బిల్డింగ్‌లోనే మరో సంస్థలో పనిచేసే మహిమ (మాళవిక శర్మ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. ఒకసారి ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్తుంది. ఆ తర్వాత, ఒక రోజు, ఆకాష్ అనే వ్యక్తి చంపబడతాడు.హత్యకేసులో లభించిన ఫొటో ఆధారంగా ఆ హత్య చేసింది, సిద్ధార్థ్ నే చెప్పి అతన్ని అరెస్టు చేస్తారు. కానీ, అప్పుడే పోలీసులకు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆదిత్య దొరుకుతాడు.ఒకే పోలికలతో ఉన్న ఆ ఇద్దరిలో ఒకరు కచ్చితంగా ఆ హత్య చేశారని పోలీసులకు తెలుసు. ఇంతకీ ఆ హత్య చేసిందెవరు..? దానికి కారణాలేంటి.. పోలీసులు అసలు హంతకుడిని పట్టుకోగలిగారా లేదా.. సీఐ ఉద్దేశపూర్వకంగా సిద్ధార్థను ఎందుకు టార్గెట్ చేశాడు?.. అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు :

ఇస్మార్ట్ శంకర్ తరువాత మాస్ ఆడియోన్స్ ని దృష్టిలో పెట్టుకొని డిఫ్రెంట్ గేటప్ లో రంగంలోకి దిగిన రాం రెండు పాత్రలలో అదరగొట్టాడు.ఒక వ్యసనానికి బానిస అయిన స్త్రీ జీవితం ఎలా తయారవుతుందో, ఆ వ్యసనం మంచిది కాదని తెలిసినా, దాన్నుంచి బయటపడలేని బలహీనత్వంతో ఆమె ఎలా సతమతమవుతుందో తల్లి పాత్రలో సోనియా అగర్వాల్ చక్కగా నటించింది.సంపత్,పోసాని కృష్ణ మురళి, సత్యా, వెన్నెల కిశోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కథంతా మాళవిక శర్మ పాయింట్ ను బేస్ చేసుకొని సినిమా నడుస్తుంది.ఆమె పాత్ర పరిమితంగా ఉంటుంది. అమృత పాత్ర చిన్నదే అయ్యినా గాయత్రీ పాత్రలో ఒదిగిపోయింది. హత్యకేసును ఇన్వెస్టిగేట్ చేసే సబ్ ఇన్‌స్పెక్టర్ యామిని (నివేదా పేతురాజ్‌) నిజాయితీ మనల్ని ఆకట్టుకుంటుంది.

సాంకేతిక విభాగం :

ఒరిజినల్ ‘తాడమ్‌’కు కొన్ని మార్పులు చేసి,దర్శకుడు కిశోర్ స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు.దర్శకుడు కిశోర్ ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా భిన్న మనస్తత్వాలు కలిగిన సిద్ధార్థ, ఆదిత్య పాత్రలను మలిచాడు. ఫస్టాఫ్‌ సిద్ధార్థ, మహిమ లవ్ స్టోరీతో, పవిత్ర (పవిత్రా లోకేశ్‌) సహాయంతో సత్యాతో కలిసి డబ్బు కోసం ఆదిత్య చేసే చిల్లర మోసాలతో రొమాంటిక్‌గా, సరదాగా సాగుతుంది. బోర్ కొట్టించని కథనంతో ఈ సన్నివేశాలను కల్పించాడు. సెకండాఫ్ అంతా మర్డర్ కేసు చుట్టూ నడుస్తుంది.హత్యకేసులో పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్‌, ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తూ, హత్య చేసింది సిద్ధార్థా, ఆదిత్యా.. అనే క్యూరియాసిటీని రేకెత్తించడంలో డైరెక్టర్ సక్సెసయ్యాడు. సిద్ధార్థ, మహిమ మధ్య సీన్లు ఆకట్టుకుంటాయి. ఐడెంటికల్ ట్విన్స్ అయినప్పటికీ రెండు భిన్న ధ్రువాలుగా సిద్ధార్థ, ఆదిత్య ఎందుకు తయారయ్యారనే నేపథ్యం కన్విన్సింగ్‌గా అనిపిస్తుంది.దర్శకుడు తమిళ డైలాగ్స్‌ను తెలుగులో రాసుకున్నా సంభాషణల విషయంలో తన పెన్ పవర్ చూపించాడు ‘నాకు నీ అబద్దం వినిపించింది. నీ అవసరం కనిపించింది’అని అమృత రామ్ తో చెప్పే డైలాగ్..అలాగే రామ్ చివరలో గాయత్రితో  “రామాయణాన్ని ఓ మగాడు కాకుండా ఆడది రాసున్నట్లయితే సీతను రాముడు అనుమానించేవాడు కాదేమో” అని చెప్పే డైలాగ్ తో పాటు సందర్భానుచితం మంచి డైలాగ్స్ రాసాడు కిషోర్.

మణిశర్మ మ్యూజిక్‌లో మాస్ సాంగ్ డించక్ డించక్‌, క్లాస్ సాంగ్ నువ్వే నువ్వే ఆకట్టుకున్నాయి. ఎప్పట్లా మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్‌. చాలా సీన్లను తన బీజీయంతో ఉత్కంఠభరితంగా ఆయన తయారుచేశాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్దిఖి ఎడిటింగ్ ప్రభావవంతంగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ సీన్లలో ఎ.ఎస్‌. ప్రకాశ్ ఆర్ట్ వర్క్ సూపర్బ్‌.నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘రెడ్’ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది.ఫైనల్ గా సినిమా రామ్ ఫ్యాన్స్ కి కొంచం బాగుంది అనిపించినా కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె తప్పకుండా ఒక్కసారైతే చూడాల్సిన చిత్రమే ఈ రెడ్.

                Cinema Rangam.com  3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here