Sitayanam Movie Ready for Release in Telugu,Kannada and Tamil

కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం “సీతాయణం”. ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనహిత భూషణ్ కధానాయిక. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. సోమవారం (డిసెంబర్ 21వ తేదీన) హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేకమైన పెళ్లి పాటను పాత్రికేయులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక, హీరో అక్షిత్ శశికుమార్, హీరోయిన్ అనహిత భూషణ్, మధనందన్, సినిమాటోగ్రాఫర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా

దర్శకుడు ప్రభాకర్ అరిపాక మాట్లాడుతూ….ఈ చిత్రం కథానాయకుడు కోణంలో
ఒక అమ్మాయి జర్నీ తాలూకా కాంటెంపరరీ కథే ఈ సీతాయణం.లాక్ డౌన్ కంటే ముందే 90 శాతం షూటింగ్ పూర్తి చేశాం.లాక్ డౌన్ తరువాత మిగిలిన 10 శాతం పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాను బ్యాంకాక్,హైదరాబాద్,బెంగళూర్,మంగళూరు,అగుంబే, తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం.ఇందులో ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించాం.అది వాల్మీకి రామాయణంలో ఉండే శ్లోకాన్ని తొలిసారిగా ధ్వని రూపంలో తీసుకొచ్చాం ఇది శతాబ్దాల తరబడి ఒక పెళ్లి వెడ్డింగ్ కార్డు పై వస్తున్న పదం.అయితే గాత్ర రూపంలో ఇంతవరకూ లేదు,దాన్ని మేము వెడ్డింగ్ కార్డు లో ఉండే శ్లోకాన్ని సౌండ్ రూపంలో తొలిసారిగా తీసుకొచ్చాం.ఇందులో పాటలన్నీ మంచి మెలోడీస్ గా రూపొందించడం జరిగింది. చంద్రబోస్ అనంతశ్రీరామ్ లు సాహిత్యం అందించారు.మనసు పలికే పాటను ఇటీవల వీడియోగా రిలీజ్ చేశాం.శ్వేతామోహన్ పాడిన బ్రీత్‌లెస్ పాట అందర్ని ఆలరిస్తున్నది‘‘.ఈ సినిమా ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం మా నిర్మాత లలిత రాజ్యలక్ష్మి గారు నన్ను,నా కథను నమ్మి నాకీ అవకాశం ఇచ్చారు వారికి నా కృతజ్ఞతలు..అలాగే కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ గారు కూడా ఈ కథను నమ్మి వారి అబ్బాయిని, పరిచయం చేసే అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు అని అన్నారు …

నటుడు మధునందన్ మాట్లాడుతూ…దర్శకుడు నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా కొత్తగా అనిపించింది. నాకు ఇందులో మంచి పాత్ర ఇచ్చారు.ఈ సీతా యాణం లో నేను ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. అక్షిత్ కన్నడ వాడైనా చాలా బాగా నటించాడు. డైరెక్టర్ కు ఇది మొదటి సినిమా అయినా సరికొత్త పాయింట్ కాకుండా బోల్డ్ పాయింట్‌తో తెరకెక్కించారు. ఇందులో నటీనటులందరూ చక్కగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శక,నిర్మాతలు మరిన్ని సినిమాలు తియ్యాలని అన్నారు ..

హీరో అక్షిత్ శశికుమార్ మాట్లాడుతూ…నేను బెంగళూరులో పుట్టిపెరిగాను నాకు తెలుగు పూర్తిగా రాకపోయినా రఘునందన్, ప్రభాకర్ గార్ల సపోర్ట్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాం. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చి నన్ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నా దర్శక,నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు

హీరోయిన్ అనహిత భూషణ్ మాట్లాడుతూ…సినిమాలో నటించడానికి భాష అవసరం లేదు.నాకు తెలుగు రాకపోయినా చిత్ర యూనిట్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు..

సినిమాటోగ్రాఫర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమాలో పనిచేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. అందరికీ ఈ సినిమా తప్పక నచ్చుతుందని అన్నారు ..

తారాగణం : అజయ్ ఘోష్, మధునంధన్, విధ్యులేఖ రామన్, బిత్తిరి సత్తి, కృష్ణ భగవాన్, గుండు సుదర్శన్, అనంత్, జబర్ధస్ట్ అప్పారావు, టి యన్ ఆర్, మధుమణి, మేఘనా గౌడ తదితరులు.

సాంకేతిక నిపుణులు: 
రచన & దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక
కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: అనీష్
సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here