Senior Actress Indraja interview about ‘Stand up Rahul’ Movie

ఇప్పటి వరకు నేను నటిగా చేసింది గోరంత మాత్రమే.. చేయాల్సింది కొండంత ఉంది.

డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పతాకంపై ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా ` స్టాండ్ ఆప్ రాహుల్’. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌.  శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాను నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. షూటింగ్ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగిశాయి.ఇటీవలే విడుదలైన ఈ చిత్ర లోని ట్రైల‌ర్‌ కు, పాట‌ల‌కు ప్రేక్షకులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 18న విడుద‌ల‌ కాబోతున్న సందర్భంగా ఈ చిత్రంలో హీరోకు తల్లిగా నటించిన సీనియర్ నటి ఇంద్రజ  విలేక‌రుల‌తో మాట్లాడుతూ…

 

ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కి తల్లి పాత్ర చేశాను.కుటుంబంలో తల్లి ప్రాధాన్యత ఎంత ఉంటుంది. భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి.ఇప్పటికీ పిల్లలకు తల్లిదండ్రులకు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఎలా ఉంది వంటి అంశాలతో “స్టాండ్ అప్ రాహుల్” మూవీలో తల్లి కోణంనుంచి కొత్త తరహాలో కథ సాగుతుంది.ఈ తరం వారికి అర్థమయ్యేలా “స్టాండ్ అప్ రాహుల్” సినిమాను చాలా చక్కగా చూపించారు భరత్.

 

తన భర్త దగ్గర లేని క్వాలిటీని కొడుకు దగ్గర చూడాలని చిన్నప్పటినుండి జాగ్రత్తగా పెంచుతుంది. అయినా.. తన తండ్రి లాగే ఉన్నాడని తెలిసి బాధపడుతుంది.అయితే చివరికి కొడుకు తల్లిని ఏవిధంగా అర్థం చేసుకున్నాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది .తల్లిదండ్రులు యువత తప్పక చూడాల్సిన చిత్రం ఇది. యూత్ కు పని, ఫ్యాషన్, అనే అంశాలలో ఏదో ఒక దాని కోసం కష్టపడుతూ ఉంటారు అలా కాకుండా తనకు ఇష్టమైన పనిని ఈ సినిమాలో చూపించారు.

 

మేము ఒకప్పుడు పెద్ద దర్శకులతో పనిచేశాను. కానీ ఇప్పటి జనరేషన్ దర్శకులు చాలామంది ప్రతిభ గల వారు ఈ రంగంలో అన్ని విషయాలు తెలిసే వస్తున్నారు. నటిగా నేను సలహాలు ఇచ్చే స్థితిలో లేను  దర్శకుడికి విజన్ లో ఏదో ఉందో దాన్ని బట్టి మేం నటిస్తాం.నేను “శతమానంభవతి” “శమంతకమణి” సినిమాలు చేశాను ఆ తర్వాత మూడు సినిమాలు చేశాను ఏదైనా సినిమా హిట్టయితే ఆ ప్రభావం నటులపై పడుతుంది అవకాశాలు వస్తాయి. అయితే నటిగా సంతృప్తి అనేది ఎవరికి ఉండదు.ఇప్పటి వరకు నేను నటిగా చేసింది గోరంత మాత్రమే.. చేయాల్సింది కొండంత ఉంది.మాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పివడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం.

 

ఖుష్బూ,నదియా, రోజా, ఆమని, వారంతా మా సీనియర్లు.వారితో మమ్మల్ని పోల్చుకోలేము. రవళి, సంఘవి, మా తరం మాకు మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాము. ఆలాగే సమంత,తాప్సి వంటి వారు లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తున్నారంటే అంతకు ముందు వారు దాదాపు అన్ని తరహా పాత్రలు పోషించేవారు.నటికి పరిమితులు ఉండవు.

 

తెలుగులో లో నాకు సక్సెస్ రేటు ఎక్కువ అయితే మలయాళంలో హీరోయిన్ గా బిజీ గా ఉన్నప్పుడే 2006లో పెళ్లి చేసుకున్నాను. మా పాపకి 8 ఏళ్లు వచ్చే వరకు సినిమాల్లో నటించకూడదని గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు తనకు 13 ఏళ్లు వచ్చినందున తనపని తను చేసుకో గలుగుతుంది.అయితే ఇప్పుడు కూడా నెలలో సగం రోజులు కుటుంబంతో, సగం రోజులు షూటింగ్ లో ఉంటూ ఫ్యామిలీ చూసు కుంటున్నాను.ఇండస్ట్రీలోచాలా మంది న‌టీమ‌ణులున్నారు. కాంపిటీషన్ వుంది. అమ్మ‌, అక్క‌, వ‌దిన పాత్ర‌లు చేసేవారు చాలా మంది వున్నారు. బెట‌ర్ అవ‌కాశం రావ‌డ‌మూ అదృష్టంగా భావిస్తా.

 

– నితిన్ తో మాచర్ల నియోజకవర్గం చిత్రం చేస్తున్నా. అందులో నా పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. మురళీశర్మ కు జోడీగా నటిస్తున్నా. boot cut చిత్రంలో పటేల్ అమ్మ అనే పాత్ర చేశాను చాలా వినూత్నంగా ఉంటుంది. ప్రకాష్ రాజుతో చేసిన web series నెక్స్ట్ మంత్ జి ఫైవ్ లో రిలీజ్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here