‘Sindhooram’ Movie on the dark sides of Naxalism : Sindhooram Review

Cinemarangam.Com
సినిమా : “సింధూరం”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 26.01.23
బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
డైరెక్టర్: శ్యామ్ తుమ్మలపల్లి
నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా
నటీనటులు: ధర్మ, మహేష్ ,శివ బాలాజీ,  బ్రిగిడ సాగ, రవి వర్మ తదితరులు
సహా నిర్మాతలు: చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం
రైటర్: కిషోర్ శ్రీ కృష్ణ
సినిమాటోగ్రఫీ: కేశవ్
సంగీతం: హరి గౌర
ఎడిటర్: జస్విన్ ప్రభు
ఆర్ట్: ఆరే మధుబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ.డి
పీఆర్ఒ: శ్రీధర్

ఒక నక్సలైట్ ఇన్ఫార్మర్ జీవితంలో జరిగిన మంచిని, చెడును మరియు నక్సల్ లైఫ్ యొక్క కథను తెలుపుతూ ఒక వ్యవస్థ గురించి అపోజిట్ వ్యవస్థ ఎందుకు పుడుతుంది. ఆలా పుట్టడానికి రీజన్ ఏంటి? అనే విధంగా చరిత్ర లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరాకెక్కిన సినిమా “సిందూరం”. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ధర్మ మహేష్, శివ బాలాజీ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మించిన ee చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
2003 లో గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తరువాత శ్రీరామగిరి ఏజెన్సీ ఏరియాలో పెత్తందార్లు, భూస్వాముల ఆగడాలు విపరీతంగా కొనసాగుతుంటాయి. వాటిని సింగన్న దళం (శివ బాలాజీ)అడ్డుకొని చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఖమ్మం జిల్లా పినపాకకు చెందిన రవి (ధర్మ మహేష్ ) కాలేజీలో చదువుకుంటూ బ్యాట్ మింటన్ ఆడుతూ మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే జాతీయ స్థాయిలో ఆడి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కలలు కంటాడు. అదే కాలేజీలో చదువుతున్న శిరీష రెడ్డి (బ్రిగిడ సాగా) రవిని ఇష్టపడుతుంది. ఆ తరువాత ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమున్నా ఎవరూ బయటపడరు. కానీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. కాలేజీ అయిపోయిన తరువాత శిరీష రెడ్డి అదే ఊరికి ఎమ్మార్వోగా వస్తుంది. అక్కడ నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ఆమెకు తోడు కాలేజ్ ఫ్రెండ్ అయిన రవి ఉంటాడు.అయితే ఊహించని సంఘటన ద్వారా తను ఎంతో ఇష్టపడే బ్యాట్మింటన్ కు దూరమై, తండ్రిని కోల్పోయిన రవి నక్సలైట్ ఇన్ ఫార్మర్ గా ఉంటాడు. అయితే ఆ ఊరిల జరిగే జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా శిరీష అన్న ఈశ్వర్ రెడ్డి(రవి వర్మ ) మరణించడంతో తన ఎమ్మార్వో ఉద్యోగాన్ని వదిలేసి జడ్పీటీసీకి పోటీ చేయాల్సి వస్తుంది. కానీ అది సింగన్న దళానికి నచ్చదు. దాంతో శిరీషను సింగన్న దళం ఏం చేసింది ? ఈశ్వర్ రెడ్డి ని ఎవరు చంపారు..? రవి బ్యాట్మింటన్ కు దూరమయ్యి ఎందుకు నక్సలైట్ ఇన్ ఫార్మర్ గా మారాడు? చివరికీ రవి తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు రవి, శిరీష లు ఒక్కటయ్యారా.. లేదా..అనేది తెలుసుకోవాలంటే థియేటర్స్ కు వెళ్లి సినిమాను చూడాల్సిందే….

నటే, నటుల పనితీరు
సింగన్న పాత్రలో శివ బాలాజీ నక్సలైట్ ఉద్యమ నాయకుడిగా మొదటిసారిగా కనిపించిన ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. హీరో ధర్మ మహేష్ ఫస్ట్ సినిమా అయినా సరే విద్యార్థి పాత్రలో బ్యాట్ మింటన్ ఆడే స్పోర్ట్స్ మెన్ గా, నక్సలైట్ ఇన్ ఫార్మర్ గా చాలా నేచురల్ గా చేశాడు, తమిళ్ లో ఆల్రెడీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడ సాగ కు తెలుగులో మొదటి సినిమా అయినా విద్యార్థిగా, ఎమ్మార్వోగా, రాజకీయ నేతగా చాలా బాగా నటించింది. రాజకీయ నేతగా రవి వర్మ పాత్రలో ఒదిగిపోయాడు.ఆనంద చక్రపాణి, నాగమహేష్, దయానంద రెడ్డి వంటి మొదలగు వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ చాలా ఫోకస్ తో చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమానే ఆదరిస్తున్నారు. అందులో “సిందూరం” వంటి కథను చెప్పడం అంత సులువైన విషయమేమి కాదు. పాత సిందూరం సినిమా ఎక్కడైతే ఆగుతుందో అక్కడ నుండి మొదలు పెట్టడమంటే కత్తిమీద సాముతో కూడుకున్న పనే అని చెప్పాలి.ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయనటువంటి నక్సల్స్ లోని కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా చూపించడం విశేషం. గవర్నమెంట్ వ్యవస్థ, నక్సల్స్ వ్యవస్థ ఇలా రెండు వ్యవస్థల పోరాటాల మధ్య నలిగిపోయిన సాధారణ ప్రజలు, వాళ్ళల్లో చదువుకున్న వారెందరు, చదువు లేని వారిందరు అనే విషయాలను సినిమాటిక్ వేలో చాలా బాగా చూయించారు. నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలు,. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ వంటి సన్నవేశాలతో పాటు ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా నక్సల్ ఇన్ఫార్మర్ అనే పాయింట్ ను బాగా రీసెర్చ్ చేసి రాసుకుని దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి చాలా చక్కగా తెరకెక్కించడం జరిగింది.

నక్సలైట్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, కమ్యూనిజం ముసుగులో జరిగే అరాచకాల గురించి, హిట్లర్, స్టాలిన్ అంటూ గొప్పవారంటూ చెప్పుకునే మీరు వారు.. ఎన్ని కోట్ల మంది ప్రాణాలను బలితీసుకున్నారనే విషయాలు చరిత్రను తిరగవెస్తే తెలుస్తుంది అని కమ్యూనిజం గురించి హీరోయిన్ శిరీష చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.కేశవ, మహేష్ లు చేసిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 2003 నాటి వాతావరణాన్ని తెరపై అద్బుతంగా చూపించారు.సంగీత దర్శకుడు హరి గౌరవ మ్యూజిక్ ఈ సినిమాకు మరో అసెట్ అవుతుంది. కిషోర్ డైలాగ్స్ బాగా కుదిరాయి,తను అందించిన పలు డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫైట్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. జస్విన్ ప్రభు ఎడిటింగ్ పని తీరు బాగుంది.శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ప్రవీణ్ ఖర్చుకు వెనుకాడకుండా సినిమాపై ఉన్న నమ్మకంతో ఎంతో నిజాయితీగా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.నిర్మాతకు ఉన్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ శ్యామ్ కు ఉన్న నాలెడ్జ్ సిందూరం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్లాయి. చివరలో వచ్చే ట్విస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి. మొత్తంగా చెప్పాలి అంటే “సిందూరం” ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఏ సినిమాను నమ్మి వచ్చిన ప్రేక్షకులందరినీ ఈ “సిందూరం” సినిమా అలరిస్తుంది.

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here