Scientific Crime Action Drama ‘7:11’ PM Review

Cinemarangam.Com
రివ్యూ రేటింగ్ : 2.5/5
బ్యానర్ : ఆర్కస్ ఫిల్మ్స్
సినిమా : “ 7:11 PM “
విడుదల తేదీ : 07.07.2023
నిర్మాతలు : నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి 
దర్శకత్వం : చైతు మాదాల
నటీ నటులు : సాహస్ పగడాల,దీపికా రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు
సంగీతం – గ్యాని
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె, జై లోగిశెట్టి
డీవోపీ – శివ శంకర్,ఫాబియో కాపోడివెంటో
ఎడిటర్ – శ్రీను తోట

ఆర్కస్ ఫిల్మ్స్ పతాకంపై సాహస్, దీపిక హీరో హీరోయిన్ లుగా చైతు మాదాల దర్శకత్వంలో నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించిన సైంటిఫిక్ క్రైమ్ యాక్షన్ డ్రామా 7:11 PM.ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’.. వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 7 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 7:11 PM.. సినిమా ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి


కథ:
ఇదొక సైన్స్ ఫిక్షన్ కు సంబందించిన కథ.హంసలదీవిలో ఉండే రవి (సాహస్). విమల (దీపిక)తో ప్రేమలో ఉంటాడు. అదే ఊరి బ్యాంకులో ప్రజలు దాచుకున్న డబ్బులను  అక్కడి లోకల్ ఎం ఎల్ ఏ  బ్యాంక్ అధికారులుతో కలసి దోచుకోవాలని కుట్రకు ప్లాన్ చేస్తారు. అయితే అనుకోకుండా రవి బాబాయ్, స్నేహితులు, అలాగే తన ప్రియురాలు విమల హత్యకు గురవుతారు.ఇవేమి తెలియని రవి ఒక రోజు హంసల దీవిలో సాయంత్రం 7:11 కి ఒక లోకల్ బస్సు ఎక్కితే మరుసటి రోజు ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ బీచ్ లో పడి ఉంటాడు.ఆ బీచ్ లో ఉన్న సారా (టెస్ వాల్ష్) వీరిని లేపి అడగగా మేము గోవాలో ఉన్నామనుకుంటారు. అయితే ఇది గోవా కాదు ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ బీచ్ అని చెపుతుంది. ఆది విని షాక్ అయిన రవి ఇది 1999 కదా అని సారా ను అడిగితే కాదు ఇది 2024 అని చెపుతుంది. 1999 లో బస్ ఎక్కిన నేను 2024 అంటే 25 సంవత్సరాలు ముందుకు ప్రయాణించాను ఇదెలా సాధ్యం అనుకుంటాడు. అయితే సారా సహాయంతో హంసలదీవిలో ఉన్న తన వారందరూ చంపబడడమే కాకుండా తనను నేరస్తుడనే ముద్ర వేశారాని తెలుసుకుంటాడు..ఈ క్రమంలో మళ్ళీ టైం ట్రావెల్ ద్వారా 1999 కి వెళ్లి తన కథని మార్చుకోవాలి అనుకుంటాడు. అసలు తన బాబాయ్, ప్రియురాలిని హత్య చేసింది ఎవరు? రవి మళ్ళీ 1999 కి ఎలా వెళ్ళి తన కథని మార్చుకొని తన వాళ్ళని బతికించుకున్నాడా.. లేదా? అనేది తెలుసుకోవాలి అంటే 7:11 PM సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు

రవి పాత్రలో నటించిన సాహస్ పగడాల చాలా బాగా నటించాడు. హీరో ప్రేయసిగా విమల పాత్రలో నటించిన దీపికా రెడ్డి తన పాత్ర చిన్నదే అయినా తన పాత్రకు న్యాయం చేసింది. విలన్ గా నటించిన భరత్ రెడ్డి … తన సీరియస్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.సారా పాత్రలో నటించిన (టెస్ వాల్ష్) తన గ్లామరస్ తో ఎంతో అభినయంతో చాలా బాగా నటించింది.రఘు కారుమంచి, రైజింగ్ రాజు ల కామెడీ కొంత ఆకట్టుకుంటుంది.ఇంకా ఇందులో నటించిన రఘు కారుమంచి, రైజింగ్ రాజు, సియన్నా, మెరీనా బి, వాసు రౌతు, చరణ్ కురుగొండ తదితరులంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు

ఏ దర్శకుడికైనా సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్‌ని సెలెక్టచేసుకొని సినిమాగా మలచి ప్రేక్షకులను మెప్పించడం చాలా టఫ్ అని చెప్పవచ్చు. అయితే టైం ట్రావెల్ వంటి సైన్స్ ఫిక్షన్ కథను సెలెక్ట్ చేసుకొని తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో దర్శకుడు చైతు మాదాల పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. శివశంకర్ & ఫ్యాబియో కాపోడివెంటో కెమెరా పనితనం చాలా బాగుంది.గ్యాని నేపధ్య సంగీతం బాగుంది .సౌండ్ విజువల్స్, వి. యఫ్ ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి.. శ్రీను తోట ఎడిటింగ్ పనితీరు పరవాలేదు.. ఆర్కస్ ఫిల్మ్స్ బ్యానర్ పై నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి లు అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. టైం ట్రావెల్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ 7:11 PM సినిమా కచ్చితంగా నచ్చుతుంది

Cinemarangam. Com Review Rating..2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here