RVG Productions No-3 New Movie Grand Launch !!

కత్తిలాంటి కొత్త కుర్రాడు ‘శివాoశు’ను హీరోగా పరిచయం చేస్తూ… ఆర్.వి.జీ మూవీజ్-ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హైద్రాబాద్, సత్యసాయి నిగమాగమంలోని వినాయకుని గుడిలో మొదలైంది. రవిశంకర్ ఓంకాలి-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్-శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకత్వం వహిస్తున్నారు. శివాoశు సరసన ప్రాచీరాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఆమని ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.దర్శకుడు రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి), రచయిత వి.ఎస్.పి.తెన్నేటి, హీరో శివాoశు, హీరోయిన్ ప్రాచీ రాయ్, నిర్మాతలు రవిశంకర్ ఓంకాలి- తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంగీత దర్శకుడు రాజేష్ రాజ్.టి, కెమెరామెన్ ప్రసాద్ కె.నాయుడు, ఈ చిత్రంలో కీలక పాత్రధారి ఆకెళ్ల  తదితరులు పాల్గొన్నారు

దైవ సన్నిధిలో దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి… ఈ చిత్రానికి మాటలు-పాటలు రాస్తున్న ప్రముఖ రచయిత వి.ఎస్.పి.తెన్నేటి కెమెరా స్విచాన్ చేయగా… శ్రీమతి స్వాతి రుద్రాపట్ల క్లాప్ కొట్టారు. పూజా కార్యక్రమాలు అనంతరం రెగ్యులర్ షూట్ ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో… దర్శకుడు రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి), రచయిత వి.ఎస్.పి.తెన్నేటి, హీరో శివాoశు, హీరోయిన్ ప్రాచీ రాయ్, నిర్మాతలు రవిశంకర్ ఓంకాలి- తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంగీత దర్శకుడు రాజేష్ రాజ్.టి, కెమెరామెన్ ప్రసాద్ కె.నాయుడు, ఈ చిత్రంలో కీలక పాత్రధారి ఆకెళ్ల పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు.

దర్శక, నిర్మాత రుద్రపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇంతకుముందు చేసిన “తప్పించుకోలేరు” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.ఆ సినిమా తరువాత నెను చేస్తున్న ఈ సినిమా 7వ సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది.నేను తీసే ప్రతీ సినిమాకు నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాలో నూతన జంటను పరిచయం చేస్తూ ఇంతకుముందు చేసిన టెక్నికల్ టీమ్ తో వర్క్ చేస్తున్నాము.సినిమా పూర్తి అయిన తరువాత కూడా నా మీద నమ్మకం తో నేను తీసే నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకూడా ఇదే టెక్నికల్ టీం నాకు సపోర్ట్ గా నిలుస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు.కొత్త కథతో మీ ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.

హీరో శివాoశు’ మాట్లాడుతూ… నేను ఈ కథ విన్నప్పుడు ఈ కథ నాకు చాలా కాంప్లికేట్ గా అనిపించింది. ఇలాంటి కాంప్లికేట్ కథలో నటిస్తేనే నటన నేర్చుకోవడానికి ఉపయోగ పడుతుందని కష్టమైనా ఈ సినిమాలో నటిస్తున్నాను. ఇలాంటి డిఫ్రెంట్ కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అని అన్నారు.

హీరోయిన్ ప్రాచీ రాయ్ మాట్లాడుతూ…ఇలాంటి డిఫ్రెంట్ మూవీలో నేను లీడ్ రోల్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

చిత్ర నిర్మాతలలో ఒకరైన తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది వేణుగోపాల్ గారు.ఇదే బ్యానర్ లో మేము తనతో కొలబ్రేట్ అయి మేము 2 వ సినిమా చేస్తున్నాము. ఇలాగే మేము వీరితో మరిన్ని మంచి సినిమాలు తియ్యాలని ఆశిస్తున్నామని అన్నారు..

సంగీత దర్శకుడు రాజేష్ రాజ్ మాట్లాడుతూ.. ఇంతకుముందు సినిమాలోని నాపాటలకు మంచి అప్లజెస్ వచ్చాయి.ఇందులో రాసిన పాటలకు మంచి పేరు వచ్చేలా రుద్రబట్ల గారు హెల్ప్ చేశారు.ఇందులోని పాటలు కూడా తనకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

నటుడు ఆకెళ్ల మాట్లాడుతూ.. ఇన్నాళ్లు నేను చాలా సినిమాల్లో నటించాను. ఇంతవరకు నేను చేసిన పాత్రలకు ఇందులో డిఫ్రెంట్ రోల్ తో చేస్తున్నాను. నా లైఫ్ లో గుర్తుండి పోయే ఇలాంటి డిఫ్రెంట్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

నటీనటులు
హీరో : శివంషు
హీరోయిన్ : ప్రాచీ

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : ఆర్.జి.వి మూవీస్ & యస్.వి.యల్ ఎంటర్ప్రైజెస్
ప్రొడ్యూసర్ : రుద్రబట్ల వేణుగోపాల్, తలారి వినోదకుమార్ ముదిరాజ్,మామిడాల శ్రీనివాస్, లలిత్ కుమార్
రచయిత, డైరెక్టర్ : రుద్రబట్ల వేణుగోపాల్,
ఎగ్స్క్యుటివ్ ప్రొడ్యూసర్ : రవి శంకర్ ఓం కాళీ
మ్యూజిక్ డైరెక్టర్ : రాకేష్ రాజ్.టి
ఫోటోగ్రఫీ : ప్రసాద్.కె.నాయుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here