‘Sammakka Sarakka Jatara Chuda Podama …’Folk song released by Hero Suman

ఎర్ర దళం, ప్రతిక్షణం అమ్మకోసం, ఇలా చూడు ఒకసారి, మరో దృశ్యం వంటి సినిమాలలో హీరోగా నటించడమే గాక సెక్సీ స్టార్, థ్రిల్లింగ్, శ్రీ మణికంఠ మహిమలు, చేతిలో చెయ్యేసి చెప్పు బావా వంటి మొదలగు సినిమాలకు దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా చేసిన నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్  కట్ల రాజేంద్రప్రసాద్. వి.బి దర్శకత్వంలో రూపొందిన సరికొత్త జానపద వీడియో సాంగ్ “సమ్మక్క సారక్క జాతర చూడ పోదమా…”.
పచ్చవ వెంగళరావు క్రియేషన్స్ పతాకంపై వెంకట రాకేష్ నిర్మాణ సారధ్యంలో రూపొందించిన “సమ్మక్క సారక్క జాతర చూడ పోదమా..” అను జానపద పాటను సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితర సినీప్రముఖులు పాల్గొని. ఈ సాంగ్ చేసిన టెక్నికల్ టీం అందరికి అల్ ద బెస్ట్ తెలియజేశారు. అనంతరం

సినీనటుడు సుమన్ గారు మాట్లాడుతూ.. నాకు రాజేంద్ర ప్రసాద్ చాలా సంవత్సరాల నుంచి పరిచయం.తను చాలా హార్డ్ వర్కర్.తనతో సినిమాలు కూడా చేశాను. తెలంగాణలో ఉన్న దేవతలు, గ్రామ దేవతల గురించి చాలా మందికి చాలా తెలియని విషయాలను పాటల ద్వారా తెలియడం జరిగింది. మేడరం లోని సమ్మక్క సారక్క గురించి చేసిన పాట చాలా బాగుంది. ఒకే లొకేషన్లో చుట్టేయకుండా ఖర్చుకు వెనుకాడకుండా డీఫ్రెంట్ లొకేషన్స్ లలో తీశారు. శ్రీదేవి,తో పాటు అందరూ చాలా బాగా డాన్స్ చేశారు.ఇలాంటి మంచి హిస్టారికల్ మెసేజ్ ఓరియెంటెడ్ సాంగ్స్ ఎన్నో తీసి జనాల్లో భక్తి భావం పెంపొందించేలా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నిర్మాత తుమ్మల పల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకుడిగా నటుడిగా కొరియో గ్రాఫర్ గా సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన సర్వీస్ అందిస్తున్నాడు.సమ్మక్క సారక్క జాతర చూడ పోదమా.. అనే టైటిల్ తో అద్భుత మైన పాట తీశాడు.ఈ పాటను చిన్న నిర్మాతలకు మెగాస్టార్ అయిన సుమన్ గారి చేతులమీదుగా విడుదల చేయించారు.సుమన్ గారు రాజేంద్రప్రసాద్ మీద అభిమానంతోనే ఈ పాటను విడుదల చేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ సినిమాల ద్వారా పాటల ద్వారా ఎంతో మంది టెక్నీషియన్స్ ను ప్రోత్సహిస్తూ కొత్త ట్యాలెంట్ ను ఇండస్ట్రీ కు పరిచయం చేస్తున్నాడు.థియేటర్లు ఓ.టి.టి ల మాదిరే యూట్యూబ్ ఛానల్ లో కూడా  రిలీజ్ చేసి కొత్త నిర్మాతలను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పిస్తున్నాడు.సినిమా ఇండస్ట్రీలోనే కాక ఇలాంటి  ఫోక్ సాంగ్స్  జనాలలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ పాట చాలా బాగుంది హీరోయిన్ శ్రేదేవి కూడా చాలా బాగా చేసింది. ఒక లొకేషన్లో కాకుండా ఏడు లొకేషన్లో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సాంగ్ చేశారు.యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తున్న ఈ పాట గొప్ప విజయం సాధించాలని అన్నారు.సినిమా

