‘Rudrangi’ Movie Review

Cinemarangam. Com
బ్యానర్ : రసమయి ఫిలిమ్స్,
సినిమా : “రుద్రంగి “
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 07.07.2023
నిర్మాత: రసమయి బాలకిషన్  
దర్శకత్వం: అజయ్ సామ్రాట్
నటీ నటులు : జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధి, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్, ఆర్.ఎస్. నందా, దివి వడ్త్య (స్పెషల్ అప్పీరెన్స్), రసమయి బాలకిషన్ (స్పెషల్ అప్పీరెన్స్) తదితరులు
మ్యూజిక్: నౌఫల్ గాంధి
సినిమాటోగ్రఫీ: సంతోష్ శానమోని
ఎడిటింగ్: బొంతాల నాగేశ్వరరెడ్డి
పి.ఆర్.ఓ : జి.యస్.కె మీడియా

రసమయి ఫిలిమ్స్ పతాకంపై జగపతిబాబు ముఖ్య పాత్రలో మమత మోహన్ దాస్, విమల రామన్‌లు నటీ నటులుగా అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో రసమయి బాలకిషన్ నిర్మించిన చిత్రం “రుద్రంగి”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 7న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది.మరి ఆడియన్స్ ను ఈ చిత్రం ఎలా ఎంటర్టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి


కథ
తెలంగాణ లో దొరల పాలన సాగుతున్న టైంలో రుద్రంగి అనే సంస్థానంలో దొర భీంరావ్ దేశ్‌ముఖ్ (జగపతిబాబు)కు మదపిచ్చి ఎక్కువ. భార్య మీరాబాయి (విమలా రామన్) ఉండగానే జ్వాలాబాయి (మమతా మోహన్‌దాస్)ని రెండో భార్యగా తీసుకువస్తాడు. అదే సంస్థానంలో ఉన్న మల్లేష్ (ఆశిష్ గాంధీ), రుద్రంగి(గానవి లక్ష్మణ్) లిద్దరు బావా మరదళ్లు వీరి తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో తాత దగ్గర పెరుగుతారు. అయితే తనకు వయసు అయిపోతున్నందున వీరిద్దరికీ చిన్నప్పుడే పెళ్లిచేస్తాడు. అయితే ఒకరోజు దొరగా చెలామణి అవుతున్న భుజంగరావు (కాలకేయ ప్రభాకర్) తను చెప్పిన మాట వినలేదన్న కారణంతో మల్లేష్ తాతను కొట్టి చంపేస్తాడు. దాంతో తన తాతను చంపిన దొరపై మల్లేష్ దాడికి దిగి రాయితో కొట్టి అక్కడినుండి పారిపోతాడు.భీంరావ్‌ దొరపై శత్రుత్వం పెంచుకున్న భుజంగరావు దొర తన మనుషులతో దాడిచేసి భీంరావ్‌ ను చంపాలను కున్నప్పుడు మల్లేశ్ కాపాడతాడు.తనను కాపాడిన మల్లేశ్‌ను ను ఇంటికి తీసుకొచ్చి పెంచుతాడు భీంరావ్. 15 యేళ్ల తరువాత . ఒకసారి అడవిలో వేటకు వెళ్లిన బీం రావ్ కు అదే అడవిలో అందంగా ఉన్న రుద్రంగి ని చూసి ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నం చేయగా ఆమె తప్పించుకుంటుంది. ఆమెను పట్టి తీసుకొని రావాలని మల్లేశ్ కు చెపుతాడు భీంరావ్. తనను తీసుకురావాలని వెళ్లిన మల్లేష్ కు రుద్రంగి ఎవరో కాదు చిన్నప్పుడు తను పెళ్లిచేసుకున్న భార్య అని తెలుసుకుంటాడు.దాంతో ఆమెను తన భార్యగా దొరకు పరిచయం చేస్తాడు మల్లేశ్. రుద్రంగిని ఎలాగైనా అనుభవించాలి అనుకున్న బీం రావ్ దొర రుంద్రంగిని ఏం చేశాడు? ఎంతో క్రూరుడు అయిన బీం రావ్ భారినుండి రుద్రంగిని మల్లేష్ ఎలా కాపాడుకున్నాడా లేక బలయ్యారా ? మల్లేశ్‌పై మనసుపడ్డ జ్వాలాబాయి తనకు ఏం చేసింది?..అనే విషయాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “రుద్రంగి” సినిమాను చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
భీంరావ్ దొర పాత్రలో నటించిన జగపతిబాబు తన క్రూరత్వం అంటే ఎలా ఉంటుందనే మరో కోణాన్ని ఈ సినిమాలో చూపించాడు. తనని తప్ప వేరే వారిని ఉహించుకోలేం అనేంత గొప్ప గా నటించాడు. మల్లేష్ పాత్రలో నటించిన ఆశిష్ గాంధి తన నటనతో ఆకట్టుకున్నాడు.జ్వాలాబాయి పాత్రలో మమతా మోహన్‌దాస్, మీరాబాయి పాత్రలో విమలా రామన్ లు ఇద్దరూ తమ అభినయంతో గొప్పగా నటించారు.రుద్రంగి పాత్రలో నటించిన కన్నడ తార గానవి లక్ష్మణ్ తన అందం అభినయంతో చక్కగా నటించి మెప్పించింది. భుజంగరావు పాత్రలో కాలకేయ ప్రభాకర్ చాలా బాగా నటించాడు కరణం క్యారెక్టర్‌లో ఆర్.ఎస్. నందా ఇలా ఈ సినిమాలో నటించిన వారందరూ వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
తెలంగాణలో దొరల నేపథ్యంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మ, సమ్మక్క సారక్క, రాజన్న వంటి సినిమాలు వచ్చి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇప్పుడు మళ్ళీ అలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు అజయ్ సామ్రాట్. 1940-60 మధ్య కాలంలో దొరల కథను సెలెక్ట్ చేసుకొని తీసిన సన్నివేశాలు, వాటిని చిత్రీకరించిన తీరు ఒక కొత్త దర్శకుడు తీసినట్లుగా కాక,ఎన్నో సినిమాలు తీసిన దర్శకుడిగా తీసి సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ చిత్రానికి నౌఫల్ గాంధి చక్కని సంగీతం అందించాడు. నౌఫల్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ పరవాలేదు. సంతోష్ శానమోని అందించిన కెమెరా పనితనం అద్భుతం అని చెప్పవచ్చు. బొంతాల నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ పనితీరు బాగుంది.రసమయి ఫిలిమ్స్ పతాకంపై ఖర్చుకు వెనుకడకుండా రసమయి బాలకిషన్  నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి . ఇండియాకు స్వాతంత్రం రాకముందు తెలంగాణలో నైజాం అరాచకాలు, దొరల బానిసత్వం గురించి తెలుపుతూ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రుద్రంగి సినిమా మాత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి నిస్తుందని కచ్చితంగా చెప్పచ్చు .

Cinemarangam.Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here