Romantic Thriller Comedy Entertainer ‘Induvadana’ Review

Cinemarangam.com
రివ్యూ రేటింగ్ : 3.25/5
స‌మ‌ర్ప‌ణ:  నైనిష్య & సాత్విక్
బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్
నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి
కో. ప్రొడ్యూసర్: గిరిధర్
లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ
దర్శకుడు: MSR
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి
నటీనటులు: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు
సంగీతం: శివ కాకాని
కో డైరెక్టర్: ఉదయ్ రాజ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: వై నాగు
లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

`హ్యాపీడేస్‌`,`కొత్తబంగారులోకం` చిత్రాలతో సంచలనం నుష్టించి తెలుగు ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అమ్మాయిల గుండెల్లో లవర్‌ బాయ్‌గా మారిపోయాడు వరుణ్‌ సందేశ్‌. తరువాత తను చేసిన సినిమాలు ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోవడంతో  హీరోయిన్ వితిక శేరు ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం గ్యాప్ తరువాత వరుణ్ డీఫ్రెంట్ లుక్ తో ఫారెస్ట్ ఆఫీసర్ గా “ఇందువదన” చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై  వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం “ఇందువదన”. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరు స్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నూతన సంవత్సర శుభా కాంక్షలు తో జనవరి 1న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌ లో రిలీజ్ అయిన ఈ చిత్రం  ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం పదండి

కథ
చిత్ర హీరోయిన్ ఇందు(ఫర్నాజ్ శెట్టి) ను చంపడంతో  ‘ఇందు’ ఆత్మగా మారి మిమ్మల్ని ఎవరినీ వదిలి పెట్టను అని చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది.అగ్రహారంలో వుండే బ్రాహ్మణ కులానికి చెందిన సురేఖ వాణి, శాస్త్రి (నాగినీడు) దంపతులకు ఇద్దరు కుమారులు వీరిలో చిన్నబ్బాయి వాసు (వరుణ్ సందేశ్), పెద్దబ్బాయి రామానుజం (సర్పంచ్) . అయితే వాసు (వరుణ్ సందేశ్) శేషాచలం అడవుల్లో పోలీస్ ఆఫీసర్ గా అడవుల్లోకి కలప,గంధపు చెట్లను నరికి అక్రమ స్మగ్లింగ్ చేస్తున్న వారిని అడ్డుకుంటూ ఉంటాడు. వాసుకు తోడుగా ధనరాజ్ (తూగో),  మహేష్ విట్ట  (నెళ్ళు), పార్వతీషం ( సిక్కు), జెర్సీ మోహన్ (నైజాం) ఫారెస్ట్ లో బీట్ కానిస్టేబుల్స్ గా అడవి (రఘు బాబు) ఇంఫార్మర్ గా ఫారెస్ట్ లో పనిచేస్తుంటారు.అదే అడవిలో వుండే మంగాడి జాతి గూడేనికి చెందిన  ఇందు(ఫర్నాజ్ శెట్టి) ని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.ఆ తరువాత గూడెం వారిని ఎదిరించి ఫ్రెండ్స్ సహాయం తో పెళ్లి చేసుకొని అగ్రహారం కు తీసుకువస్తాడు. గిరిజన అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చిన వాసు,ఇందు ల పెళ్లిని  వాసు తల్లి, తండ్రులు సురేఖ వాణి, శాస్త్రి (నాగినీడు) లు వీరి పెళ్లికి వ్యతిరేకించి ఊరి నుండి వెలివేస్తారు.దాంతో ఊరి చివరన వుండే పూరి గుడిసెలో కాపురం పెడతారు.ఆ తరువాత ఫారెస్ట్ డ్యూటీ కెళ్ళే క్రమంలో సారాయి కొట్టు నడుపుతున్న వీరమ్మకు (జ్యోతి) కి తన భార్య ఇందును అప్పజెప్పి ఫారెస్ట్ కు వెళతాడు.ఫారెస్ట్ నుండి ఫ్రెండ్స్ తో తిరిగి వచ్చేసరికి ఇందు ను హత్యకు గురైందని తెలుసు కొంటాడు. ప్రాణంగా ప్రేమించిన ఇందు తనతో లేదని తెలుసుకున్న వాసు ఏం చేశాడు ? ఇందు ఎందుకు హత్యకు గురైంది? ఇందును ఎవరు హత్య చేశారు? ఆత్మ గా మారిన ఇందు తనని చంపిన వారిపై పగ తీర్చుకుందా..లేదా.. అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడవలసిందే…


నటీనటుల పనితీరు
వరుణ్ సందేశ్‌ను ఇప్పటి వరకు కేవలం లవర్ బాయ్‌గానే చూపించారు దర్శకులు. కానీ ఇందువదన చిత్రంలో   ఇప్పటి వరకు తను చెయ్యని కొత్త లుక్ లో కనిపించాడు.. తన గెటప్ నుంచి నటన వరకు వేరియేషన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. యాక్షన్ సీన్స్ నుంచి ఎమోషనల్ వరకు బాగానే చేసాడు. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కొత్త హీరోయిన్ అయినా కూడా చాలా బాగుంది. గ్లామర్‌తోనే కాకుండా నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది. వాసు తల్లిదండ్రులు గా సురేఖ వాణి, శాస్త్రి (నాగినీడు) కీలక పాత్రలలో నటించారు.అగ్రహారంలో పోస్ట్ మ్యాన్ గా (తాగుబోతు రమేష్), నకిలీ మాంత్రికుడు గా(అలీ),,మహేష్ విట్టా, పార్వతీశం, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ కారెక్టర్స్ సరదాగా ఉన్నాయి. ఇందుకు బందించ డానికి కాశీ నుండి వచ్చిన అఘోర స్వామి గా (అంబరిష్) ఇలా అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు శ్రీనివాస రాజు కాస్త రెగ్యూలర్‌ స్టోరీ అయినా కొత్తగా ప్రజెంట్‌ చేశాడు. కొత్త దర్శకుడైనా అనుభవం ఉన్న డైరెక్టర్‌లా తెరకెక్కించారు. హీరోయిన్‌ కారెక్టర్ బాగా రాసుకున్నాడు దర్శకులు. అలాగే వరుణ్‌ను కొత్తగా చూపించాడు.లవ్‌, ఎమోషనల్‌ సీన్స్ సినిమాకి ప్లస్‌ పాయింట్స్. అయితే కథపై ఇంకాస్త వర్క్ చేసుంటే బాగుండేది. హార్రర్, థ్రిల్లర్స్ తెలుగులో చాలానే వచ్చాయి కాబట్టి అదే ఛాయలు ఇందులో కనిపించాయి.  సంగీత దర్శకుడు శివ కాకాని మ్యూజిక్ బాగుంది. వడివడిగా సుడిగాలి గా వచ్చి పాట హైలెట్ గా నిలుస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ బీ మురళీకృష్ణ పనితీరు బాగుంది. సీన్స్ రిచ్‌గా అనిపిస్తాయి. బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఏక్కడా రాజీపడకుండా నిర్మించారు. నిర్మాత మాధవి ఆదుర్తి నిర్మాణ విలువలు బాగున్నాయి.ఈ ”ఇందువదన” సినిమాను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు.

Cinemarangam.com..Rating. 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here