Sarileru Neekevvaru Movie 50 Day Celebrations

హైదరాబాద్ :

సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల  వేడుకల సందర్బంగా R.T.C క్రాస్ రోడ్స్ లో ని సుదర్శన్ థియేటర్ యజమాని నందగోపాల్ కుమారుడు బాలు , మేనేజర్ రెడ్డి ల కు సూపర్ స్టార్ కృష్ణ  మీదుగా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు అందజేశారు . ఈ సందర్బంగా థియేటర్ యజమాని బాలు మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, చిత్రాలు జూబిలీ ప్రదర్శించబడటం మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి పి . మల్లేష్, బ్యాంకు రాజు, డ్. వెంకటేష్, రామదాసు , శ్రీధర్ బాబు, సిరిఫిరోజ్ , శ్రీనివాస్ గౌడ్ , మహేందర్ గౌడ్ , యన్ .యస్ .కే. రాజు  తదితర అభిమానులు  నానక్రామ గూడ లో ని విజయ కృష్ణ ఎస్టేట్ లోని  , మహిళా దర్శకురాలు విజయ నిర్మల గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా పూల మాల తో గౌరవించారు .

అమలాపురం :
అమలాపురం వి .పి . సి . థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానుల అధ్యక్షుడు కొప్పిశెట్టి నరసింహ మూర్తి ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా ,కేక్   చేసి , స్వీట్స్ పంపిణి చేసి బాణాసంచా కాల్చి  అభిమానాన్ని చాటుకున్నారు . జిల్లా పంపిణి సంస్థ  వింటేజ్ ప్రతినిధి కోలా సత్తి బాబు తో పాటు అభిమానులు  పాటి రవి ,కొప్పాడి రమేష్ , దొమ్మేటి శ్రీనివాస్ , కాలే గోవింద్ , ఆర్. శ్రీను , చిట్టూరి హనుమంత రావు , యస్. సాంబయ్య , కె . పోతురాజు , రాజ్ కుమార్ , వి.మూర్తి , కె . దుర్గ రావు తదితరులు పాల్గొన్నారు
విజయనగరం :
విజయనగరం లీల మహల్ థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానుల అధ్యక్షులు ఆర్. వి . రమణ రాజు ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు . జిల్లా గౌరవ అధ్యక్షులు డి . హుస్సేన్ కేక్ కట్ చేసి , లీల మహల్ థియేటర్ లో 50 రోజులకు రూ . 76,30,160/- గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం థియేటర్ రికార్డు సృష్టించిందని , టోటల్ టౌన్ గ్రాస్ రూ. 1,94, 08,890/- వసూలు చేసిందని పేర్కొన్నారు . ఈ సందర్బంగా  థియేటర్ మేనేజర్ సత్యనారాయణ , శ్రీ వెంకటేశ్వర ఏజెంట్ నరసింగ్ రావు ల కు మొమెంటో అందజేశారు . ఈ కార్యక్రమం లో రాంబాబు , యమ్ . ఈశ్వర్ రావు, యమ్.  రమేష్ , ఏ.విజయ్ , సూరి బాబు , బోణి అప్పారావు తదితర అభిమానులు పాల్గొన్నారు .
నర్సరావుపేట :
నర్సరావుపేట లో టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువ శక్తీ అధ్యక్షులు యమ్ . డి . ఫారూఖ్ బాబు ఆద్వర్యం లో  సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమాన్ని లిటిల్ హార్ట్స్ అనాథ శరణాలయం లో బులియన్ మిర్చంట్స్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కపల వాయి విజయకుమార్ ముఖ్య అతిధి గా పాల్గొని , కేక్ కట్ చేసి , స్వీట్స్ పంపిణి చేశారు . అనంతరం అక్కడ అన్నదానం నిర్వహించారు . ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కృష్ణ అభిమానులు మార్గదర్శకం గా నిలిచారు  . అభిమానులు పి.  రావు , బి. కొండల్ రావు , షేక్ నబబీ బాజీ  , షేక్ వలి , ఏ . తిరుపతయ్య , జిలాని టైలర్ , శంకర్ , సాగర్, షేక్ ఖాజు , షేక్ కరీముల్లా , యమ్ . డి . ఫయాజ్ , తదితరులు పాల్గొన్నారు
