Sharwanand & Samantha’s “Jaanu” Movie Review

Release date :-February 7th,2020
Cinemarangam.com:-Rating:3.5/5
Movie name:-”Jaanu
Banners:-Sri Venkateswara Creations
Starring:Sharvanand,Samantha,Varsha bollamma,Vennela Kishor,Sharanya Pradeep,Tagubothu Ramesh,Raghu babu,Etc..
Music Director :-Govind Vasantha
Editor:-Praveen kL
Cinematography:-Mahendiran Jayaraju
Director :-Prem kumar.
Producer :-Dil raju,Shirish.

యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘జాను’ మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి రీమేక్‌గా వస్తున్న జాను చిత్రం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్‌తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన జాను చిత్రం ప్రేక్షకులను ఎంతమేర అలరించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అయిన రామచంద్ర అలియాస్ రామ్(శర్వానంద్) కొన్ని కారణాల చేత అతను చదువుకున్న స్కూల్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని చిన్నప్పటి గుర్తులు జానకి దేవి అలియాస్ జాను(సమంత)తో చిన్నతనంలో ప్రేమలో పడిన సంఘటనలు గుర్తుకు చేసుకుంటాడు. అయితే అతని చిన్ననాటి స్నేహితులు అంతా కలిసి ఒక గెట్ టు గేదర్ ను ఏర్పాటు చెయ్యగా అక్కడికి జాను(సమంత)కూడా వస్తుంది.ఒకే క్లాస్ లో చదువుకున్న రామ్, జానుల మధ్య జరిగిన కథ ఏంటి ? వారి ప్రేమ ఎలా మొదలైంది ? ఎందుకు విడిపోయారు ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు
రామ్(శర్వానంద్)మరియు జాను(సమంత)ల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే కథ మొత్తం వీరి చూట్టే తిరిగుతుంది. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లోని స్కూల్ ఎపిసోడ్స్ కానీ చాలా చక్కగా వచ్చాయి. రామ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకుచేసుకుంటూ, స్కూల్‌లో మొదలయ్యే ప్రేమ కథను మనకు చూపించారు. తనకు ఇష్టమైన అమ్మాయి ఎదురవ్వగానే ఆ అబ్బాయి పడే ఆరాటం ఎలా ఉంటుందో మనకు చూపించారు. అమ్మాయితో మాట్లాడటానికే భయపడే ఆ అబ్బాయి, అమ్మాయిపై ఇంతలా ప్రేమ పెంచుకోవడానికి కారణమేమిటనేది మనకు చాలా స్పష్టంగా చూపించారు.ఇక తాను ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చయడానికి ఆ అబ్బాయి పడే పాట్లు కూడా మనకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే అంతలా ప్రేమించిన అమ్మాయి సెలవుల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఆ అబ్బాయి వదిలి వెళ్లిపోవడం అనే టిస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్‌ను చూపించారు చిత్ర దర్శకుడు. ఇక సెకండాఫ్‌లో తాను ప్రేమించిన జాను చాలా ఏళ్ల తరువాత గెట్ టుగెదర్ పార్టీలో కలవడంతో అప్పుడు కూడా రామ్ అంతే ప్రేమను తనలో చూపిస్తాడు. జాను తనతో మాట్లాడిన క్షణం నుండి ఆమెపై రామ్‌కు ఉన్న ప్రేమను మనకు చాలా స్పష్టంగా చూపించాడు దర్శకుడు. అయితే జానును తాను ఎందుకు విడిచి వెళ్లాల్సి వచ్చిందో చెప్పే క్రమంలో జాను రామ్‌ను శాశ్వతంగా విడిచి వెళ్తోందనే నిజం చెప్పడంతో, వారి ప్రేమకథకు ఎలాంటి ముగింపు పలికారనేది చిత్ర కథాంశం..రామ్‌గా శర్వానంద్ యాక్టింగ్ చాలా బాగుంది. శర్వా తన పాత్రలో జీవించి చేశాడని చెప్పాలి. తాను ప్రేమించిన అమ్మాయి చాలా ఏళ్ల తరువాత ఎదురవ్వడంతో ఓ ప్రేమికుడు ఎలా ఫీలవుతాడో మనకు శర్వాను చూస్తే నిజంగా ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక జాను పాత్రలో సమంత కూడా అదరగొట్టింది. కొన్ని సీన్స్‌లో ఆమె చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ అదరగొట్టాయి. మిగతా నటీనటులు వారి పరిధి మేర బాగానే చేశారు.

సాంకేతిక నిపుణులు :                     దర్శకుడు ప్రేమ్‌కుమార్ తమిళంలో తెరకెక్కించిన 96 కథకు ఎలాంటి మార్పులు లేకుండానే జాను సినిమాను మనముందుకు తీసుకొచ్చాడు. తమిళంలో ఎంత ఫీల్ తో తీశాడో.. తెలుగులో కూడా అదే స్థాయిలో తెరకెక్కించాడు. ముఖ్యంగా ఎమోషన్స్, కెమిస్ట్రీ, నటన ఇలా అన్ని కోణాల్లోనూ సినిమాకు తగ్గట్టుగా చేయించాడు..ఇలా రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రేమకథలు ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పాలి.కాస్త నెమ్మదిగా సాగే కథనం మైనస్ అయినప్పటికి హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కెమిస్ట్రీ మరియు ఎమోషన్స్ తో ప్రేక్షకుల్లో అద్భుతమైన ఫీల్ కలుగుతుంది. దర్శకుడు రాసుకున్న కథ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సె్స్ అయ్యిందనే చెప్పాలి.ఇక సంగీతం అందించిన గోవింద్ వసంత మరోసారి 96 ఫీల్‌ను మనకు కలిగించాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి… లవర్స్ మాత్రనే కాదు ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు.

Cinema rangam.com..3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here