“SR Kalyanamandapam EST 1975” Theatrical Trailer Launched by Asian Films Head Narayan Das

“SR క‌ళ్యాణమండపం EST 1975” చిత్రం టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఈ సినిమాలో విడుద‌ల చేసిన పాట‌లు,టీజ‌ర్ కి యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తో  టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో  రాజావారు రాణిగారు’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సివాలా చిత్రంతో ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నూత‌న దర్శ‌కుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో  ప్ర‌మోద్, రాజు లు నిర్మిస్తున్న చిత్రం  ‘ SR కళ్యాణమండపం – Est. 1975 ‘ .  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు,శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు.ఆగస్ట్ 6 న ఈ చిత్రం విడుదల చేస్తున్న సందర్భంగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఎఎంబి మాల్ లో  విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ఏషియన్ ఫిలిమ్స్ అధినేత నారాయణ్ దాస్,డైలాగ్ కింగ్ సాయి కుమార్ లు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు..ఇంకా ఈ కార్యక్రమంలో  ఆర్.ఎక్స్ హండ్రెడ్ నిర్మాత అశోక్ రెడ్డి, చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్, శ్రీకారం డైరెక్టర్ కిషోర్, డైరెక్టర్ కోడిరామకృష్ణ కూతురు దీప్తి , ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ ముత్యాల రాందాస్, మరియు చిత్రం బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు  అనంతరం  

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ.. నేను అమ్మ కడుపులో వున్నపుడే నా నట ప్రస్థానం కొనసాగింది.మా అమ్మ కూడా సినిమాలో యాక్ట్ చేసే వారు.అలా నేను 10 సంవత్సరాల వయసులో “మయసభ” లో బాల నటుడిగా నటించాను. నిన్నటితో నాకు 60 సంవత్సరాలు పూర్తి అయితే చిత్ర పరిశ్రమలో నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.మా అమ్మ, నాన్న దగ్గర నుండి మా అబ్బాయి అది సాయికుమార్ వరకు మా కుటుంబంలో అందరం నటులమే..అయినా ఇంకా మంచి వేషాలు వేయాలని, ఏదో కొత్త పాత్రలో నటించాలని కోరిక ఉండేది.ఆ కోరిక ఈ సినిమాతో తీరింది.ఇందులో నేను ఇంతవరకు చెయ్యని పాత్ర ఇందులో నటిస్తున్నాను.కల్యాణ మండపం అంటేనే ఫ్యామిలీ.. అందరూ కలసి అద్భుతమైన వేడుక చేసుకొనే వెదికే కళ్యాణమండపం.  ‘ప్రతి తండ్రి తన కొడుకుతో కలసి చూడవలసిన సినిమా SR కళ్యాణ మండపం. దర్శక నిర్మాతలు సినిమా ను చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రమోద్ -రాజు సైలెంట్ గా వున్నా పెద్ద నిర్మాతలు అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి.మంచి ప్రయత్నం తో చక్కటి సినిమాను అందించారు ప్రేక్షకులందరూ తమ ఫ్యామిలీ తో వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించి మా సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

చిత్ర నిర్మాతలు ప్రమోద్ – రాము లు మాట్లాడుతూ.. చదువుకొనే వయసులో చదువుకోక పోతే ఎం జరుగుతుందనేది ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాము. మేము విడుద‌ల చేసిన పాట‌లు,టీజ‌ర్ కి యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తో మేము ఊహించని విధంగా రెస్పాన్స్ ఇచ్చారు ప్రేక్షకులు వారికి మా ధన్యవాదాలు. దర్శకుడు చాలా చక్కటి కథను మాకందించాడు. సాయి కుమార్ గారి నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.  ఆగస్ట్ 6 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న మా  సినిమా SR కళ్యాణమండపం – Est. 1975 ‘ బాక్స్ ఆఫీస్ బద్దలు కోట్టడానికి వస్తుంది. ప్రేక్షకులందరినీ మా చిత్రం తప్పక ఎంటర్ టైన్ చేస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె మాట్లాడుతూ…ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే క‌థ‌తో ఎంతో ఆస‌క్తిగా రూపొందిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఎంతో వినోదాత్మక అంశాలతో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాలో  ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ హీరో తండ్రి పాత్ర  పోషించారు. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని గొప్పగా చూపించే ప్ర‌య‌త్నం చేయడం జ‌రుగింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పుడు మేము విడుదల చేసిన ట్రైలర్ ను చూసిన వారంతా బాగుందని ఆఫ్రిసియేట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ కంటే పదింతలు ఈ సినిమా ఉంటుంది. ఆగస్ట్ 6 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న  మా చిత్రం అందరినీ అలరిస్తుందని అన్నారు.

ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. సెల్యూలాయిడ్ పై సాయి గారు ఇందులో చాలా చక్కగా నటించారు.యూత్ అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. తండ్రి కోడుకులుగా కిరణ్, సాయికుమార్ ల నటన అద్భుతంగా నటించారు.చక్కటి కథతో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరపు మాట్లాడుతూ.. మా సినిమానుండి విడుదల చేసిన ప్రతి కంటెంట్ కు  ప్రేక్షకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు వారికి నా ధన్యవాదాలు. మేము ఎంతో కష్టపడి సినిమా తీశాము.నిర్మాతలకు మధ్యలో ఓటిటి ఆఫర్ వచ్చినా కూడా మేము తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు థియేటర్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వాలని  ఇప్పటివరకు  వెయిట్ చేశారు.థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ సినిమా చూపించాము.  చూసిన వారందరూ కూడా మేము అనుకున్న దానికంటే సినిమా బాగుందని ప్రశంసించారు. మా సినిమాను  థియేటర్స్ లొనే విడుదల చెయ్యాలని ఆగస్ట్ 6 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము .  మా SR కళ్యాణమండపం – Est. 1975 ‘సినిమా కు వస్తే ప్రేక్షకులు అందరూ తప్పక ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు..

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఆగస్ట్ 6 న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు.

తారాగ‌ణం –
కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ తులసి శివమణి, అరుణ్ కుమార్, అనిల్  జీలా, కష్యప్ శ్రీనివాస్. త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ – ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్
వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ – శంక‌ర్ పిక్చ‌ర్స్
నిర్మాత‌లు – ప్ర‌మోద్, రాజు
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కిర‌ణ్ అబ్బ‌వరం
ద‌ర్శ‌కుడు – శ్రీధ‌ర్ గాదే
సంగీతం – చేత‌న్ భ‌ర‌ద్వాజ్
కెమెరా – విశ్వాస్ డేనియ‌ల్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – భ‌ర‌త్
లిరిక్స్ – భాస్క‌రభ‌ట్ల, క్రిష్ణ కాంత్
పీఆర్ఓ – ఏలూరుశ్రీను, మేఘ‌శ్యామ్
ఆర్ట్ – సుధీర్
డిఐ – సురేశ్ ర‌వి
ఫైట‌ర్ – శంక‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here