‘Ruler’ Movie Review

Release date : December 20, 2019
Cinemarangam.com.. Rating : 2.5/5
Movie name:-”Ruler”
Presented:-Ck Entertainment
Banners:-Happy Movies
Starring : Balakrishna, Sonal Chauhan, Vedhika,Bhumika Chawla, Prakash Raj
Editor :  John Abraham
Cinematography : C Ram Prasad
Music Director :Chirantan Bhatt
Director :  K. S. Ravikumar
Producers :  C. Kalyan

గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్ననందమూరి బాలయ్య ‘కథానాయకుడు’ మరియు ‘మహా నాయకుడు’ వంటి రెండు పరాజయాల తర్వాత చేస్తున్న సినిమా ‘రూలర్’. యాక్షన్ ఎంటర్ టైనర్ రూపంలో తెరకెక్కిన ఈ సినిమాపై నందమూరి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.బాలకృష్ణ కెరీర్లో ‘జై సింహా’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 105వ చిత్రం ‘రూలర్’ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంలో వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా బాలకృష్ణ సంక్రాంతికి ముందే సినిమా డిసెంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. సినిమాలో విభిన్నమైన పాత్రలో బాలకృష్ణ నటించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి సినిమా హాల్ దగ్గర అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ ఈరోజే విడుదల అయ్యింది.మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇపుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతుల కోసం పోరాడిన స్టోరీగా డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ ‘రూలర్’ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య బాబు ఉత్తరప్రదేశ్ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్న తరుణంలో రెండువేల రైతు కుటుంబాల కోసం ఓ బడా కంపెనీ సీఈఓగా బాలకృష్ణ ఎలా మారాడు అదేవిధంగా సినిమాలో ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ రైతుల కోసం సినిమా లో ఏం చేశారు అనేది చాలా సస్పెన్స్ గా తెరకెక్కించాడు డైరెక్టర్. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ధర్మ అసలు రైతుల కోసం ఎందుకు పోరాడాడు అనేది సినిమా తెరపై చూడాల్సిందే .

జయసుధ (సరోజినీ ప్రసాద్) పెద్ద ఐటీ బిజినెస్ మాగ్నెట్. అయితే ఆమె తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలయ్యను చూసి కాపాడుతుంది. గతం మర్చిపోయిన అతన్ని తన కొడుకుగా మార్చుకుని అతనికి అర్జున్ ప్రసాద్ అని పెట్టి అమెరికా పంపించి బిజినెస్ మెన్ గా తయారుచేస్తోంది. అర్జున్ ప్రసాద్ (బాలయ్య) ఆమె కంపెనీని నెంబర్ వన్ పోజిషన్ లో పెడతాడు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో తన కంపెనీ మొదలుపెట్టి ఆపేసిన ఓ ప్రాజెక్ట్ ను మళ్ళీ స్టార్ట్ చేసే ప్రాసెస్ లో.. అక్కడ తన తల్లికి (జయసుధ) జరిగిన అవమానం గురించి తెలుస్తుంది. దానితో అర్జున్ ప్రసాద్ తన తల్లిని అవమానించిన వారిని టార్గెట్ చేసి మరి వారిని కొడతాడు. అయితే అంతలో కొన్ని ఊహించని క్యారెక్టర్స్ అతని జీవితంలోకి వస్తాయి. తనని అక్కడి వారందరూ ధర్మ అని పిలుస్తూ పోలీస్ ఆఫీసర్ ధర్మ గురించి చెబుతారు. ఇంతకీ ధర్మ ఎవరు? అంతేకాకుండా సినిమాలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కూతుర్ని ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ఎందుకు కాపాడాల్సి వచ్చింది.ధర్మకు నిరంజన (భూమిక)కు ఉన్న సంబంధం ఏమిటి? అసలు పోలీస్ ఆఫీసర్ ధర్మ గతం ఏమిటి? దేని కోసం అతను పోరాడాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: 

దర్శకుడు కె.యస్ రవికుమార్ రొటీన్ కథని ఎన్నుకొన్నాడు. దాన్నిఅంతే రొటీన్ గా తెరకెక్కించాడు. ఇప్పుడు బీసీ కాలం నాటి కథని ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా లేరు. అసలు తెలుగు రైతులని యూపీ ప్రభుత్వానికి లింకు చేయడమే సరిగ్గాలేదు.ఒక్కటి కొత్త సీన్ కనబడదు.అంతేకాదు.. బాలయ్య గత సినిమాల్లోని సీన్స్ ని ఇందులో మిక్స్ చేశాడు.అసలు దర్శకుడు ఈ కథ-కథనంపై ఏమాత్రం ఫోకస్ పెట్టలేదు. కనీసం బాలయ్యకి విగ్గుకూడా సరిగ్గా సెట్ చేయలేకపోయాడు .అయితే, ‘రూలర్’ ట్రైలర్ వచ్చిన తరవాత బాలకృష్ణ పోలీస్ గెటప్‌పై విమర్శలు వచ్చాయి.ఈ పాత్రలో బాలయ్య విగ్ అస్సలు బాగాలేదని చాలా మంది పెదవి విరిచారు. నిజానికి బాలకృష్ణ అభిమానులకు కూడా ఈ విగ్ నచ్చలేదు. కాకపోతే వాళ్లు ఎక్కడా ఆ విషయం మాట్లాడరు. కానీ, ఒక అభిమాని మాత్రం ఈ విషయాన్ని మనసులో దాచుకోలేకపోయాడు.తన బాధను, ఆవేదనను సోషల్ మీడియాలో పెట్టేశాడు. ‘రూలర్’ సినిమా చూసిన తరవాత తన అభిమాన హీరోను ఉద్దేశించి, ఆయనకు పలు రకాల సూచనలు చేస్తూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ”జై బాలయ్య జై బాలయ్య… ఏందయ్యా బాలయ్య బాబు మీ ఆ విగ్గులు మోజు తగలెయ్య ఈ వయసులో కుర్రాళ్ళతో పోటీగా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పిస్తున్నావు.

