Romantic Youth Full Crime Comedy ‘RaajahYogam’ Movie Review

Cinemarangam. Com
బ్యానర్స్ : శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్
సినిమా : “రాజయోగం ”
విడుదల : 30.12.2022
రివ్యూ రేటింగ్ : 3/5
నిర్మాత – మణి లక్ష్మణ్ రావు,
సహ నిర్మాతలు – డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్,
రచన దర్శకత్వం – రామ్ గణపతి.
నటీ నటులు :అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు
సినిమాటోగ్రఫీ – విజయ్ సి కుమార్,
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్,
సంగీతం – అరుణ్ మురళీధరన్,
డైలాగ్స్ – చింతపల్లి రమణ,
పీఆర్వో – జీఎస్కే మీడియా,

క్రైం కామెడీ చిత్రాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. అందులో కాస్త యూత్ ని ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేషాలుంటే చాలు… ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టయినట్టే. అందుకే దర్శకులు ఇలాంటి కథలను ఎన్ని కోణాల్లోనైనా తీయడానికి రెడీ అవుతుంటారు.ప్రస్తుత యూత్ కు అనుగుణంగా ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందించిన తాజా చిత్రమే “రాజయోగం”. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 30న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో తెలుసుకోవాలి అంటే “రాజయోగం” రివ్యూ చూద్దాం పదండి..

కథ

సాధారణ కుటుంబానికి చెందిన రిషి (సాయి రోనక్) జబర్దస్త్ అప్పారావు దగ్గర కారు మెకానిక్ గా పనిచేస్తూ ఎలాగైనా గొప్పింటి అమ్మాయిని ప్రేమించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాడు. అయితే ఒకరోజు కార్ డెలివరీ ఇచ్చే పర్సన్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడంతో ఆ కారును డెలివరీ ఇవ్వడానిజీ ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్తాడు.అయితే రిషి ఆ కారును సెల్లార్లో పెట్టి కార్ లో ఉండే బ్రీఫ్ కేసు తీసుకొని రూమ్ లో పెట్టి రావాలని చెప్తారు. ఆ స్టార్ హోటల్ కు వెళ్లిన రిషి కు అక్కడి ప్లేస్ నచ్చుతుంది. దాంతో ఓనర్ కూడా నాలుగు రోజుల వరకు రాడని తెలియడంతో తను అక్కడ ఓనర్ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాడు. అదే హోటల్ కు వచ్చిన రిచ్ గర్ల్ అయిన శ్రీ (అంకిత సాహా ) రిషికి పరిచయం అవుతుంది.ఈ అమ్మాయిని ప్రేమించి కోటేశ్వరుడు అవ్వచ్చు అనుకొని ఆ అమ్మాయిని ఇంప్రెస్స్ చేయాలని చూస్తాడు.దాంతో ఒకరోజు తనను బయటకు తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేస్తాడు. దాంతో రిషిని ప్రేమించడం మొదలు పెడుతుంది. దాంతో వీరుద్దరు ఒక నైట్ ఒక్కటవుతారు. దాంతో రిషి తను కన్న కల నిజమైంది అనుకున్న మరుసటి రోజు శ్రీ వచ్చి రిషికి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. దాంతో షాక్ అయిన రిషి నిన్ను చాలా సిన్సియర్స్ గా ప్రేమిస్తున్నాను నిన్ను చాలా బాగా చూసుకుంటానని ఎంత చెప్పినా వినకుండా రిషికి బ్రేకప్ చెప్పి డ్యానియల్ (సిజ్జు ) దగ్గర ఉన్న 50 వేల కోట్ల వజ్రాన్ని చేజిక్కుంచుకోవాలని తిరిగే రాధా (అజయ్ ఘోష్) కు దగ్గరవుతుంది. ఆ తరువాత డ్యానియల్ (సిజ్జు ) లకు దగ్గరవుతుంది. దీంతో శ్రీ కు ప్రేమ కంటే డబ్బునే ఎక్కువ ప్రేమిస్తుందని, తన దగ్గర డబ్బు లేదని తెలుసుకొని వెళ్ళిపోయిందని, డబ్బు కంటే ప్రేమ ముఖ్యమని శ్రీ కు తెలిసేలా మంచి గుణపాఠం నేర్పాలని ప్లాన్ చేస్తాడు.ఈ క్రమంలో రిషికి ఐశ్వర్య(బిస్మి నాస్) పరిచయం అయ్యి వజ్రాల గురించి రిషికి చెప్పడం జరుగుతుంది. దాంతో రాధా, డ్యానియల్ ల దగ్గర ఉన్న 50 వేల కోట్ల డైమండ్ ను చేజిక్కుంచు కోవాలని రిషి ప్లాన్ చేసే క్రమంలో రాధా నుండి డ్యానియల్ నుండి రిషి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? శ్రీ నిజమైన కోటేశ్వరురాలా కాదా? శ్రీ కి రిషి ఎలాంటి గుణపాఠం నేర్పాడు? ఈ వజ్రాలకు ఐశ్వర్య అనే అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి? రిషి కి డైమండ్ దక్కుతుందా లేక ప్రేమ దక్కుతుందా..చివరకు ఆ వజ్రం ఎవరికీ దొరికింది ఆ రాజయోగం ఎవరికీ వరించింది అనే ఫుల్ ఎక్సైట్ మెంట్ ఉన్న సినిమా చూడాలి అంటే “రాజయోగం” కచ్చితంగా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు

