Kiran Abbavaram,Neha Shetty’s hilarious Comedy entertainer ‘Rules Ranjann’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “ రూల్స్ రంజన్ ”
విడుదల తేదీ : అక్టోబర్ 06, 2023
రివ్యూ రేటింగ్ : 3 /5
సమర్పణ: ఏఎం రత్నం
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
నటీ నటులు : కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ తదితరులు
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

రాజా వారు రాణి గారు’, ‘SR కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి . అమ్రిష్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని గ్రాండ్ గా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి


కథ
రంజన్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయన పెట్టుకున్న రూల్స్ కి ఆ కంపెనీలో అందరూ అతని రూల్స్ రంజన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో హీరోయిన్ నేహా శెట్టి అదే కంపెనీలో పనిచేస్తూ ఆయనకి మంచి ఫ్రెండ్ గా మారుతుంది. ఇక హీరోయిన్ ద్వారా హీరో పడిన కష్టాలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవలు ఏంటి, అలాగే వాళ్ళిద్దరూ చివరికి కలుస్తారా లేదా విడిపోతారా అనే ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ డైరెక్టర్ రత్నం కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే హీరో ఇవన్నీ ప్రాబ్లంలని సాల్వ్ చేశాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
రంజన్ గా నటించిన కిరణ్ అబ్బవరం యాక్టింగ్ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో చాలా వరకు బెటర్ గా ఉంది. ఈయన చేసిన ప్రతి సీన్ కి కూడా న్యాయం చేస్తూ నటుడిగా ఒక మెచ్యూర్డ్ పర్ఫామెన్స్ ని ఇచ్చాడనే చెప్పాలి…హీరోయిన్ గా చేసిన నేహా శెట్టి తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయింది.తన నటనతో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. సెకండ్ హీరోయిన్ గా నటించిన మెహర్ చాహెల్ కూడా తన పరిధి మేరకు చాలా బాగా నటించింది.రంజన్ కు ఫ్రెండ్స్ గా నటించిన హైపర్ ఆది,సుదర్శన్ ,వెన్నెల కిషోర్ ల కామెడీ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది..అజయ్, అభిమన్యు సింగ్ లను కూడా ఈ సినిమా లో బాగా నటించారు..ఇంకా ఇందులో నటించిన వారంతా తమ పరిదిమేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
డైరెక్టర్ రత్నం కృష్ణ ఈ సినిమాకి సంబంధించిన ఇంటెన్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా అటు ఎమోషన్ ని, ఇటు కామెడీ ని రెండిటిని బ్యాలెన్స్డ్ చేసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రేక్షకుడికి ఎలాంటి సినిమా అయితే కావాలో ఆలా ప్రతి సీన్ ను తెలుగు ప్రేక్షకులకు చూపించడంలో దర్శకుడు రత్నం కృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన అంబ్రిష్ గణేష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. సమ్మోహనుడా అనే సాంగ్ మాత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అయితే ఈ సాంగ్ విజువల్ గా చూసినప్పుడు కూడా ప్రేక్షకుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు …అలాగే ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. దులీప్ కుమార్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, వరప్రసాద్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి లు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిన “రూల్స్ రంజన్” సినిమాకు వచ్చిన వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్అవ్వడమే కాకుండా రెండున్నర గంటలు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.థియేటర్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ మంచి అనుభూతితో థియేటర్ నుండి బయటకి వస్తారు

Cinemarangam.Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here