బళ్లారి :
కర్ణాటక లో ని బళ్లారి లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఫాన్స్ అధ్యక్షులు కె . యల్ . సుబ్బా రావు ఆద్వర్యం లో   సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్బంగా కేక్ కట్ చేసి , రాఘవేంద్ర థియేటర్ యజమానులకు మొమెంటో అందజేసి సన్మానించారు . థియేటర్ సిబ్బంది కి టిఫిన్ కారేజ్ లను పంచారు . ఈ కార్యక్రమం లో రామాంజనేయులు , రమేష్ సాయి , విశ్వ , శ్రీను , యాసిస్ , తదితర అభిమానులు పాల్గొన్నారు .
కాకినాడ :
కాకినాడ దేవి మల్టీప్లెక్స్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఫాన్స్ జిల్లా అధ్యక్షులు కర్రీ మోహన్ బాబు ఆద్వర్యం లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమం లో కాకినాడ మోహన్ కేక్ కట్ చేసి థియేటర్ మేనేజర్ సూర్య కు మొమెంటో ను అందజేసి సిబ్బంది కి గిఫ్ట్ ఐటమ్స్ ను అందజేశారు . ఈ సందర్బంగా బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు . సీనియర్ అభిమానులు నాగారం, నూక రాజు  , బుజ్జి , కె . దుర్గా రావు, కృష్ణ వంశి , శేఖర్ , రోహిత్ తదితరులు పాల్గొన్నారు
మండపేట :
మండపేట సత్యశ్రీ థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఫాన్స్ అధ్యక్షులు మెండు సత్తి బాబు ఆద్వర్యం లో  సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు ” 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా విచ్చేసిన సత్య శ్రీ థియేటర్ యజమాని చెన్నా రాంబాబు , తూ . గో . జిల్లా పంపిణి దారు వింటేజ్ క్రియేషన్స్ అధినేత జె . కె . రామకృష్ణ కేక్ కట్ చేశారు, వారిరువురికి మొమెంటో ని అందజేశారు . థియేటర్ సిబ్బంది కి వస్త్రాలను బహుకరించారు . ఈ కార్యక్రమం  లో  జిల్లా ఫాన్స్ అధ్యక్షులు కర్రీ మోహన్ బాబు , షాజహాన్ , చోడే శ్రీ కృష్ణ , మహంతి , సతీష్ , గొడవర్తి సురేంద్ర తదితర అభిమానులు పాల్గొన్నారు
———————————————————————–
“కృష్ణ గారి అభిమానులం ” వాట్సాప్ గ్రూప్ విరాళం :
“కృష్ణ గారి అభిమానులం ” వాట్సాప్ గ్రూప్ సభ్యులు ప్రతి నెల సేకరించే విరాళాన్ని ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న అభిమానులకు అందజేసే సంప్రదాయం లో భాగంగా , 20 వ నెల వసూలు అయినా రూ . 12,116/- కాకినాడ కి చెందిన సీనియర్ అభిమాని కె . దుర్గా రావు కు సూపర్ స్టార్ కృష్ణ చేతులు మీదుగా , అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా , విజయ కృష్ణ ఎస్టేట్స్ లో ని , ప్రముఖ మహిళా దర్శకురాలు విజయ నిర్మల విగ్రహ సాక్షి గా అందజేశారు . ఈ విధంగా , అభిమానులను ఆదుకోవడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని సూపర్ స్టార్ కృష్ణ అభినందించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది అన్నారు . ఈ కార్యక్రమం లో గుమ్మడి రవి కృష్ణ , షావుల్ సయ్యద్ , బాణోత్ కృష్ణ , సాయి , బుజ్జి , కన్నా , కమల్ , పద్మాలయ పి . ఆర్ . వో . బాలాజీ శర్మ తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here