Romantic, Suspense Thriller ‘Raju Gari Kodi Pulao’ Movie Review

Cinemarangam.Com
Movie Name : “RAJU GARI KODI PULAO” 
Review Rating : 2.5/5
Release Date : 04.08.2023
Banner: AMF, Kona Cinema
Producers: Anil Moduga, Shiva Kona
Director: Shiva Kona
Starring: ETV Prabhakar, Shiva Kona, Kunal Kaushik, Neha Deshpande, Prachi Thaker, Abhilash Bandari, Ramya Dinesh, and more.
Music: Pravin Mani – Sashank Tirupathi
Cinematography: Pavan Guntuku
Editors: Basava, Shiva Kona
Sound Design: G. Purushottam Raju
VFX: Vishnu Poluju
Sound Mixing: A Raj Kumar
Writing Collaboration, Executive Producer: Ravi Sandrana
PRO: Harish, Dinesh

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై శివ కోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ నటీ నటులుగా శివ కోన దర్శకత్వంలో అనిల్ మోదుగ, శివ కోనలు సంయుక్తంగా నిర్మించిన రొమాన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, వీడియోలు మూవీ లవర్స్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా యూట్యూబ్ ను షేక్ చేస్తూ 1 మిలియన్ పై చిలుకుతో వేగవంతంగా దూసుకెళ్తోంది. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఇంతలా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతుంది అనడానికి ట్రైలర్ నిదర్శనగా నిలిచింది. ఇక ట్రైలర్ చూసిన సినిమా ప్రేక్షకులు కథ ఇంకెంత వైవిధ్యంగా ఉంటుందోనని సినిమా విడుదల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 4న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ:
కోడి పులావ్ తో దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న రాజుగారు (ప్రభాకర్) పరిచయంతో సినిమా స్టార్ట్ అవుతుంది.ఈ సినిమా మొత్తం రాజు గారు కోడి పులావ్ చుట్టూనే తిరుగుతుంది. రాజుగారికి ఎంత పెద్ద పేరొచ్చినా తనకు వారసుడు పుట్టకుండా అమ్మాయి పుట్టిందని అలాగే తనకు ఎంత సంపద ఉన్నా తన భార్య మాత్రం నా మాట వినకుండా బయట తిరుగుందనే అసంతృప్తితో ఎప్పుడూ బాధ పడుతుంటాడు. అయితే అనుకోకుండా ఒకరోజు జరిగిన ప్రమాదంలో తన రెండు కాళ్ళను పోగొట్టుకుంటాడు. మరోవైపు చిన్నప్పటి ఫ్రెండ్స్ అయిన డ్యానీ (శివ కోన), క్యాండీ( ప్రాచి కెథర్) లు ప్రేమించుకున్న జంట కాగా,బద్రి (కునల్ కౌశల్), ఆకాంక్ష(నేహా దేష్ పాండే), భార్య భర్తలు, షారుఖ్ (అభిలాష్ బండారి),ఈషా (రమ్య దినేష్) లు భార్య భర్తలు, వీరందరూ కలసి రీ యూనియన్ పేరుతో సరదాగా గడపడానికి ఒక సుందరమైన అటవీ ప్రాంతానికి యాత్రకు బయలు దేరుతారు. అయితే ఇందులోని ఒక పెళ్ళైన జంట మాత్రం వారిద్దరి మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా ఒకే ఇంట్లో ఉంటూ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఫారెస్ట్ ట్రిప్ కు వెళ్తామని ఇంట్లో చెప్పిన వీరికి వీరి పాప వెళ్ళద్దు ట్రిప్ లో మీకు ప్రాణ హాని ఉందని కల వస్తుంది వెళ్లొద్దని చెపుతున్నా బయలుదేరుతారు. అయితే ఆ అటవీ ప్రాంతానికి వెళ్లిన తరువాత అక్కడ ఎదురయ్యే సమస్యలు, సవాళ్ల గురించి వారికీ ఏమీ తెలియదు. అడవిలో కాటేజ్ కు వెళ్లిన తరువాత ఫుల్ ఎంజాయ్ చేద్దామనుకుంటూ ఈ అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అయిన తరువాత వారు కాటేజ్ కు చేరుకొకముందే వారి కారు ఆగిపోతుంది.దాంతో నడుచుకుంటూ కాటేజ్ కు చేరుకోవాలని ముందుకు సాగతారు. వీరు ప్రయాణిస్తున్న టైంలో ఒక్కొక్కరు చంపబడుతుంటారు. దాంతో బయపడిన మిగిలిన వారు అక్కడ ఫోన్ సిగ్నెల్స్ కూడా రాకపోవడంతో వారివెంట తెచ్చుకున్న నావిగేటర్ ద్వారా కాటేజ్ కు బయలుదేరగా తిరిగి తిరిగి వారు ఎక్కడైతే కాలినడక స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే రావడం జరుగుతుంది. అయితే చివరికి ట్రిప్ కు ప్లాన్ చేసిన వారు మినహా మిగిలిన వారు అనుమానాస్పద స్థితిలో చంపబడతారు .అయితే ఈ అడవిలో ఎంజాయ్ చేద్దామని ట్రిప్ కు వచ్చిన వీరిని ఎవరు ఎందుకు చంపుతున్నారు? ఈ ట్రిప్ కు ప్లాన్ చేసిన వారే హంతకులా? ఈ మరణాల వెనుక మిస్టరీ ఏంటి? వీరికీ రాజు గారి కోడి పులావ్ కు ఏమైనా సంబంధం ఉందా?.. అనేది తెలుసుకోవాలంటే.. కచ్చితంగా “రాజు గారి కోడి పులావ్” సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు
పులావ్ రాజుగా నటించిన ప్రభాకర్ పాత్ర చిన్నదే అయినా తన పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చాలా బాగా నటించాడు. అలాగే డ్యానీగా నటించిన శివ కోన పాత్ర ఈ సినిమాకు కీలకం అని చెప్పవచ్చు.నటుడుగా మాటలు, పాటలు, ఫైట్స్, ఏమోషన్స్ ఇలా అన్ని షేడ్స్ లో చాలా చక్కగా నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే కునాల్ కౌశల్, నేహా దేశ్ పాండే, మరియు ప్రాచీ కేథర్, అభిలాష్ భండారి, రమ్య దినేష్ లు కూడా వారికిచ్చిన పాత్రలలో నటించి మెప్పించారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
వివాహేతర సంబంధాల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుందనే థ్రిల్లర్‌ కథాంశంతో రొమాన్స్, సస్పెన్స్ మరియు డార్క్ కామెడీతో నావిగేట్ చేస్తూ, సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా శివ కోన తెరకెక్కించిన విధానం బాగుంది. దర్శకుడిగా,కీలక పాత్రలో నటుడుగా నటించడంలో దర్శకుడు శివ కోన సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ పవన్ గుంటుకు తన కెమెరాతో అడవిలో ఉండే ఆకర్షణీయమైన అందాలను ప్రేక్షకులను కట్టి పడేసేలా చక్కటి విజువల్స్ అందించాడు.ఈ సినిమాకు ప్రవీణ్ మణి అద్భుతమైన సంగీతం అందించాడు. బసవా ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన లు సంయుక్తంగా ఖర్చుకు వెనుకడకుండా చాలా రిచ్ గా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.యాత్ కు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. చివరకు రొమాన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం “రాజు గారి కోడి పులావ్” కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.com Review Rating.. 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here