రిషి పాత్రలో నటించిన హీరో సాయి రోనక్ . డ్యాన్సులు ఫైట్స్, రొమాన్స్, లిప్ లాక్ సీన్స్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్ లో చాలా బాగా నటించి మెప్పించాడు. ఇప్పటివరకు సాయి రోనక్ చేసిన సినిమాలకు భిన్నంగా ఇందులో ఫస్ట్ టైం యాక్షన్ సన్నివేశాలలో బాగా ఎక్స్ పోజ్ చేశాడు. ఇలాంటి మూవీలు దొరకడం వలన సాయిరోనక్ లోని మల్టీ ట్యాలెంట్ ను నిరూపించుకొనే అవకాశం వస్తుంది. ఆలా వచ్చిన అవకాశాన్ని సాయి రోనక్ చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. హీరోయిన్ అంకిత సాహా బాంబే నుంచి వచ్చిన అమ్మాయి అయినా లిప్ లాక్, రొమాన్స్ చేసే విషయంలో ఏ మాత్రం సిగ్గుపడకుండా తన అందాన్ని, అభినయాన్ని ప్రదర్శించి అందరినీ కవ్వించింది అని చెప్పవచ్చు . సెకెండ్ లీడ్ రోల్ లో నటించిన కేరళ కుట్టి బిస్మి నాస్ కూడా ఐశ్వర్య పాత్రలో చాలా ఇన్నోసెంట్ పాత్రలో నటించి మెప్పించింది. కామెడీ సీన్స్ లలో షకలక శంకర్ తాగుబోతు రమేష్, మధు నందన్, అజయ్ ఘోష్, గిరిధర్, ప్రవీణ్, భద్రం, చిత్రం శ్రీను నెమలి శ్రీను వంటి వారితో సరదా సన్నివేశాలను తీసి చాలా కాలం తరువాత ప్రేక్షకులను బాగా నవ్వించారు. అజయ్ ఘోష్ కు స్ట్రెస్ కు గురైనప్పుడు కళ్ళు కనిపించవు. అప్పుడు స్ట్రెస్ బాల్ నలిపితే స్ట్రెస్ తగ్గి కళ్ళు కనిపిస్తాయి. అందుకు అరచేతిలో స్ట్రెస్ బాల్ ను నలిపే సీన్స్ తో ఆడియన్స్ ను బాగా నవ్వించారు. ఈ సీన్స్ వచ్చినప్పుడల్లా థియేటర్స్ లలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. విలన్ పాత్రలో నటించిన సిజ్జు చాలా బాగా నటించాడు. క్లైమాక్స్ లో వజ్రం ను దక్కించుకోవడానికి సిజ్జు, అజయ్ ఘోష్, లు పడే తపన పోలీస్ క్యారెక్టర్ లో జీవించేసిన తాగుబోతు రమేష్, షకలక శంకర్ ల కామెడీ, వీరందరితో కలసి సాయి రోనక్ ల మధ్య సాగే క్లైమాక్స్ కామెడీ బాగా నవ్విస్తుంది.


సాంకేతిక నిపుణుల పనితీరు

స్టార్ హోటల్ లో స్టే చేసే నాలుగు రోజుల్లో వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేటటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కలిగించే రొమాంటిక్ క్రైం కామెడీ కథను ఎంచుకుని యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా చాలా చక్కగా తెరకెక్కించాడు డైరెక్టర్ రామ్ గణపతి… ఇందులో చాలా మంది కమెడియన్స్ పెట్టుకొని 30 రోజుల్లో సినిమా చేయడమనేది బిగ్ చాలెంజ్, తక్కువ బడ్జెట్ లో చాలా రిస్క్ తీసుకొని చాలా బాగా చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ అరుణ మురళీధరన్ అందించిన సంగీతం బాగుంది. సిధ్ శ్రీరామ్ తో పాడిన రాసి పెట్టి ఉన్నట్టుందే, రాజయోగం వచ్చేసిందే అనే రొమాంటిక్ సాంగ్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ కెమెరా పని తనం అద్భుతం అని చెప్పవచ్చు. పాల్ ప్రవీణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పని తీరు బాగుంది , చింతపల్లి రమణ ఇచ్చిన మాటలు బాగున్నాయి శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మాత మణి లక్ష్మణ్ రావు మరియు సహ నిర్మాతలు నందకిషోర్ దారక్, డాక్టర్ శ్యామ్ లోహియాలు సంయుక్తంగా కలసి ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.ఈ “రాజయోగం” సినిమా చూసిన వారు ఎమోషన్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారని కచ్చితంగా చెప్పవచ్చు.

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here