కుర్రాడిలా తగ్గి అందంగా తయారై ఆ ఫిజిక్ ఏంటి ఎలా సాధ్యం అని అందరూ ముక్కున వేలేసుకుని శభాష్ బాలయ్య అనేటట్టుగా మీ రూపం ఉంది. మీరు ఏం చేస్తున్నారండి.. మీ దగ్గరికి కథలు పట్టుకు వచ్చేవాడిని కత్తితో కండకండాలుగా నరికేయాలి. ఆ సెట్టింగులేంటి…

అంత తొందరగా సినిమా ఎవరు తీయమన్నారు బాల బాబు. ఆ కాస్ట్యూమ్స్ ఏంటండి బాబు. కాస్త శ్రద్ధ తీసుకోండి. మీ పక్కన హీరోయిన్లకి కాస్త కండ ఉండేటట్లు చూడండి బాల బాబు.

ఇంకా కె.ఎస్.రవికుమార్ లాంటి డైరెక్టర్లను పట్టుకొని వేలాడుతున్నారు ఏంటండి. ఆ ఆర్టిస్టుల ఎంపిక ఏంటండి. పాప బీతితో అందరికీ మాట ఇచ్చేస్తారు. అట్లా కాదండి.

మీ నటన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాస్త ఆలోచించండి బాలయ్య. మీ ఒరిజినల్ గెటప్‌తో వచ్చినా ప్రజలు నీరాజనాలు పడతారు. ఎందుకంటే మీదంతా ఒరిజినల్లే మీకు నటించడం రాదండి.నటించడం రాదు అంటే నటన రాదు అని కాదు అండి. ఒకటే మంచి విగ్గు పర్మినెంట్‌గా ఉంచేయండి. ఒక్కమగాడులో విగ్గు మీకు భలే సూట్ అయిందండి. అదే కంటిన్యూ చేయండి బాలయ్యబాబు.అందులో అందంగా ఉన్నారు. సినిమా బాగుందండి. మాకు బాగుంటే సరిపోదండి. మీ విశ్వరూపానికి తగ్గ కథ దొరికి, ఎప్పుడూ మాకు ఫుల్ మీల్స్ భోజనమే తినాలనిపిస్తుంది.

అయ్యా బాలయ్య అభిమానులారా నన్ను అపార్థం చేసుకోకండి. బాలయ్యకు వీరాభిమానిని. నేను కూడా మీలాగా బాలయ్య అభిమానినే. నా ప్రొఫైల్లో జూనియర్ బొమ్మలు చూసి అపార్థం చేసుకోకండి. నేను నందమూరి కుటుంబ అభిమానిని. జై బాలయ్య జై జై బాలయ్య” ………..అని సుధీర్ఘంగా రాసుకొచ్చాడు ఆ అభిమాని. .

బాలయ్య మాత్రం అభిమానులని నిరాశపరచలేదు. తనదైన మార్క్ యాక్షన్, డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. బాలయ్య డ్యాన్స్ బోనస్. చాలా హుశారుగా స్టెప్పులేశాడు.హీరోయిన్లు అందంగా కనిపించారు. సోనాల్ బికినీ ట్రీట్ బాగుంది. మిగితా నటీనటుల గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.దర్శకుడు కె ఎస్ రవికుమార్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు.దర్శకుడు టేకింగ్ తో ఆకట్టుకున్నా స్క్రిప్ట్ పరంగా మాత్రం పరుచూరి మురళి పూర్తిగా న్యాయం చేయలేకపోయారు.ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరోలా ఉండేది. అలాగే బాలయ్య చేసిన ధర్మ పాత్ర లుక్ ను దర్శకుడు ఇంకా అందంగా చూపించొచ్చు.అర్జున్ ప్రసాద్ గా,ధర్మ గా పాత్రకు బాలకృష్ణ తనదైన న్యాయం చేశారు, డాన్స్ లు అయితే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి,ఈ ఏజ్ లో కూడా బాలయ్య ఈజీ గా చేయడం ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది.ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేసిన రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు చిరoతన్ బట్  అందించిన నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ చాలా బాగుంటాయి.నిర్మాత సి కళ్యాణ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.హీరోహిన్స్ తనదైన పాత్ర మేరకు బాగానే చేశారు, భూమిక కీలకమైన పాత్రలో అద్భుతమైన పెరఫార్మన్స్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాకి మరో ప్లస్ అని చెప్పొచ్చు.మొత్తానికి ఈ సినిమా మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే పక్క మాస్ ఫిల్మ్,ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.

cinema Rangam..Rating..2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here