Romantic Family Entertainer “Miss Shetty – Mr. Polishetty” Review

Cinemarangam.Com
బ్యాన‌ర్‌: యువీ క్రియేష‌న్స్‌
సినిమా : “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 07.09.2023
నిర్మాత‌లు: వంశీ – ప్ర‌మోద్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బాబు.పి
న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు
సంగీతం : రధన్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్ర‌ఫీ: నిర‌వ్ షా
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం, బృందా
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రాజీవ‌న్‌
వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: రాఘ‌వ్ త‌మ్మారెడ్డి
పి.ఆర్.వో : జీ.ఎస్.కే మీడియా

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి, తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వస్తోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంపై మంచి అంచనాలున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి పి. మహేష్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ చేసేందుకు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది సెప్టెంబర్ 7న గ్రాండ్ గా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
యు.కె లోని లండన్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ చెఫ్ అయిన అన్విత (అనుష్క శెట్టి),జీవితంలో బాగా సెటిలైనా..కూడా పెళ్లి చేసుకోకుండా ఉందని తల్లి (జయసుధ) బాధపడిపోతుంటుంది . అన్వితకు పెళ్లి చేసుకోవడంపై మంచి భావన ఉండదు. దాంతో జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుంది. తల్లి మరణం అనంతరం..పెళ్లి చేసుకోవాలని లేకపోయినా తన తల్లి పడిన ఇబ్బందులు తను పడకూడదనే ఆలోచనతో పెళ్లి కాకుండా ఎటువంటి అలవాట్లు లేని ఒక డోనర్ ద్వారా తల్లి అవ్వాలనుకుని ఇండియా వస్తుంది.ఈ క్రమంలో
బిటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కంపెనీ లో స్టాండప్ కమెడియన్ గా జాబ్ చేస్తున్న సిద్ధు (నవీన్ పోలిశెట్టి).అన్వితకు పరిచయమవుతాడు.ఈ క్రమంలో అన్విత,సిద్దుతో కలసి ఉంటూనే సిద్దుకున్న అలవాట్లు, వారి ఫ్యామిలీ గురించి అన్ని యాంగిల్స్ లో చెక్ చేసుకుంటుంటుంది. ఈ తరుణంలో అన్విత మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంటాడు సిద్దు. అన్వితకు లవ్ ప్రపోజల్ చేసి పెళ్లి ప్రపోజల్ తీసుకు వద్దామనుకుంటున్న సమయంలో డోనర్ గా ఉండి హెల్ప్ చేయమని సిద్ధుకు షాక్ ఇస్తుంది అన్విత .ఇటువంటి వాటిపై ఏ మాత్రం ఇష్టం లేని సిద్ధు అన్వితకు సహాయం చేయగలిగాడా? ఈ క్రమంలో ఆ జంటకు ఎదురైన పరిణామాలు ఏంటి ?. వాళ్లు మానసికంగా ఎలాంటి ఎమోషన్ కు గురయ్యారు. అసలు అన్విత పెళ్ళికి ఎందుకు విరుద్ధం? చివరికి అన్విత-సిద్ధుల జంట కలిసిందా? లేదా అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు

సిద్దు పొలిశెట్టి పాత్రలో నటించిన (నవీన్ పోలిశెట్టి) తన
కామెడీ టైమింగ్ తో తన కిచ్చిన పాత్రను అద్భుతంగా చేశాడు. కామెడీతోపాటు ఎమోషన్స్ సీన్స్ లోనూ బాగా నటించి మెప్పించాడు. అన్విత పాత్రలో నటించిన అనుష్కకు నటిగా పేరు పెట్టాల్సిన పని లేదు. తను చాలా సెటిల్డ్ గా తనకిచ్చిన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది. నటన పరంగా వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. క్లైమాక్స్ లో భావొద్వేగభరితమైన సీన్స్ లలో నటించి ప్రేక్షకుల మదిని దోచుకుందని చెప్పచ్చు.అన్విత తల్లి పాత్రలో నటించిన జయసుధ చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించారు. సిద్దు తల్లి, తండ్రులుగా మురళీ శర్మ, తులసి లు చక్కటి అభినయం ప్రదర్శించారు. ఫ్రెండ్ గా నటించిన అభినవ్ గోమటం ప్రేక్షకులకు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇంకా ఇందులో నటించిన దీప్తి తదితరులు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
రెగ్యులర్ కాన్సెప్ట్ కథలకు భిన్నంగా డోనార్ పాయింట్ యాడ్ చేసుకొని ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ తో ఒక్క ముద్దు కూడా పెట్టుకోకుండా, టచ్ కూడా చేయకున్నా కూడా ప్రేమ పుడుతుంది అనే ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ లాంటి ఆసక్తికర సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తూ సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలతో దర్శకుడు మహేష్ బాబు. పి. కొత్తదనం చూపించే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. రధన్ అందించిన సంగీతం గోపీసుందర్ నేపధ్య సంగీతం సినిమాకి పాజిటివ్ వైబ్స్ తీసుకువచ్చాయి నిర‌వ్ షా కెమెరా పనితనం మెచ్చుకోవచ్చు. కామెడీ, ఎమోషన్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పనితీరు బాగుంది. యువీ క్రియేష‌న్స్‌ పతాకంపై నిర్మాత‌లు వంశీ – ప్ర‌మోద్‌ లు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను చూద్దామని వచ్చిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా థియేటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు.

Cinemarangam.com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here