Romantic Love Entertainer ‘Vikram’ Movie Review

Cinemarangam.com
రివ్యూ రేటింగ్ : 3/5
సినిమా : “విక్రమ్”
బ్యానర్ నేమ్ :ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్ :నాగవర్మ బైర్రాజు
స్టోరీ, స్క్రీన్ ప్లే,డైలాగ్స్, డైరెక్షన్ :హరి చందన్
నటి నటులు :నాగవర్మ, దివ్య రావు, సూర్య, పృద్వి, వైజాగ్ ప్రసాద్,ఖయ్యుమ్, తాగుబోతు రమేష్, జ్యోతి, సురేష్,నట కుమారి, ఆదిత్య ఓం
మ్యూజిక్ డైరెక్టర్ :సురేష్ ప్రసాద్
సినిమాటోగ్రఫేర్ :వేణు మురళీధర్ వదనాల
ఆర్ట్ :బాబ్జి
కోరియోగ్రఫీ :సత్య -కపిల్ శర్మ
ఎడిటర్ :శ్రీను మెనగా

బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ పతాకంపై నాగవర్మ బైర్రాజు హీరోగా, దివ్యాసురేశ్ హీరోయిన్ గా, ఇంకా,ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్ నటీనటులు గా హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు నిర్మిస్తున్న చిత్రం “విక్రమ్” అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం తెలుగు లో “విక్రమ్” గా,తమిళ్ లో “మహావీరన్” గా  రెండు భాషల్లో మూడు రాష్ట్రాలలో ఈ నెల 31 న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం  ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం పదండి


కథ
విక్రమ్ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సమాజానికి దగ్గరగా… మనం నిత్యం చూసే వ్యక్తుల పాత్రలు మాదిరిగా సహజంగా ఉంటాయి. విక్రమ్ (నాగ వర్మ ) తండ్రి (సీనియర్ యాక్టర్ సూర్య ) తన కొడుకు  ఒక మంచి ఉద్యోగం చేస్తూ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. కాని విక్రమ్ సినిమా మీద వున్న ప్యాషన్ తో స్టోరీ లు వ్రాస్తూ ఒక ప్రొడ్యూసర్ దగ్గర పని చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ తన తండ్రి, హర్ష, హర్ష ఫ్రెండ్స్ ఇదే తన ప్రపంచం అనుకోని బతుకుతున్న తన జీవితంలోకి మహా లక్ష్మి (దివ్య రావ్ ) ఎంటరవుతుంది. అనాధ పిల్లలపై ఎంతో ప్రేమను చూపే మహా లక్ష్మి ని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు విక్రమ్.ఆ తరువాత ఒకరినొకరు ప్రేమించుకొన్న వీరిద్దరి లవ్ ఎందుకు బ్రేక్ అయ్యింది, వీరి మధ్యలో ఆదిత్య ఎందుకు ఎంటర్ అయ్యాడు, జగ్గు భాయ్ (పృథ్వి ) కి అలాగే జగ్గు బాయ్ దగ్గర వుండే శాంభవి (జ్యోతి ) కి ఈ స్టోరీ కి సంబంధం ఏమిటి చివరికి హీరో తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏం చేశాడు అన్నది తెలియాలి అంటే  సినిమా థియేటర్ కి వెళ్లి చూడవలసిందే.


నటీనటుల పనితీరు
విక్రమ్ గా నటించిన నాగ వర్మ కు ఇది మొదటి చిత్రమైనా ఎంతో ఈజీ గా చాలా చక్కగా నటించాడు. హీరోయిన్ దివ్యారావు మహాలక్ష్మి క్యారెక్టర్ లో చాలా మంచి పెర్ఫార్మన్స్ చేసింది .చాలా కాలం తరువాత తెరపై కనిపించిన  ఆదిత్య ఓం బిజినెస్ మెన్ గా,నెగిటివ్ క్యారక్టర్ లో కధ కి కీలక మలుపు తిరిగే పాత్ర లో చాలా మంచి క్యారక్టర్ చేసాడు,సీనియర్ నటుడు సురేష్ మరియు నట కుమారి హీరోయిన్ తల్లి తండ్రులు గా ప్రేమ పెళ్లి ని వ్యతిరేకించే పాత్రలు బాగా పండించారు,అలాగే హీరో ఫ్రెండ్స్ క్యారక్టర్లు ప్లే చేసిన ఖయ్యుమ్,తాగుబోతు రమేష్ లు కధ కి చాలా హెల్ప్ అయ్యారు అని చెప్పాలి, కధ లో ఒక ట్విస్ట్ లాగా వచ్చే ఒక పాయింట్ దగ్గర వచ్చే పృథ్వి, జ్యోతి లు జగ్గు భాయ్, శాంభవి ల తదితర నటీ నటులంతా వారికిచ్చిన పాత్రలలో నటించి మెప్పించారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు హరి చందన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని తనే అయ్యు  ప్రధాన పాత్రల భావోద్వేగాలు, బ్యాక్‌ డ్రాప్‌ సెటప్, పాత్రల ఎలివేషన్స్ చాలా బాగున్నాయి.మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు  తీసు కొచ్చిన దర్శకుడు హరి టెక్నికల్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.తనకి కావలసిన అవుట్ ఫుట్ అంత నటి నటులు దగ్గర మరియు టెక్నిషియన్స్ దగ్గర రాబట్టి సక్సెస్ అయ్యాడు. బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ బ్యానర్ ను స్థాపించి తనే హీరో మరియు ప్రొడ్యూసర్ గా చేసిన “విక్రమ్” మొదటి చిత్రమైనా కథను పై తనకున్న కాన్ఫిడెన్స్ తో సినిమా కి అయ్యో ఖర్చు  ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదని ఈ సినిమా చూసిన వారు ఎవరైనా చెబుతారు.సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మంచి సంగీతం అందించాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్య లో వచ్చే లవ్ సాంగ్స్ అలాగే బ్రేక్ అప్ సాంగ్ తో పాటు ఇందులో ఉన్న పాటలన్ని బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫేర్ వేణు మురళిదర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటర్ శ్రీను మెనగా పనితీరు బాగుంది. కోరియోగ్రాఫేర్ సత్య -కపిల్ శర్మ చాలా మంచి స్టెప్స్ వేయించారు,ఆర్ట్ డైరెక్టర్ బాబ్జి సినిమా కి తన వంతు కృషి చేసాడు, ఈ”విక్రమ్” సినిమాను  బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు.

Cinemarangam.com..Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here