Renu Desai Pan India Web Series ‘Aadhya’ Launch

ఒక పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు రేణు దేశాయ్.డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై డి.ఎస్.రావు – రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ తో యువ ప్రతిభాశాలి ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యు అండ్ ఐ పద్మనాభరెడ్డి సమర్పిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో నందిని రాయ్ తోపాటు బాలీవుడ్ హీరో ‘వైభవ్ తత్వవాడి’ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు అనేక ప్రత్యేకతలు కలిగిన ”ఆద్య’ విజయదశమి రోజు ఆరంభం అయింది. సంస్థ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలు అనంతరం స్క్రిప్ట్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త చింతిరెడ్డి అనంత్ రెడ్డి దర్శకుడు కృష్ణకు అందించారు. అనంతరం రేణు దేశాయ్ పై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి ప్రముఖ దర్శకులు నీలకంఠ కెమెరా స్విచాన్ చేయగా.. డి.ఎస్.రావు క్లాప్ కొట్టారు. ఎం.ఆర్.కృష్ణ మామిదాల దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు శివేంద్ర దాశరధి, పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్, బి.వి.వి.చౌదరి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో.నిర్మాతలు రజనీకాంత్.ఎస్, డి.ఎస్.రావులు మాట్లాడుతూ…’రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘ఆద్య’ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాతలు రజనీకాంత్.ఎస్, డి.ఎస్.రావు తెలిపారు.

రేణుదేశాయ్ మాట్లాడుతూ… దర్శకుడు కృష్ణ చెప్పిన కథ తనను విపరీతంగా ఆకట్టుకుందని, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేంత గొప్ప కథ అని అన్నారు.

దర్శకుడు ఎం.ఆర్.కృష్ణ మామిడాల మాట్లాడుతూ..తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తన కథను సింగిల్ సిట్టింగ్ లో ఓకె చేసి, తనను ప్రోత్సహిస్తున్న రేణు దేశాయ్ మేడమ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని  తెలిపారు.

రేణు దేశాయ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం గర్వంగా ఉందని నందిని రాయ్ అన్నారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి, కథ-మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్యరెడ్డి.ఎస్, సమర్పణ: యు అండ్ ఐ పద్మనాభరెడ్డి, నిర్మాతలు: డి.ఎస్.రావు- రజనీకాంత్.ఎస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాల!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here