యాక్టర్, డైరెక్టర్, రైటర్, కొరియోగ్రాఫర్ కట్ల రాజేంద్ర ప్రసాద్.వి.బి మాట్లాడుతూ..మా పాటను విడుదల చేయడానికి  వచ్చిన మా హీరో సుమన్ ,నిర్మాత తుమ్మలపలి రామసత్యనారాయణ గార్లకు ధన్యవాదాలు.36 సంవత్సరాల క్రితం సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో  హీరోగా అవ్వాలని ఇండస్ట్రీ కు వచ్చిన నేను 4 సినిమాలలో హీరోగా నటించి 10 సినిమా లకు డైరెక్షన్ చేయడం  జరిగింది. కళామతల్లి దీవెనలతో కన్నడ తెలుగు తమిళ బాషల్లో 100 సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ గా పనిచేయడం జరిగింది.ప్రస్తుతం రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.త్వరలో మా అబ్బాయిని కూడా హీరోగా కూడా పరిచయం చేస్తున్నాను..ఏదైనా డీఫ్రెంట్ గా భక్తి పాటలు తీద్దామను కుంటున్న నా దగ్గరకు రాకేష్ వచ్చి “సమ్మక్క సారక్కల” గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటి చెపుతూ..ఆ దేవతలను కొలిచే వారికి మన పాట ఒక మంచి గిఫ్ట్ గా ఉండేలా..ఒక మంచి సాంగ్ చేయమని చెప్పడం జరిగింది.ఈ సాంగ్ షూట్ చేయడానికి ముందుగా కొన్ని వందల పాటలు చూసి వాటికి భిన్నంగా “సమ్మక్క సారక్క జాతర పోదామా” అనే పాట ఉండాలని డీఫ్రెంట్ లొకేషన్స్ లలో నిర్మాతలు రాకేష్,నరేష్, శ్రీకాంత్ లు ఖర్చుకు వెను కాడకుండా 6 లక్షల రూపాయల ఖర్చుతో చిత్రీకరించడం జరిగింది. ఈ సాంగ్ ని రెండు వెర్షన్స్ లో తీశాము మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నాం.ఈ మూడు వెర్షన్స్ లలో తీయడం జరిగింది. పి.వి.రావు యు ట్యూబ్ చానెల్ లో ఈ రోజు సాయంత్రం నుండి “సమ్మక్క సారక్క జాతర చూడ పోదమా..” సాంగ్ ప్రసారం చేయడం జరుగుతుంది. అందరూ ఈ పాటను చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

సహ నిర్మాతలు నరేష్ కుమార్ సిద్ధ, జలగం కేశవరావులు మాట్లాడుతూ..మా పాటను విడుదల చేయడానికి వచ్చిన సుమన్ గారికి, రామ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. అమెరికాలో ఉన్న మా స్నేహితుడు రాకేష్ గారు దేవతల యొక్క గొప్ప తనాన్ని ప్రజలకు తెలియ జెయ్యాలనే ఆలోచనను మాకు చెప్పడంతో మేము చిత్ర దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ ని కలవడం జరిగింది.ఈ పాటను శ్రీదేవి,జాను లిరి,  సోనమ్ రాయ్ వంటి ముగ్గురు లీడ్ యాక్టర్స్ తో రెండు రోజులు షూట్ చేయడం జరిగింది.క్లాసికల్ డాన్సర్ అయిన శ్రీదేవి చాలా చక్కగా డ్యాన్స్ చేసింది. ఒకే లొకేషన్స్ లలో కాకుండా డీఫ్రెంట్ లొకేషన్స్ లలో 6 లక్షల రూపాయల ఖర్చుతో ఈ పాటను షూట్ చేయడం జరిగింది. ఇందులో పని చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు.నెక్స్ట్ మేము వేములవాడ రాజన్న మీద సాంగ్ చేస్తున్నాం. మార్చి ఫస్ట్ కు ఈ పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

నటి శ్రీదేవి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి భక్తి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు
శ్రీదేవి,జాను లిరి,సోనమ్ రాయ్,

సాంకేతిక నిపుణులు
నిర్మాత : వెంకట రాకేష్ పచ్చవ
సహ నిర్మాతలు : నరేష్ కుమార్ సిద్ధ, జలగం కేశవరావు ఫోటోగ్రఫీ : యాదగిరి
లిరిక్స్: వెంకట్ బాలగోని
ఎడిటర్ : ప్రణయ్
పోస్ట్ ప్రొడక్షన్ : శ్రీ సారథి స్టూడియో
కాన్సెప్ట్ డిజైనర్ : తాజ్ మాస్టర్
సంగీతం – కొరియోగ్రఫీ : కట్ల రాజేంద్రప్రసాద్.వి.బి
పి ఆర్.ఓ : ఆర్.కె.చౌదరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here